ఫ్యాన్సీ నెంబర్ కావాలా, ఎలా పొందాలో తెలుసా: అయితే ఇది మీకోసమే..!!

సాధారణంగా చాలామంది సూపర్ కార్లు లేదా సూపర్ బైకులంటే చాలా ఇష్టం. అయితే ఇలాంటి కార్లకు లేదా బైకులకు సాధారణ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించడం కంటే కూడా ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి చాలా ఖరీదైనవి అనే విషయం అందరికి తెలుసు. అయినప్పటికీ ఇలాంటి నెంబర్ ప్లేట్స్ కొంతమంది ఎగబడి కొనుగోలుచేసి సొంతం చేసుకుంటూ ఉంటారు.

ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ అనేవి సాధన నెంబర్ ప్లేట్స్ సొంతం చేసుకున్నట్లు సొంతం చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్స్ ఆలా పొందాలి అనే మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్:

మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ కోసం తప్పకుండా మొదట ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ ఇ-వేలం ద్వారా జరుగుతుంది. మొదట మీరు వాహనం కొనుగోలు చేసినప్పుడే ఫ్యాన్సీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం మీరు షోరూమ్‌లోని రవాణా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అక్కడ అందుబాటులో ఉన్న ఒక ఫ్యాన్సీ నెంబర్ ఎంచుకోవాల్సి వస్తుంది. నెంబర్ ఎంచుకుని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత నెంబర్ బుక్ చేసుకునే ప్రక్రియ పూర్తవుతుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఫ్యాన్సీ నెంబర్ ఎంచుకునే ప్రక్రియ పూర్తయిన తరువాత నెంబర్ కోసం ఇ-వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో బుక్ చేసుకున్న కస్టమర్లు దానికోసం వేలం వేయాల్సి ఉంటుంది. ఇందులో ఎవరైతే ఎక్కువ ధర పాడతారో వారికి ఈ ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత వేలం పాటలో ఆ నెంబర్ కోసం ఎంత పాడారో అంత మొత్తం చెల్లించాలి ఉంటుంది. ఆ తరువాత ఈ నెంబర్ మీకు కేటాయించబడుతుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఫీజులు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు:

సాధారణంగా ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఫీజులు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఫ్యాన్సీ నంబర్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు ఇతర చార్జీలు మొత్తం తిరిగి చెల్లించబడే అవకాశం లేదు. ఫ్యాన్సీ నెంబర్ సూపర్ ఎలైట్, సింగిల్ డిజిట్, సెమీ ఫ్యాన్సీ మరియు ఇతర రకాల నెంబర్స్ అని నాలుగు వర్గాలుగా విభజించడం జరుగుతుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఇందులో సూపర్ ఎలైట్ వర్గానికి చెందిన నెంబర్స్ చాలా ఖరీదైనవి. ఇది '0001' అనే నంబర్‌లో మాత్రమే వస్తుంది. వాటి ధర సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇందులో 0002, 0003, 0004 వంటి సింగిల్ డిజిట్ నంబర్ల కోసం సుమారు రూ. 3 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

దీని తరువాత 1111, 7777 లేదా 0099 వంటి నంబర్ల కోసం దాదాపు రూ. 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, 0100, 0111, 0200 వంటి సంఖ్యలు ఉండే సెమీ-ఫ్యాన్సీ నెంబర్స్ చాలా అరుదుగా ఉంటాయి. అలంటి నెంబర్స్ కోసం రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ధరకు లభిస్తాయి. కావున ఫ్యాన్సీ నెంబర్ ధరలు మీరు ఎంచుకునే దానిని బట్టి ఉంటాయి. అంటే కాకుండా కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎక్కువ పోటీ కూడా ఉంటుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రాసెసింగ్ టైమ్:

సాధనంగా ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర రవాణా శాఖ కనీసం 5 రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ లేదా వీఐపీ నెంబర్ జరీ చేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ (వేలం ప్రక్రియ) కేవలం ఐదు రోజుల్లోనే పూర్తవుతుంది. నంబర్ కేటాయింపు లేఖను జారీ చేసిన తర్వాత కారు యజమాని 90 రోజులలోపు సంబంధిత RTO వద్ద కారును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఫ్యాన్సీ నెంబర్‌లను పొందే ప్రక్రియ:

స్టెప్ 1: మొదట మీరు ఫ్యాన్సీ నెంబర్ కోసం రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా మీ అకౌంట్ క్రియేట్ చేయాలి.

స్టెప్ 2: మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత, ఫ్యాన్సీ లేదా వీఐపీ నెంబర్ ఎంచుకోవాలి.

స్టెప్ 3: నెంబర్ ఎంచుకున్న తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి కావాలనుకునే నెంబర్ రిజర్వ్ చేసుకోవాలి.

స్టెప్ 4: రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆ నెంబర్ కోసం మీరు వేలం ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

స్టెప్ 5: వేలం పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్ 6: వేలం ప్రక్రియ పూర్తయిన తరువాత ఆర్టిఓ నుండి నెంబర్ యొక్క కేటాయింపు లేఖను పొందాలి. ఈ విధంగా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది.

ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే ఎలా పొందాలో తెలుసా..?

ఇటీవల దుబాయ్ లో 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ ద్వారా నిర్వహించబడిన ఫ్యాన్సీ నెంబర్ వేలంలో 'AA8' సింగిల్-డిజిట్ నంబర్ ఏకంగా 35 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడైంది. అంటే ఇది మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 70 కోట్లకు పైమాటే అని చెప్పవచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
How to get fancy vip number for your car know in steps
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X