మునిగిపోతున్న కారులోంచి తప్పించుకోవాలంటే ఇలా చేయండి!!

వర్షాకాలంలో వరదల్లో కార్లు మునిగిపోయిన సందర్భాలు చూశాం. అంతేకాకుండా ప్రమాదవశాత్తు చెరువులు, నదుల్లో కార్లు మునిగిపోవడం చూశాం. ఇవి రోడ్డు ప్రమాదాల కంటే కూడా భయంకరమైనవి. ఆ సమయంలో మరొకరి సాయం లేకుండా బయటకు రావడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అటువంటి ప్రమాదాలు ఎదురైతే సులభంగా బయటపడవచ్చు.

ప్రమాదవశాత్తు మీరు కారుతో సహా నీళ్లలో మునిగిపోయినట్లయితే.. ముందుగా మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మీరు, మీతో పాటు ఉన్న వారిని మునిగిపోతున్న కారు నుండి తప్పించడానికి మంచి అవకాశం ఉంది. అది ఎలా.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో చదవండి.

Sinking-Car

కారులో నీళ్లలో మునిగిపోయిన వెంటనే ముందుగా మీ సీట్‌బెల్ట్‌ను తొలగించండి. ఇంకా విండోను తెరవాలి. ఒకవేళ తెరుచుకోకపోతే పగలగొట్టండి. అనంతరం మీరు, మీతో పాటు ఉన్నవారితో సహా బయటకు రండి. కారులో ముందుగా పిల్లలుంటే వారిని బయటకు తీయడం ఉత్తమం. ఇందుకోసం మీ కారులో విండోను పగలగొట్టడానికి సుత్తి లాంటి సాధనాన్ని ఎల్లప్పుడూ కారులో ఉండేలా చూసుకోండి.

కారు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు కారును మీరే నడుపుతున్నట్లయితే.. ముందుగా మీరు రెండు చేతులను స్టీరింగ్ వీల్‌పై "10 మరియు 2" స్థానాల్లో ఉంచండి. మీ కారు నీటిలో పడిపోవడం వల్ల మీ వాహనంలోని ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టీరింగ్‌ వీల్‌పై మీ పొజిషన్‌ను మార్చకుండా అలాగే కూర్చోవాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

Sinking-Car

ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు భయపడినట్లయితే మీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. రెండుసార్లు డీప్‌ బ్రీత్‌ తీసుకోండి. ఆ తర్వాత ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ తర్వాత కార్యాచరణపై దృష్టి సారించండి. ఈ సమయంలో ఒక్క నిమిషం లోపలే మీరు బయటపడగాలి. లేదంటే కారు పూర్తిగా మునిగిపోతే బయట పడటం కష్టం.

కారులో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ముందుగా వారిని కాపాడాలి. అందుకోసం మీరు ముందుగా సీటు బెల్టును తొలగించాలి. సీటు బెల్టు ఉన్నట్లయితే మీరు ఫ్రీగా కదలలేరు. కాబట్టి సీటుబెల్టును తొలగించి వారిని సురక్షితంగా బయటకు పంపించండి. మీ సీట్‌బెల్ట్‌ను తీసివేసిన తర్వాత, విండో స్థాయి కంటే నీరు పెరగడానికి ముందు మీ విండోను తెరవడానికి ప్రయత్నించండి.

Sinking-Car

అంతే కానీ డోర్లు తీయడం ద్వారా తప్పించుకోవచ్చని భావించకండి. ఎందుకంటే డోర్లు తీసినట్లయితే అధిక పీడనంతో నీరు కారులోకి చేరి త్వరగా మునిగిపోయే అవకాశం ఉంది. నీటి పీడనం తాకి డోర్‌ తెరడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే విండో ద్వారా బయటకు వచ్చేలా చూడండి. విండోను ఓపెన్‌ చేయడానికి కుదరకపోతే వీలైతే పగలగొట్టండి.

కారు మునిగిపోయే ముందు మీరు విండోను తెరవలేకపోతే, మీరు డోర్ ద్వారా బయటపడటానికి ప్రయత్నించండి. కారులో గాలి ఉన్నప్పుడే నెమ్మదిగా, డీప్‌ బ్రీత్‌ను తీసుకోండి. ఆ తర్వాత దగ్గరగా ఉన్న డోర్లను అన్‌లాక్ చేయండి. కారు పూర్తిగా నీటితో నిండిపోయే లోపల మీరు డోర్‌ తెరిచి బయటకు తప్పించుకోవాలి. కారు పూర్తిగా నీటితో నిండటానికి నిమిషం నుంచి 2 నిమిషాల సమయం పడుతుంది.

సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత పైకి చేరుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏ మార్గంలో ఈత కొట్టాలో తెలియకుంటే, వెలుతురు ఉన్న వైపు ఈత కొట్టండి లేదా పైకి వెళుతున్నప్పుడు మీరు చూసే బుడగలను అనుసరిస్తూ వెళ్లండి. ఆ సమయంలో మీరు రాళ్ళు, కాంక్రీట్ వంతెన పిల్లర్స్‌ లేదా పడవలను దాటడం వంటి అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ సమయంలో గాయాలు కాకుండా చూసుకోండి.

మీరు సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకుని పైకి వచ్చిన తర్వాత, వెంటనే దగ్గర్లోని మీ సన్నిహితులకు సమాచారం అందించండి. ఒకవేళ మీ ఫోన్‌ నీళ్లలోనే పడిపోయినట్లయితే అటుగా వెళ్తున్న వారిని సహాయం అడగండి. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి చేరుకుని చికిత్స తీసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, August 21, 2023, 18:05 [IST]
English summary
How to escape from a sinking car precautions and tips in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+