వేసవిలో హెల్మెట్ శుభ్రంగా ఉంచుకోవాలా.. ఈ చిట్కాలు మీకోసం
బైక్‌లపై ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. సుమారుగా రోజు ఏదో ఒక పనికోసం బైక్‌ను వినియోగిస్తూ ఉంటాం. హెల్మెట్ కూడా తీసుకెళ్తాం. అటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఎంతో శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా వేసవి కాలంలో చెమట, రోడ్డుపైన చెత్త కారణంగా హెల్మెట్ చెడు వాసన వస్తుంది. హెల్మెట్ శుభ్రంగా మరియు తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు మీకోసం.
హెల్మెట్‌ను రోజు శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు లేదా హెల్మెట్ చూసేందుకు అపరిశుభ్రంగా కనిపించినా.. సబ్బు, వేడి నీటితో హెల్మెట్ లోపల, బయట పూర్తిగా శుభ్రం చేయాలి. అనంతరం మెత్తని క్లాత్‌తో హెల్మెట్‌ను తుడవాలి. హెల్మెట్‌ను శుభ్రం చేసేందుకు ఎటువంటి రసాయనాలు ఉపయోగించకపోవడం మంచిది.

హెల్మెట్ శుభ్రం చేసేందుకు మార్కెట్‌లో కొన్నిరకాల స్ర్పేలు అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించిన హెల్మెట్ శుభ్రం చేసుకోవచ్చు. ఇవి ఎటువంటి హాని చేయవు. మీ హెల్మెట్ ప్యాడ్‌లు తీసేందుకు వీలుంటే వాటిని బయటకు తీసి ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. వూర్తిగా ఆరబెట్టిన తర్వాత అసెంబ్లింగ్ చేయాలి.
వెంటిలేషన్ నిర్వహణ : హెల్మెట్ యొక్క రంద్రాల్లో కీటకాలు, చెత్త సహా ఇంకా ఏం కూరుకుపోయినా సాఫ్ట్ బ్రష్, ఎయిర్ పైప్‌తో శుభ్రం చేయండి. ఫలితంగా ఎయిర్ ఫ్లో చక్కగా ఉంటుంది. లేదా చెత్త, కీటకాలు చేరి హెల్మెట్ చెడువాసన వచ్చే అవకాశం ఉంటుంది.
స్వెట్ మెనేజ్‌మెంట్ : ముఖ్యంగా వేసవి కాలంలో హెల్మెట్ ధరించి బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, హెల్మెట్ లోపల చెమట పడుతుంది. అయితే చెమట పట్టకుండా తలపై రుమాలు లేదా చిన్న క్లాత్ ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొన్ని సంస్థ హెల్మెట్ లోపల తొలగించదగిన క్లాత్‌తో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. హెల్మెట్ వినియోగించాక.. లోపల ఉన్న క్లాత్‌ను తీసి శుభ్రం చేసుకోవచ్చు.

సూర్యకాంతి నుంచి రక్షణ: హెల్మెట్ ఎక్కువ సమయం ఎండలో ఉంచడం వల్ల త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల హెల్మెట్ వినియోగించని సమయాల్లో బైక్ సీట్ లేదా ఎండలో వదిలేయకుండా చూసుకోండి. సూర్యకాంతి పడని ప్రాంతాల్లో దాచిపెట్టాలి. ఫలితంగా హెల్మెట్ ఎక్కువ కాలం మన్నిక వచ్చే అవకాశం ఉంటుంది.
చెడు వాసన నియంత్రణ : ఎప్పుడైనా మీ హెల్మెట్ చెడు వాసన వస్తుందని మీరు గుర్తిస్తే, బేకింగ్ సోడా లేదా యాక్టివేటెడ్ చార్‌కోల్ వంటి పదార్ధాలు హెల్మెట్‌లోపల పెట్టండి. ఫలితంగా చాలావరకు చెడు వాసన తగ్గుతుంది.
పైన చెప్పిన చిట్కాలతో కేవలం వేసవి కాలంలోనే కాక అన్ని సమయాల్లో హెల్మెట్‌ను శుభ్రంగా ఉంచుకోండి. మరియు బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








