Monsoon Car Care ఎలుకల బారి నుంచి కారును ఎలా కాపాడుకోవాలి?

సాధారణ సమయాల కంటే వర్షాకాలంలో కారును శుభ్రంగా, భద్రంగా ఉంచుకోవడం కొంచెం కష్టం. పైగా వర్షాకాలంలో ఎలుకలు కారులో ఆశ్రయం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫలితంగా చెడు వాసన రావడంతో పాటు ఎలక్ట్రిక్‌ సహా విలువైన వస్తువులను ఎలుకలు తినేసే అవకాశం ఉంటుంది.

ఎలుకల వల్ల అవస్థలు పడుతున్నా.. వాటి నుంచి కారును ఎలా కాపాడుకోవాలో చాలా మంది వాహన యజమానులకు అవగాహన ఉండదు. కానీ ఎలుకల వల్ల నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించి కారులోకి ఎలుకలు రాకుండా నియంత్రించవచ్చు.

How To Keep Rats Away From Cars

కారులో ఆహార పదార్ధాలు ఉంచకూడదు : ఎలుకలు సహా ఇతర కీటకాలు ఆహార పదార్ధాలకు ఆకర్షితం అవుతాయి. అందువల్ల కారులో ఎటువంటి ఆహార పదార్ధాలు విడిచి పెట్టకుండా చూసుకోవాలి. మరియు కారు శుభ్రంగా ఉండేలా చూసుకుంటే ఎలుకలు ప్రవేశించే అవకాశం ఉండదు.

చీకటి ప్రాంతాల్లో కారు పార్క్‌ చేయవద్దు: సాధారణంగా ఎలుకలు చీకటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడతాయి. అంటే ఇంజిన్‌ బే లేదా చీకటి ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లలో ఉండేందుకు ఇష్టపడతాయి. మరియు పిల్లులు, గుడ్లగూబలు సహా ఇతర జంతువుల కంటికి కనిపించకుండా ఉంటామని భావిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో చీకటి ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లను ఎలుకలు ఎంచుకుంటాయి. అందువల్ల కార్లను ఎల్లప్పుడూ కొంచెం వెలుతురు ఉండే ప్రాంతాల్లో పార్క్ చేయడం మంచిది.

పొగాకు ఆకులు: కారులోపల ఎలుకలు ప్రవేశించకుండా ఉండేందుకు పొగాకు ఆకులు బాగా పనిచేస్తాయి. అందువల్ల పొగాకు ఆకుల కట్టను ఇంజిన్‌ బే లేదా కారులోపల ఏదో ఒక చోట వీటిని ఉంచాలి. కారులోపల ఎలుకలు నివాసం ఉండకుండా పొగాకు ఆకులు బాగా పనిచేస్తాయని చాలా మంది వాహనదారులు తెలిపారు.

స్ప్రే : నాణ్యమైన కొన్ని రకాల స్ప్రేలతో కారు లోపల ఎలుకలు సహా ఇతర కీటకాలు ప్రవేశించకుండా చూడవచ్చు. వివిధ రకాల ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఇటువంటి స్ప్రే లను కొనుగోలు చేయవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలుకల బాధ నుంచి కారును కాపాడుకోవచ్చు.

పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు.. ఎలుకల నుంచి కారును కాపాడుతాయి. అయితే ఇది అందరు కారు యాజమానులకు సాధ్యం కాకపోవచ్చు. కార్లలో ఎలుకల ప్రవేశించడం వల్ల వాహనంలోని విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేస్తాయి. దీంతో రిపేర్‌ చేయించేందుకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే కొన్నిసార్లు ఇవే ప్రమాదానికి కారణం కావచ్చు. అయితే పైన చెప్పిన చిట్కాలతో ఎలుకలు సహా ఇతర కీలకాలు నుంచి కారును కాపాడుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 6, 2023, 12:53 [IST]
English summary
How to protect car from rats during monsoon here are the tips to follow
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+