నేల మీదే కాదు, 12 అడుగులు లోతున్న నీటిలో కూడా పరుగులు పెడుతుంది...!!

Written By:

12 అడుగులు లోతున్న నీటిలో నడవగలిగిందంటే దీన్ని కేవలం జీపు మాత్రమే కాదు, సబ్‌మెరైన్ అని కూడా పిలవచ్చు. డీజల్ ఇంజన్ గల వ్రాంగ్లర్ ఈ మధ్య కాలానిది కాదు, దీని వయస్సు సుమారుగా 20 ఏళ్లుగా ఉంది.

నీటిలో నడిచే జీపు

ఫోర్ వీలర్ డ్రైవ్ సిస్టమ్ ఎక్స్‌పర్ట్ డర్ట్ ఎవరీ డే టీమ్ లోని సభ్యుడు ఫ్రెడ్ విలియమ్స్ తన జీపుకు అనేక మోడిఫికేషన్స్‌ నిర్వహించాడు. రూఫ్ టాప్ తొలగించి ట్యూబ్‌సాక్ అనే పేరును కూడా జీపుకుపెట్టాడు.

నీటిలో నడిచే జీపు

డర్ట్ ఎవరీ డే బృందం అనేక అడ్వెంచర్ రైడింగ్స్ చేశారు. అయితే నీటి అడుగులో డ్రైవ్ చేయడానికి నిశ్చయించుకున్నారు ఈ బృందం సభ్యులు. అందుకు తమ జీప్ వ్రాంగ్లర్‌లోని ఇంజన్‌తో పాటు అనేక మార్పులు జరిపారు.

నీటిలో నడిచే జీపు

జీప్ వ్రాంగ్లర్‌లో 2.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 160హార్స్ పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ (266 ఫూట్ పౌండ్ నీటిలో టార్క్) ఉత్పత్తి చేయును.

నీటిలో నడిచే జీపు

నిజానికి 4బిటి ఇంజన్‌ కన్నా ఇందులో అందించిన ఇంజన్ బరువు తక్కువగా ఉంటుంది. దీని బరువు 300 పౌండ్లుగా ఉంది.

నీటిలో నడిచే జీపు

ఈ జీపు పూర్తిగా నీటిలో మునిగిపోనుంది కాబట్టి, వెహికల్ క్రింది భాగంలో ఉన్న దాదాపు అన్ని ప్రధానమైన భాగాలను నీటితో తడవకుండా మోడిఫేచేయడం జరిగింది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వైర్లు.

నీటిలో నడిచే జీపు

ఇక ఇంజన్‌కు కావాల్సిన గాలి మరియు ఇంజన్ విడుదల చేసే ఉద్గారాలను వెలువరించేందుకు రెండు పెద్ద గొట్టాలను అమర్చడం జరిగింది. నీరు లోపలికి చేరకుండా వీటిని పూర్తిగా సీల్ చేశారు.

నీటిలో నడిచే జీపు

సాధారణంగా పెట్రోల్‌తో పోల్చుకుంటే డీజల్ ఇంజన్‌లు నీటిలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు ట్రాక్టర్లు మరియు అడ్వెంచర్ జీపులు. కాబట్టి నీటి గర్భంలో ప్రయాణించేందుకు డీజల్ ఇంజన్ గల జీపునే ఎంచుకున్నారు.

నీటిలో నడిచే జీపు

అయితే యాక్సిల్స్ మరియు ట్రాన్స్‌మిషన్ గురించి కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీటిని పీల్చుకునే అవకాశం వీటికి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ బృందం జీపుతో నీటిలోకి దిగడం జరిగింది.

నీటిలో నడిచే జీపు

నీటిలోపల ఉన్న మట్టి మరియు పాచి జీపును ముందుకు కదలనివ్వకుండా చేసాయి. అయితే జీపు మాత్రం విజయవంతంగా 12 అడుగుల లోతు వరకు విజయవంతంగా వెళ్లి బయటకు రాగలిగింది.

 
English summary
How To Drive Jeep All The Way Under Water
Story first published: Monday, March 27, 2017, 17:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark