డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కారు విండ్‌షీల్డ్‌పై మంచుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా అయితే చేయవద్దు..!!

భారత్‌లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. ఫలితంగా వాహనాల విండ్‌షీల్డ్‌ పైన మంచు పేరుకుపోతోంది. ఫలితంగా రహదారులు సరిగా కనిపించక వాహనదారులు అనేక ఇబ్బందులు ( Defog Car Windshield ) ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయి.

విజిబిలిటిని పెంచుకొనేందుకు తరచూ విండ్‌షీల్డ్‌ను క్లాత్ లేదా ఇతర వస్తులతో శుభ్రం చేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కిటికీలను కిందకు దించి ప్రయాణాలు చేస్తున్నారు. అయితే బయట ఉన్న దుమ్ము కారులోనికి వచ్చి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

remove-fog-from-windscreen

మరికొందరు డ్రైవర్లు పొగమంచుతో కప్పబడిన విండ్‌షీల్డ్‌ తోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా చేయడం కారణంగా కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొందరు AC హీటర్‌ను వినియోగిస్తున్నారు. విండ్‌షీల్డ్‌లోకి వేడి గాలి వీస్తే మంచు తొలగిపోతుందని పలువురు భావిస్తారు.

శీతాకాలంలో కారు లోపలి భాగం ఉష్ణోగ్రత కంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఫలితంగా విండ్‌స్క్రీన్‌ బయట భాగం అస్పష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో హీటర్లతో సమస్య పరిష్కారం (Winter Driving Tips) కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కారులో ACని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా కారు లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా కారు విండ్‌షీల్డ్‌ మంచు పేరుకుపోకుండా ఉంటుంది.

How to defog car windshield

శీతాకాలంలో విండ్‌షీల్డ్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. విండ్‌షీల్డ్‌ దుమ్ముతో ఉంటే మంచు కురుస్తున్నప్పుడు విజిబిలిటీ మరింత తగ్గుతుంది. విజిబిలిటీ తగ్గిన సందర్భాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు శీతాకాలంలో పరిమిత వేగం సహా ముందున్న వాహనంలో కొంచెం దూరంలోనే ప్రయాణం చేయాలి.

* పొగ మంచు దట్టంగా కురుస్తున్న సమయంలో ప్రయాణం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు సైతం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అయితే పొగమంచు కురుస్తున్న ప్రాంతాలున్న రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

how to prevent fogging on car windshield

* లోబీమ్‌ లైట్లనే వినియోగించాలి : చాలా మంది డ్రైవర్లు సరైన అవగాహన లేకుండా పొగమంచు కురుస్తున్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హైబీమ్‌ లైట్లను వినియోగిస్తారు. హైబీమ్‌ లైట్లు ఎక్కువ కాంతినిస్తాయని భావిస్తారు. అయితే ఈ హైబీమ్‌ లైట్ల కారణంగా వచ్చే కాంతి పొగమంచులో కలిసిపోతుంది.

అదే హైబీమ్‌ లైట్లకు బదులుగా లోబీమ్‌ లైట్లను వినియోగించడం ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ ఉనికి తెలుస్తుంది. ఫలితంగా ముందుగా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు పొగమంచు ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా ఫాగ్‌ లైట్లను వినియోగించడం ఉత్తమం

దట్టమైన పొగమంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వార్నింగ్ లైట్‌ను ఆన్‌ చేసుకొని ప్రయాణించడం ఉత్తమం. ఫలితంగా మనకు ఎదురుగా, వెనుక వచ్చే వాహనదారులు మన వాహనం ఉనికిని గుర్తించే అవకాశం ఉంటుంది. మరియు పొగమంచు సమయంలో వీలైనంత నెమ్మదిగా డ్రైవింగ్‌ చేయడం చాలా ఉత్తమం. మరియు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

* స్పీకర్ల సౌండ్‌ తగ్గించండి : పొగ మంచులో ప్రయాణం చేస్తున్న సమయంలో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం మంచి అనుభూతిని కలిగించినా.. ఇలాంటి రోడ్లపై మ్యూజిక్‌ సిస్టమ్‌ సౌండ్‌ను వీలైనంత తక్కువగా ఉంచాలి. లేదా పూర్తిగా సౌండ్‌ ఆఫ్‌ చేసినా మంచిది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, January 18, 2024, 18:33 [IST]
English summary
How to defog car windshield here are the driving tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+