వర్షాకాలంలో బైక్ డ్రైవింగ్ చేస్తుంటారా.. ఇవి సరిగా లేకుంటే ప్రమాదం!!
వర్షాకాలంలో చాలా మంది బైక్ రైడ్ చేసేందుకు చాలా ఇష్టపడతారు. అయితే ఈ సమయంలోనే రోడ్లు జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల డ్రైవింగ్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వర్షాకాలంలో బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బైక్‌ను కొంత తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని చిట్కాలు మీకోసం.
బైక్ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోవాలి. అంటే కొన్ని నెలలకు గానీ లేదా కొన్ని కిలోమీటర్ల తర్వాత గానీ సర్వీస్ చేయించుకోవడం ఉత్తమం. ఫలితంగా బైక్ ఎక్కువ కాలం మన్నిక రావడం సహా భద్రత పరంగాను బాగుంటుంది. అందువల్ల వర్షాకాలం పూర్తిగా ప్రవేశించకముందే మీ బైక్‌ను సర్వీస్ చేయించుకోండి.

వర్షాకాలంలో బైక్ మరింత శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకమైన కవర్‌తో కప్పి ఉంచడం గానీ లేదా షేడ్ కింద పార్క్ చేయడం అలవాటు చేసుకోవాలి. బైక్ నిత్యం వర్షంలో తడిస్తే వివిధ భాగాలు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. బైక్ కూడా తుప్పుపట్టే అవకాశం ఉంటుంది. అయితే చెట్టు కింద పార్క్ చేయవద్దు. పొరపాటున చెట్టు కొమ్మ విరిగినా బైక్ దెబ్బతినే అవకాశం ఉంది.

ప్రస్తుతం చాలా బైక్‌లు ఫైబర్ మెటీరియల్‌తో వస్తున్నాయి. క్లాసిక్ మోడళ్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సహా మరికొన్ని వాహనాలు మాత్రమే మెటల్ బాడీతో వస్తున్నాయి. ప్రతి బైక్ మెయిన్ ఫ్రేమ్ మెటల్ బాడీనే కలిగి ఉంటుంది. అందువల్ల తుప్పుపట్టకుండా టెఫ్లాన్ కోటింగ్ వేయడం చాలా ఉత్తమం.

వర్షాకాలంలో రోడ్లు ఎక్కువగా జారిపోయే స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో బైక్ టైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. టైర్లు పూర్తిగా అరిగిపోయినట్లయితే.. వర్షాకాలం పూర్తిగా ప్రారంభమయ్యే లోపలే కొత్త టైర్లను అమర్చుకోవడం చాలా ఉత్తమం. టైర్ కనీసం 2 మీ.మీ కంటే ఎక్కువ త్రెడ్డింగ్ ఉండేలా చూసుకోవాలి. రోడ్లపై బైక్ జారిపోకుండా ఉండాలంటే టైర్లలో గాలి (టైర్ ప్రెజర్) కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి.

వర్షాకాలంలో బురద లేదా మట్టి బైక్‌లోని కొన్ని భాగాల్లో పేరుకుపోతుంది. కొన్ని బైక్‌లు పూర్తిగా చైన్ కవరింగ్‌తో వస్తాయి. మరికొన్ని బైక్‌లు పూర్తిగా చైన్ బయటకు కనిపిస్తుంది. ఫలితంగా ఇలాంటి బైక్‌లలో మట్టి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇవే కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. వెంటనే వాటర్ సర్వీసింగ్ చేసి, లూబ్రికేషన్ చేయించాలి. ప్రతి 500 కి.మీలకు చైన్‌ను శుభ్రం చేయడం సహా లూబ్రికేషన్ చేయించుకోవాలి.
సాధారణ సమయాల కంటే వర్షాకాలంలో బైక్ బ్రేకింగ్ వ్యవస్థను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. డ్రమ్ లేదా డిస్క్ బ్రేకులు ఏవైనా.. వర్షం కారణంగా వాటి సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. డిస్క్ బ్రేకులు ఉన్నట్లయితే డిస్క్‌లు శుభ్రంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

బైక్‌కు యాంటీ లాంక్ బ్రేకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ తొందరపడి బ్రేకులు వేయకూడదు. బైక్‌ను నెమ్మదిగా నడపడం మంచిది మరియు ముందున్న వాహనానికి కొంచెం దూరం ఉంటూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. తడి రోడ్లపై గట్టిగా బ్రేక్ వేయడం వల్ల బైక్ జారిపోయే ప్రమాదం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








