Monsoon Car Care వర్షాకాలం వచ్చేస్తుంది.. ఇవి మీ కారులో ఉన్నాయా?
కారులోపలి భాగం ఎంత శుభ్రంగా మరియు మంచి వాసన వెదజల్లుతుంటే అంత మంచి ప్రయాణ అనుభూతిని పొందుతారు. సాధారణ సీజన్ల కంటే వర్షాకాలంలో కారు లోపల భాగాన్ని శుభ్రంగా ఉంచడం చాలా కష్టం. దీని కారణంగా వివిధ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు చెడువాసన కారణంగా కారు డ్రైవింగ్ అనుభూతి చెడిపోతుంది.
మిగిలిన సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో కారులో దోమల బెడద నుంచి తప్పించుకోవడం సహా మంచి వాసన కలిగి ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం ఏం చేయాలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అలాంటివారి కోసం ఈ 5 చిట్కాలు (Monsoon car care). వీటిని ఉపయోగించి మీ కారును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవచ్చు.

రబ్బర్ మ్యాట్: వర్షాకాలంలో కారు లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచుకొనేందుకు రబ్బర్ మ్యాట్ ఎంతో అనువుగా ఉంటుంది. ఎప్పుడైనా రబ్బర్ మ్యాట్ మురికిగా ఉన్నట్లు అనిపించినా వెంటనే బయటకు తీసి శుభ్రం చేసి మరలా వినియోగించుకోవచ్చు.

సిలికా జెల్ : సిలికా జెల్ ప్యాకెట్లు మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకెట్లు కారులో ఉన్న తేమను గ్రహించి, కారు లోపల భాగం ఎలాంటి తేమ మరియు చెడు వాసన రాకుండా చూస్తాయి.

గొడుగు : వర్షాకాలంలో గొడుగు ఉపయోగాల గురించి అసలు చెప్పవలసిన అవసరం లేదు. కారులో గొడుగు ఎందుకని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ కారులో గొడుగు కోసం వాటర్ ఫ్రూఫ్ పర్సును అందుబాటులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

మైక్రోఫైబర్ క్లాత్ : మీ కారులో ఎప్పుడు మంచి నాణ్యత ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే సాధారణ క్లాత్ కంటే మైక్రోఫైబర్ క్లాత్ ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. అందువల్ల ఈ క్లాత్ ఎప్పుడు కారులో ఉండేలా చూసుకోండి.

ఎయిర్ ఫ్రెషనర్ : సాధారణ సమయాల్లో కంటే వర్షాకాలంలో కారు లోపల భాగం శుభ్రతపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఎందుకంటే అధిక తేమ కారణంగా లోపలి భాగంలో చెడు వాసన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల నాణ్యమైన ఎయిర్ ఫ్రెషనర్ కారులో చెడు వాసనను కొంచెం తగ్గిస్తుంది.
పైన తెలిపిన కొన్ని చిట్కాలతో కారులోపలి భాగం శుభ్రంగా మరియు మంచి వాసన వచ్చేలా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వర్షాకాలంలో ఇటువంటి చిట్కాలు ఎంతో అవసరం. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ వస్తువులను కొనుగోలు చేసి, మీ కారును శుభ్రంగా ఉంచుకోండి. మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








