కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

కార్లలో విండ్‌షీల్డ్ అనేది కారులో చాలా ముఖ్యమైన భాగం. ఆటోమొబైల్ భద్రతలో విండ్‌షీల్డ్ పోషిస్తున్న పాత్రను అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతూ ఉంటారు. విండ్‌షీల్డ్ యొక్క దృశ్యమానత (విజిబిలిటీ) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి, మనం కారును ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో కారు యొక్క విండ్‌షీల్డ్‌ను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

చాలా మంది కారు విండ్‌షీల్డ్‌లను కేవలం వంపుతిరిగిన గాజు ముక్కగానే పరిగణిస్తారు. వాస్తవానికి, విండ్‌షీల్డ్ అనేది కేవలం "సింపుల్ కర్వ్డ్ గ్లాస్" కంటే చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ వంపు తిరిగిన గాజు ముక్కలో చాలా ఇంజినీరింగ్ ప్రతిభ దాగి ఉంది. సంవత్సరాలుగా సాంకేతికత అభివృద్ధి చెందడంతో విండ్‌షీల్డ్‌లు కూడా అనేక పరిణామాలకు లోనయ్యాయి. ప్రతి పరిణామం కూడా విండ్‌షీల్డ్‌లను మరింత సురక్షితంగా మారేలా చేసింది.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

ప్రస్తుతం, మనం ఉపయోగిస్తున్న కార్ల యొక్క ఫ్రంట్ విండ్‌షీల్డ్ మూడు పొరలతో కూడిన లామినేటెడ్ గాజుతో తయారు చేయబడి ఉంటుంది. ఇందులో మొదటి పొర మరియు చివరి పొర గాజుతో ఉంటే, మధ్యలో పొర వినైల్ తో తయారు చేయబడి ఇరువైపులా గాజును అంటిపట్టి ఉండే జిగురు (గ్లూ)ని కలిగి ఉంటుంది. ఈ వినైల్ పొర రెండు గాజు పొరల మధ్య శాండ్‌విచ్ చేయబడి ఉంటుంది మరియు ఈ పొరలన్నీ కూడా ఇండస్ట్రియల్ ఓవెన్‌లో తీవ్రమైన వేడి మరియు ఒత్తిడితో ట్రీట్ చేసిన తర్వాత ఒకదానితో ఒకటి అంటుకుని ఉంటాయి.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

ఇదంతా వినడానికి చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ, దీని తయారీ ప్రక్రియలో అనేక జాగ్రత్తలు మరియు నైపుణ్యాలు దాగి ఉన్నాయి. కాబట్టి, కారు యొక్క ఫ్రంట్ విండ్‌షీల్డ్ అనేది కేవలం దుమ్ము ధూళిని నివారించే ఓ గాజు ముక్క మాత్రమే కాదు. అయితే, మనం తీసుకునే అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా మనం నిత్యంత నడిపే డ్రైవింగ్ పరిస్థితుల వల్ల కావచ్చు కార్ విండ్‌షీల్డ్ లు తరచుగా పాడవుతుంటాయి. ప్రత్యేకించి, వాటిపై ఎక్కువగా గీతలు పడుతుంటాయి.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

ఇలా విండ్‌షీల్డ్‌పై కనిపించే గీతలు చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఎదురుగా వచ్చే ట్రాఫిక్ నుండి వచ్చే లైట్లకు అంతరాయం కలిగిస్తాయి. అంతే కాకుండా, పాత విండ్‌షీల్డ్ వైపర్‌లు కూడా విండ్‌షీల్డ్ ఉపరితలంపై గీతలు పడటానికి కారణం కావచ్చు. విండ్‌షీల్డ్‌పై కనిపించే గీతలు వర్షాకాలం సమయంలో రహదారిపై మీ దృష్టికి అంతరాయాన్ని కలిగించవచ్చు.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

విండ్‌షీల్డ్‌లు చాలా ఖరీదైనవి కాబట్టి, పాత విండ్‌షీల్డ్‌ని భర్తీ చేయడానికి బదులుగా, కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఆమోదయోగ్యమైన స్థాయి కంటే ఎక్కువ గీతలను తగ్గించడం సాధ్యమవుతుంది. నిజానికి ఈ సాధారణ ప్రక్రియ ఇంట్లో లభించే వస్తువులతోనే చేయవచ్చు మరియు ఇందుకు ఎలాంటి ప్రొఫెషనల్ మెకానిక్ అవసరం ఉండదు. ఆ పద్ధతులు ఏంటో తెలుసుకుందాం రండి.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

టూత్‌పేస్ట్ పద్ధతి

విండ్‌షీల్డ్ లేదా సైడ్ విండో గ్లాసెస్‌పై కనిపించే చిన్నపాటి గీతల కోసం, తెలుపు, నాన్-జెల్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించడం వల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. దీని కోసం, టూత్‌పేస్ట్‌ను అప్లికేటర్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌పై అప్లై చేసి, ప్రభావిత ప్రాంతంపై వృత్తాకార కదలికలో (సర్క్యులర్ మోషన్) సున్నితంగా రుద్దండి. ఈ విధంగా టూత్‌పేస్ట్‌ను అప్లై చేసిన కొద్దిసేపటి తర్వాత, టూత్‌పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతం నుండి శుభ్రమైన పొడి గుడ్డతో తుడిస్తే సరిపోతుంది.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

నెయిల్ పాలిష్ పద్ధతి

ఈ పద్ధతిలో క్లియర్ నెయిల్ పాలిష్ ను మాత్రమే ఉపయోగించాలి. విండ్‌షీల్డ్ పై ప్రభావిత ప్రాంతం యొక్క ఉపరితలంపై నేరుగా క్లియర్ నెయిల్ పాలిష్ ను ఒక పొర మాదిరిగా అప్లై చేయాలి. ఆ తర్వాత అది పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండండి (సాధారణంగా 30 నిమిషాలు సరిపోతుంది). అనంతరం, ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రమైన పొడి గుడ్డతో తుడిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కారు విండ్‌షీల్డ్ పై గీతలు పడ్డాయా..? అయితే ఈ చిన్న చిట్కాలతో వాటిని తొలగించేయండి!

గ్లాస్ రిపేర్ కిట్ పద్ధతి

గ్లాస్ రిపేర్ కిట్ అనేది పేరు సూచించినట్లుగానే ప్రత్యేకించి ఇటువంటి సందర్భాల కోసం తయారు చేయబడిన ఓ ప్రత్యేకమైన కిట్. గ్లాస్ రిపేర్ కిట్ చాలా కార్ యాక్సెసరీ షాపుల్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ కిట్‌లో గ్లాస్ రిమూవల్ సమ్మేళనం ఉంటుంది, మీరు దానిని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాల్సి ఉంటుంది. గ్లాస్ రిమూవల్ కాంపౌండ్‌లోని సెరమ్ ఆక్సైడ్ ప్రభావిత ప్రాంతంలోని గాజుతో రసాయన ప్రతిచర్యలోకి ప్రవేశిస్తుంది మరియు ఇది స్క్రాచ్‌లు, అతుకులను కనిపించకుండా చేస్తుంది.

Most Read Articles

English summary
How to fix scratches on car glass simple methods to clean the glass
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X