కారు ఎక్కువ మైలేజ్ రావాలని కోరుకుంటున్నారా.. ఈ టిప్స్ మీ కోసం
భారత్‌లో మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేస్తున్న సమయంలో కాస్త సౌకర్యవంతమైనవి వెతుకుతారు. ఆ తర్వాత వారి దృష్టి అంతా కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే దానిపైనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడే పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలపై అధిక భారాన్నే మోపుతున్నాయి. అందుకే సాధారణంగా అధిక మైలేజ్ ఇచ్చే కార్లనే ఎంచుకుంటారు. అయితే మైలేజ్ పెంచుకోవడం ఎలా అని చాలా మంది వెతుకుతూ ఉంటారు. అలాంటివారి కోసమే ఈ స్టోరీ.
కారు లేదా ఇతర వాహనం మైలేజ్ పెంచుకోవడం ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం కార్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నామనేదానిపై, మరొకటి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు గేరింగ్ సిస్టమ్‌ను ఎలా వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

కారులోని పలు భాగాల మధ్య అంటే ఇంజిన్‌లోని పిస్టన్, క్రాంక్‌షాఫ్ట్‌లోని బేరింగ్, గేర్ వీల్ వద్ద జరుగుతున్న ఫ్రిక్షన్ కారణంగా చాలా ఇంధనాన్ని కోల్పోతాం. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో క్లచ్ పెడల్ సాయంతో గేర్లను మారుస్తాం. అందువల్ల గేర్ వీల్ మధ్య ఫ్రిక్షన్‌ను నివారించేందుకు క్లచ్ పెడల్‌ను సరిగా వినియోగించాల్సి ఉంటుంది. కారు 5వ గేర్‌పై నడుస్తున్నప్పుడు, గేర్ వీల్ మధ్య సాధారణంగా ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో ఎక్కువ మైలేజీ వస్తుంది.
భారత్‌లో రోడ్లపై నడుస్తున్న వ్యక్తులు, ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలు, పశువులను తప్పించుకుంటూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. టాప్ గేర్‌పై కారు నడిపిస్తే అధిక మైలేజ్ వస్తుందని మనకు తెలుసు కానీ ఇలాంటి ప్రాంతాల్లో టాప్ గేర్‌పై నడపడం సాధ్యం కాకపోవచ్చు. టాప్ గేర్‌లో కారును తక్కువ వేగంతో నడిపించేందుకు ప్రయత్నిస్తే వాహనం మధ్యలోని నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో 2,3,4 గేర్లలో వెళ్లేందుకు ప్రయత్నించండి.
మరీ తక్కువ వేగంతో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఒకటో గేర్ కంటే రెండో గేర్‌లో వెళ్లేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత కొంచెం అధిక వేగంతో వెళ్లే అవకాశం వచ్చినప్పుడు 3, 4 గేర్లపై కారును డ్రైవ్ చేయండి. ఉదాహరణకు నాలుగో గేర్‌లో 30 నుంటి 40 km/h వేగంతో నడిపేందుకు అవకాశం వస్తే.. ఐదో గేర్‌పై 40km/h వేగంతో నడిపేందుకు ప్రయత్నించండి.
వాహనంలోని ఇంజిన్ భాగాల మధ్య తక్కువ ఫ్రిక్షన్ ఉంటే, తక్కువగానే ఇంధనం ఖర్చవుతుంది. ఐదో గేర్‌పై వాహనం నడుపుతున్నప్పుడు ఇంజిన్ భాగాల మధ్య ఫ్రిక్షన్ తక్కువుగా ఉంటుంది. ఫలితంగా అధిక మైలేజీ వస్తుంది. ఇదే ఒకటో గేర్‌పై వాహనం నడుస్తున్నప్పుడు ఇంజిన్ భాగాల మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఒకటో గేర్‌లో ఎక్కువ సమయం వాహనం ప్రయాణిస్తే తక్కువ మైలేజీ వస్తుంది. అధిక మైలేజీ కోసం వాహనం RPM 1500 నుంచి 2000 RPM మధ్యలో నడపాల్సి ఉండాల్సి ఉంటుంది.
భారీ ట్రక్‌ల్లో గేర్లు మారుస్తున్నప్పుడు ట్రక్ వేగం పెరగడం కూడా మనం గమనిస్తుంటాం. గేర్లను త్వరగా మార్చడం వల్ల ఇంజిన్‌పై పడే భారం తక్కుతుంది. అదే గేర్లు మార్చేందుకు అధిక సమయం తీసుకుంటుంటే, అలాంటి సమయాల్లో ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని ఖర్చుచేస్తుంది. ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది. అందువల్ల పరిస్థితి అనుకూలంగా ఉంటే గరిష్ఠ గేర్‌లో వాహనం నడిపేందుకు ప్రయత్నిస్తే అధిక మైలేజీ సొంతమవుతుంది.
సాధారణంగా నగరాలు, పట్టణాల్లో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ గేర్లు మార్చుతూ ఉంటాం, దీని వల్ల క్లచ్ పేట్ల జీవిత కాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మరియు తరచూ గేర్లు మార్చడం వల్ల అధిక ఇంధనం ఖర్చవుతుంది. ఫలితంగా మైలేజ్ తగ్గిపోతుంది. అందువల్ల 1500 నుంచి 2000 RPM మధ్య ప్రయాణించేందుకు ప్రయత్నం చేస్తే అధికంగా మైలేజీ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే అధిక మైలేజీ రావడానికి మెరుగైన గేర్ అంటూ ఏదీ లేదు. నగరాలు, పట్టణాలు సహా ఇతర ప్రాంతాల్లో మన డ్రైవింగ్ ఎలా ఉండాలో ట్రాఫిక్ మాత్రమే నిర్దేశిస్తుంది. ఒకటో గేర్‌లో వాహనం నడపుతున్న సమయాల్లో కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉన్నా రెండో గేర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించండి. అనంతరం 3 లేదా 4వ గేర్లపై వెళ్లేందుకు ప్రయత్నించండి. 40 km/h వేగంతో వెళ్లేందుకు అవకాశం ఉంటే ఐదో గేర్‌పై వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నం చేయవచ్చు.


Click it and Unblock the Notifications








