బ్రేకింగ్‌ సమయంలో స్టీరింగ్ వీల్‌ వైబ్రేట్‌ అవుతుందా.. మెకానిక్‌ కూడా గుర్తించలేకపోవచ్చు..!

కార్లు కలిగి ఉన్న చాలామందికి వాటిలో తలెత్తే సమస్యల పట్ల సరైన అవగాహన ఉండదు. ఈ కారణంగా వాహనాల్లో చిన్న సమస్య తలెత్తినా సర్వీస్‌ సెంటర్‌కు వెళ్తుంటారు. కనీస అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం.

గుంతల రోడ్లపై కార్లను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు (car driving tips) సాధారణంగా వాహనం లోపల వైబ్రేషన్స్‌ వస్తాయి. అయితే రోడ్లపై ఎటువంటి గుంతలు లేకున్నా.. బ్రేక్‌ వేసినప్పుడు వాహనం లోపల వైబ్రేషన్‌ రావడాన్ని ఎప్పుడైనా గుర్తించారా.. అయితే ఈ సమస్యను కొన్నిసార్లు మెకానిక్ కూడా గుర్తించే అవకాశం లేదు.

why car steering wheel vibrating

స్టీరింగ్ వీల్‌ వైబ్రేషన్ : కారు స్టీరింగ్‌ వీల్‌లో వైబ్రేషన్‌కు (car steering wheel vibration) అనేక రకాల కారణాలున్నాయి. స్టీరింగ్‌ వీల్ మోటార్‌ అమర్చిన భాగం సరిగా లేకున్నా లేదా రిమ్‌లో బెండ్‌ ఉన్నా లేదా అక్కడున్న జాయింట్‌ పేలవంగా ఉన్నా స్టీరింగ్‌ వైబ్రేట్‌ అవుతుంది. ముఖ్యంగా బ్రేక్‌ వేసిన సమయంలో ఈ సమస్యను గుర్తించవచ్చు.

అయితే ముఖ్యంగా బ్రేకులు వేసినప్పుడు (Car Brakes) స్టీరింగ్‌ వీల్‌ వైబ్రేట్‌ అయితే మాత్రం రోటర్లు కారణం. రోటర్లు అంటే బ్రేక్‌ను పట్టుకొనేందుకు బ్రేక్‌ ప్యాడ్‌ను నొక్కి పట్టే పరికరం. రోటర్లు వృత్తాకారంలో ఉంటాయి. బ్రేక్ పెడల్‌పై నొక్కినప్పుడు, అక్కడ రాపిడి ఏర్పడుతుంది. తేలికపాటి బ్రేకింగ్ సమయంలోనూ ఈ వేడి రోటర్‌కు బదిలీ చేయబడుతుంది.

how to fix shaking steering wheel while braking

ఇదే కారణం : ఇలా ఈ వేడి ఉత్పన్నం కావడం ఎక్కువ అవుతుంది. అయితే ఏదో ఒక సమయంలో రోటర్‌ విఫలం అవుతుంది. రోటర్‌ పూర్తిగా చెడిపోయినా, రోటర్‌ మందం తగ్గినా.. బ్రేకింగ్‌ సమయంలో వెలువడే వేడిని తట్టుకోలేకపోతుంది. అప్పుడు బ్రేక్‌ పెడల్‌ కంపిస్తుంది. ఇది కాస్త స్టీరింగ్ వీల్‌కు ప్రసారం అవుతుంది. ఫలితంగా బ్రేకింగ్‌ సమయంలో స్టీరింగ్‌ వీల్‌ వైబ్రేషన్‌ కంపిస్తుంది.

రోటర్ల పనితీరు తనిఖీ చేయాలి : ఇటువంటి సమస్యను మీకు గుర్తిస్తే వెంటనే వెంటనే రోటర్‌ పనితీరును తనిఖీ చేయండి. అవసరం అనుకుంటే వెంటనే మరమ్మతు చేయించండి. అయితే ఈ సమస్యపై సర్వీస్‌ సెంటర్‌కు సరైన అవగాహన లేకుంటే.. స్టీరింగ్ వీల్‌ సమస్య అని చెప్పే అవకాశం ఉంటుంది.

కొత్త రోటర్‌ అమర్చుకోవాలి: అందువల్ల బ్రేకింగ్‌ సమయంలో స్టీరింగ్‌ వీల్‌ వైబ్రేషన్‌ను గుర్తిస్తే, రోటర్‌ కూడా తనిఖీ చేయండి. మీకు ఎటువంటి అవగాహన ఉన్నా రోటర్‌ను తనిఖీ చేయవచ్చు. రోటర్‌ను విడదీస్తే ఇబ్బంది లేకుండా తిరుగుతుంటే రోటర్‌లో ఎటువంటి సమస్య లేదని గుర్తించవచ్చు. లేదంటే కొత్త రోటర్‌ను కొనుగోలు చేసి అమర్చాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, October 20, 2023, 11:00 [IST]
English summary
How to fix shaking steering wheel while braking
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+