అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడానికి వర్షాకాలంలో డ్రైవ్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ప్రత్యేకించి వర్షాకాలంలో రోడ్డుపై అనేక ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో అవసరం. అకస్మాత్తుగా వచ్చే వరదలు, రోడ్డుపై నీటితో నిండిన గంటలు, నోర్లు తెరచుకునే మ్యాన్‌హోల్స్, జారుడు స్వభావం కలిగిన రోడ్లు ఇలా అనేక అవాంతరాలను డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

తెలియని రోడ్లపై డ్రైవ్ చేయకండి

వర్షాకాలంలో, ఎల్లప్పుడూ తెలిసిన రహదారిని ఉపయోగించడమే మంచిది. ఎందుకంటే, వరద నీటి కారణంగా మీకు తెలిసిన రహదారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ముందుగానే తెలిసి ఉంటుంది కాబట్టి, వీలైనంత వరకూ మీకు బాగా గుర్తున్న రోడ్లపైనే ప్రయాణించడం మంచిది. అలాకాకుండా, కొత్త రూట్లలో ప్రయాణించాలనుకుంటే, ఆ రోడ్డు స్థితిగతులు ఏంటో మీకు తెలియకపోవచ్చు. ఫలితంగా, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వీలైనంత వరకూ వరదనీటిలో కారును నడపటానికి ధైర్యం చేయకండి.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

వరదనీటిలో కారు ఆగిపోయినట్లయితే ఇంజన్‌ను క్రాంక్ చేయవద్దు

వరదల సమయంలో నీటి లోతును నిర్ధారించడం కష్టం కాబట్టి, పూర్తిగా నీటితో నిండిపోయిన రోడ్లపై ప్రయాణించకపోవడమే సురక్షితం. లోతట్టు ప్రాంతాల గుండా కారులో ప్రయాణిస్తే, ఇంజన్ లోకి మరియు క్యాబిన్ లోకి నీరు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ, దురదృష్టవశాత్తు మీ కారు వరదలో ఆగిపోయినట్లయితే, కారును స్టార్ట్ చేయడానికి ఇంజన్‌ను క్రాంక్ చేయవద్దు, ఎందుకంటే ఇలా చేయడం వలన ఇంజన్‌లోకి నీరు చేరవచ్చు మరియు ఇది ఇంజన్‌ను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితిలో టో ట్రక్కు సాయంతో కారును సురక్షితమైన ప్రాంతానికి తరలించడం మంచిది.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

వరద నీటిని స్ప్లాష్ చేస్తూ డ్రైవ్ చేయవద్దు

సాధారణంగా చాలా మందికి తమ వాహనాలతో వరద నీటిని స్ప్లాష్ చేయడం అనేది ఓ సరదాగా ఉంటుంది. అంతేకాకుండా, ఇలా చేయడం వలన కారు దిగువ భాగంలో ఉండే మురికి కూడా తొలగిపోతుందని కొందరు అభిప్రాయపడొచ్చు. నిజానికి, ఇలా చేయడం వలన వచ్చే ప్రయోజనాల కన్నా దుష్ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. కారు ద్వారా స్ప్లాష్ చేయబడే నీటికి మీ బంపర్‌ను తొలగించేంత శక్తి ఉంటుంది. అంతేకాకుండా, వాటర్ స్ప్లాష్ కారు దిగువ భాగంలో ఎక్కువ ధూళిని నిక్షిప్తమయ్యేలా చేస్తుంది.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

సడెన్ బ్రేక్ లను వేయడం మానుకోండి

వర్షాకాలమే కాదు ఏ కాలమైనా సరే అవసరం లేకుండా సడెన్ బ్రేక్ వేయడం అనేది చాలా ప్రమాదకరం. అత్యవర పరిస్థితి ఏర్పడితే తప్ప అనవసరంగా సడెన్ బ్రేక్స్ వేయకూడదు. ప్రత్యేకించి వర్షాకాలంలో సడెన్ బ్రేక్ వేయడం వలన మీ కారును వెనుకగా వచ్చే వాహనం మీ వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది ఇంజన్ లోపలికి నీరు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. సడెన్ బ్రేకింగ్ కారణంగా ఇంజన్ రెవ్స్ పడిపోయినప్పుడు నీరు ఇంజన్‌లోకి ప్రవేశించవచ్చు మరియు ఇది వాక్యూమ్‌ను సృష్టిస్తుంది మరియు వరద నీరు ఎగ్జాస్ట్ ద్వారా కూడా ఇంజన్‌లోకి ప్రవేశించవచ్చు.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

ఔటర్ లేన్‌లో డ్రైవింగ్ మానుకోండి

రహదారి బయటి లేన్‌లు సాధారణంగా తక్కువగా ధృడంగా ఉంటాయి. కాబట్టి, వర్షాకాలంలో ఇలా రోడ్డు పక్కగా డ్రైవ్ చేయడం అంత సురక్షితం కాదు. సాధారణంగా వర్షాకాలంలో రహదారి పక్కగా ఉండే రోడ్లు వర్షపు నీటికి నానిపోయి నేల వదులుగా ఉంటుంది. కాబట్టి, ఇలాంటి రోడ్డుపై ప్రయాణిస్తే మీ వాహన చక్రాలు బురదలో కూరుకుపోవడం లేదా వాహనం రోడ్డు పక్కకు ఒరిగిపోవడం జరగవచ్చు.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

వరద గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, వేచి ఉండండి

వర్షం ఎక్కువగా కురుస్తున్నప్పుడు మరియు రహదారిపై వరద నీటి పరిస్థితి గురించి మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు వర్షం మరియు వరద రెండూ తగ్గే వరకూ వేచి ఉండండి. ఇలా చేయడం వలన మీ విలువైన సమయం కొంత వృధా అయినప్పటికీ, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చు. మీ గమ్యం చేరుకోవడానికి ఆలస్యమవుతుందని కారును వరద నీటి గుండా నడిపితే, ఆ తర్వాత కారు రిపేర్ల కోసం వెచ్చించే ఖర్చు మిమ్మల్ని బాధించవచ్చు.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

రద్దీగా ఉండే ట్రాఫిక్ లో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కాస్తంత కష్టమైన పనే అయినప్పటికీ, ఇలా చేయడం చాలా మంచిది. ప్రత్యేకించి వర్షాకాలంలో రద్దీగా ఉండే ట్రాఫిక్ లో ప్రయాణించడం అంత సురక్షితం కాదు. అంతేకాకుండా, ఇలా చేయడం వలన మీరు అవసరంగా ఇంధనాన్ని వృధా చేయడమే కాకుండా, ఎక్కువ సమయం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కారణంగా మీ మనశ్సాంతి కూడా దెబ్బతింటుంది. వర్షాకాలంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనిపించినప్పుడు అదే తగ్గేవరకూ ఎక్కడైనా వేచి ఉండి, ఓ వేడి వేడి కాఫీనో టీనో తాగి సాఫీగా మరియు సురక్షితంగా మీ ప్రయాణాన్ని సాగించడం మంచిది.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

కారులో ఎల్లప్పుడు తగినన్ని స్నాక్స్ మరియు వాటర్ ఉండేలా చూసుకోండి

వర్షాకాలంలో ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్‌లు ఉండటం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి గంటల నుండి రోజుల సమయం పట్టవచ్చు. కాబట్టి, ట్రాఫిక్ తగ్గేవరకూ మిమ్మల్ని మీరు ఆకలిదప్పుల నుండి కాపాడుకోవాలంటే, కారులో తగినన్ని స్నాక్స్ మరియు నీరు ఉండేలా చూసుకోండి. ప్రత్యేకించి, చిన్నారులతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ విషయంలో మరింత ముందు జాగ్రత్తతో వ్యవహరించండి. ఎనర్జీ బార్‌లు, ఓఆర్ఎస్ సప్లిమెంట్స్, వాటర్ బాటిళ్లు, ప్యాక్డ్ ఫుడ్స్‌ని కారులో స్టోర్ చేసుకోండి.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

వరద నీటిలో యాక్సిలరేటర్‌పై కాలు తీయకండి

ఒకవేళ మీరు తెలిసో తెలియకో వరదలు ఉన్న రహదారి గుండా ప్రయాణిస్తుంటే మరియు వరద నీటి మట్టం మీ కారు ఎగ్జాస్ట్ పైప్ లెవెల్‌లో ఉంటే, పడిపోతున్న రెవ్‌ల కారణంగా ఎగ్జాస్ట్ పైపు నుండి నీరు ఇంజన్ లోకి చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ సమయంలో మీరు వేగాన్ని తగ్గించినప్పటికీ, యాక్సిలరేటర్ పెడల్‌పై మాత్రం కాలు తీయకుండా ఇంజన్ రేజ్ చేస్తూనే ఉండండి. ఇలా చేయడం వలన సైలెన్సర్ పైప్ నీటిని బయటకు చిమ్ముతూ, ఇంజన్ లోకి చేరకుండా చూసుకుంటుంది.

అన్నా కొంచెం చూసుకొని నడపరాదే..! వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎలా..?

బ్రేక్‌లు, లైట్లు, వైపర్‌లు మరియు వాషర్‌లను తనిఖీ చేయండి

కార్లను ఆయా కాలాలకి తగినట్లుగా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ప్రత్యేకించి వర్షాకాలం వస్తుందంటే, కారు యొక్క బ్రేక్‌లు, హెడ్ లైట్లు, వైపర్ మరియు వాషర్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే, భారీ వర్షాల సమయంలో ఇవి చాలా కీలకంగా పనిచేస్తాయి. అలాగే, కారులో ఎల్లప్పుడు ఒక జత కొత్త హెడ్‌లైట్స్ ని ఉంచుకోవడం కూడా మంచిది. ఒకవేళ పాత లైట్స్ కాలిపోయినట్లయితే, ఆ వెంటనే వాటిని కొత్త వాటితో భర్తీ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
How to drive safely in rainy season monsoon driving tips
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X