వర్షాకాలంలో చిన్నారులతో కలిసి ప్రయాణాలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్నిసార్లు కారు డ్రైవింగ్‌ చేయడం చాలా సమస్యగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులతో కార్లలో ప్రయాణాల చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కార్లలోనూ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది.

సరైన సీటును ఎంచుకోవాలి: చిన్నారుల వయస్సు, బరువు ఆధారంగా వారికోసం నాణ్యమైన సీటును ఎంచుకోవాలి. చిన్నారులు స్థిరంగా కూర్చొనేలా సీటు ధృడ నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ప్యాడింగ్‌ సౌకర్యవంతంగా ఉండాలి, చిన్నారులు భద్రంగా ఉండేలా సర్దుబాటు చేయగల సీటు పట్టీలు ఉండాలి.

how to keep children safe in car driving

కారు సీటును సరిగా ఇన్‌స్టాల్‌ చేయాలి: చిన్నారుల సీటును సరిగా ఇన్‌స్టాల్‌ చేయాలి. తయారీదారుల సూచనలకు అనుగుణంగా మరియు నిపుణుల సలహాతో సీటును ఇన్‌స్టాల్‌ చేయండి. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు లేదా ప్రమాదాల సమయంలో చిన్నారులను సురక్షితంగా ఉంచుతుందా లేదా అనేది తనిఖీ చేయండి.

కారు కిటికీలను మూసి ఉంచాలి : వర్షాకాలంలో కారు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా కారు కిటికీలను మూసి ఉండాలి. ఫలితంగా వర్షపు నీరు కారు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండదు. మరియు అనుకోని ప్రమాదాల నుంచి చిన్నారులు సురక్షితంగా ఉంటారు.

how to keep children safe in car driving

సన్‌షేడ్‌లను ఉపయోగించాలి: భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో రక్షణ పొందేందుకు వెనుక కిటీలకు సన్‌షేడ్‌లను వినియోగించాలి. కారులోపల కాంతిని తగ్గిస్తుంది. మరియు లోపల ఉన్న చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది.

వైపర్లు, డీఫాగర్‌లను నిరంతరం తనిఖీ చేయాలి: కారు వైపర్లు మంచి కండిషన్‌ సహా సరిగా పనిచేస్తున్నాయో లేదా తనిఖీ చేయండి. అవసరం అనుకుంటే బ్లేడ్‌లను మార్చండి. ఫలితంగా భారీ వర్షాలు సమయంలోనూ మెరుగైన విజిబిలిటీ పొందవచ్చు. మెరుగైన పనితీరు కోసం డీఫాగర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

టైర్లు తనిఖీ చేయండి : వర్షాకాలంలో చిన్నారులతో కలిగి ప్రయాణం చేస్తున్నప్పుడు కారు టైర్లు సరైన థ్రెడ్‌ డెప్త్‌, టైర్‌ ప్రెజర్‌ ఉందో లేదో తనిఖీ చేయండి. తడి రోడ్లపై కారు స్కిడ్‌ లేదా హైడ్రోప్లానింగ్‌ ప్రమాదాలు కాకుండా ఇవి సురక్షితంగా ఉంచుతాయి.

how to keep children safe in car driving

గుంతలు, వరద ప్రాంతాలను నివారించండి: గుంతల రోడ్లు, వరద నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణాలను వీలైనంత వరకు నివారించండి. లేకుండా కారు సస్పెన్షన్‌ వ్యవస్థ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు టైర్‌ పంక్చర్‌ సహా ఇతర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

సీట్ బెల్టులు : కారులో చిన్నారులతో కలిగి ప్రయాణాలు చేస్తున్న సమయంలో వారికి సీట్‌బెల్ట్‌లు అమర్చడం మర్చిపోకండి. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు అదనపు రక్షణ ఇస్తాయి.
అత్యవసర పరిస్థితులు : చిన్నారులతో కలిగి ప్రయాణాలు చేస్తున్న సమయంలో అత్యవసర వస్తువులను తీసుకెళ్లండి. ప్రథమ చికిత్స పెట్టె, ప్లాష్‌ లైట్, స్పేర్ టైర్‌ సహా ఇతర వస్తువులను వెంట తీసుకువెళ్లండి.

how to keep children safe in car driving

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 17, 2023, 19:25 [IST]
English summary
How to keep children safe in car driving during monsoon season in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+