మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

ఒకప్పుడు కారు అంటే విలాసం మాత్రమే, కానీ నేడు అది ఓ అవసరంగా మారిపోయింది. దీంతో దేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. అయితే, కొత్తగా కారును కొనేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లక్షలు పోసి కారు కొనగానే సరిపోదు, కారులో తలత్తే చిన్నపాటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే, ఇలాంటి చిన్న చిన్న మరమ్మత్తుల కోసం మన చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. అలాంటి వాటిలో ఒకటి పాడైన హెడ్‌లైట్లను మార్చడం. దీనిని సులువుగా ఎలా చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

రోడ్ సేఫ్టీ విషయంలో కారు యొక్క హెడ్‌లైట్‌లు అత్యంత కీలంగా ఉంటాయి. అయితే, కొన్ని కారణాల వల హెడ్‌లైట్‌లు కొన్నిసార్లు పని చేయడం మానేస్తాయి. అలాంటి సందర్భాల్లో చాలా మంది హెడ్‌లైట్ బల్బులను మార్చడానికి మెకానిక్ షాపులకు కానీ లేదా సర్వీస్ సెంటర్లకు కానీ వెళ్లి అధిక డబ్బులు ఖర్చు చేస్తుంటారు. నిజానికి, కారు హెడ్‌లైట్లను మార్చడం చాలా సులభం. ఇది మీరే స్వయంగా చేసుకోవచ్చు. కొన్ని సింపుల్ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా హెడ్‌లైట్ బల్బ్‌ను సులభంగా భర్తీ చేయవచ్చు.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

కొత్త కారును విక్రయించేటప్పుడు కార్ల తయారీదారులు కారులో అమర్చిన రెండు హెడ్‌లైట్ బల్బులతో పాటుగా మరో రెండు హెడ్‌లైట్ బల్బులను విడిగా అందిస్తారు. ఈ స్పేర్ హెడ్‌లైట్ బల్బులు ఎమర్జెన్సీ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. కాబట్టి, ఎల్లప్పుడూ మీ కారులో రెండు స్పేర్ హెడ్‌లైట్ బల్బులు ఉండేలా చూసుకోవాలి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కారులో ఏ రకైమన హెడ్‌లైట్ బల్బులు ఉన్నాయో ముందుగా నిర్ధారించుకోవాలి.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

ఒకప్పుడు అన్ని కార్లలో హాలోజెన్ బల్బులు మాత్రమే ఉండేవి, అయితే మారుతున్న టెక్నాలజీతో పాటుగా కొత్త ఎల్ఈడి లైట్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఒక్క కార్ తయారీదారు ఒక్కొక్క రకం లైట్లను తమ కార్లలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మీ కారులో ఉపయోగించిన హెడ్‌లైట్ బల్బులు ఏ రకానికి చెందినవో ముందుగా తెలుసుకోవాలి. ఒక వేళ మీ కారులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్ ఉంటే, దాని బల్బ్ రీప్లేస్‌మెంట్ కోసం అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించడం మంచిది.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

సాధారణంగా, ఇలాంటి ఎల్ఈడి హెడ్‌లైట్ యూనిట్‌లు కారు జీవితకాలం దాటి పని చేసేలా రూపొందించబడి ఉంటాయి, కాబట్టి ఇవి అంత త్వరగా కాలిపోవు. అయితే, సాధారణ హాలోజన్ బల్బుల విషయంలో ఈ పరిస్థితి మరోలా ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం మన్నవు. భారతదేశంలోని చాలా కార్లు ఇప్పటికీ హాలోజన్ హెడ్‌లైట్ బల్బులను ఉపయోగిస్తున్నాయి. కాబట్టి, మీ కారులో కూడా హాలోజన్ బల్బులు ఉన్నట్లయితే, వాటిని సులువుగా ఎలా మార్చాలో ఈ 6 స్టెప్స్ లో తెలుసుకుందాం.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

హాలోజన్ బల్బులు దాదాపు 2,000 గంటల జీవిత కాలాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి అవి కారు/మోటార్‌సైకిల్ జీవితకాలంలో చాలా తరచుగా భర్తీ చేయబడే అవకాశం ఉంటుంది. పోల్చి చూస్తే, ఎల్ఈడి బల్బులు దాదాపు 25,000 గంటల పాటు పనిచేస్తాయి. హాలోజెన్ బల్బులను రీప్లేస్ చేయడానికి మీకు ఒక జత రబ్బరు గ్లౌజ్ లు అవసరం అవుతాయి. ఇది మీ సేఫ్టీ కోసమే, చేతి గ్లౌజులు అందుబాటులో లేకుంటే, మంచి పొడిబట్ట ఉన్నా సరిపోతుంది.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

మొదటి దశ

కారు హెడ్‌లైట్ బల్బులు ఇంట్లో బల్బులను వెలిగించినంత సులభం కాదు. అవి H1, H3, H4, H7, H8, H10, H11, H14 మొదలైన వివిధ పరిమాణాలు మరియు ఆకారాలలో వస్తాయి. కాబట్టి, ఈ 'మిషన్'తో కొనసాగడానికి ముందు తయారీదారు సిఫార్సు చేసిన బల్బ్ స్పెసిఫికేషన్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఓనర్ మ్యాన్యువల్ లో ఈ విషయం పేర్కొనబడి ఉంటుంది. లేదా మీ పాత బల్బుపై ఈ సమాచారం ముద్రించబడి ఉంటుంది.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

రెండవ దశ

మీ కారు ఇంజన్ ను ఆఫ్ చేసి, బానెట్ ను ఓపెన్ చేయాలి. అప్పటి వరకూ మీ కారు ఇంజన్ లేదా హెడ్‌లైట్స్ ఆన్ చేయబడి ఉన్నట్లయితే, అవి చల్లబడే వరకు వేచి ఉండండి. వేడిగా ఉండే ఇంజన్ భాగాలను లేదా హెడ్‌లైడ్ భాగాలను తాకడం ప్రమాదకరం.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

మూడవ దశ

బానెట్ తెరిచిన తర్వాత, హెడ్‌లైట్‌ల వెనుక సరిగ్గా ఉన్న హెడ్‌ల్యాంప్ కనెక్షన్‌ను తీసివేయండి. కొన్న సందర్భాల్లో అక్కడ మీకు ఓ డస్ట్ కవర్ కనిపించవ్చచు. కాబట్టి జాగ్రత్తగా డస్ట్ కవర్ ను తొలగించిన తర్వాత హెడ్‌ల్యాంప్ కనెక్షన్ ను వేరు చేయండి.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

నాల్గవ దశ

డస్ట్ కవర్, హెడ్‌లైట్ కనెక్షన్ తొలగించిన తర్వాత, పాత హాలోజెన్ బల్బును తొలగించడానికి దాన్ని పట్టి ఉంచే ఓ మెటల్ హుక్కును మెల్లిగా తొలగించాల్సి ఉంటుంది. ఇది స్పింగ్ టైప్‌లో ఉంటుంది. దీన్ని తొలగించగానే పాత బల్బు సులువుగా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాని స్థానంలో అదే విధంగా కొత్త బల్బును అమర్చాల్సి ఉంటుంది.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

ఐదవ దశ

ఇలా పాత బల్బు స్థానంలో కొత్త బల్బును రీప్లేస్ చేసిన తర్వాత యధావిధిగా డస్ట్ కవర్ ను తిరిగి దాని స్థానంలో అమర్చాలి. ఆ తర్వాత తొలగించిన హెడ్‌ల్యాంప్ కనెక్షన్ ను తిరిగి హెడ్‌లైట్ బల్బుకి కనెక్ట్ చేయాలి.

మీ కారు హెడ్‌లైట్ బల్బులను ఎలా మార్చాలో తెలియదా..? అయితే, ఇక్కడ చూడండి..!

ఆరవ దశ

ఇలా హెడ్‌లైట్ బల్బులను రీప్లేస్ చేసిన తర్వాత బానెట్ మూసివేయడానికి ముందు, మీరు ఓసారి కారు ఇంజన్ ను ఆన్ చేసి, హెడ్‌లైట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. హై-బీమ్ మరియు లో-బీమ్ రెండింటినీ చెక్ చేసుకోవాలి. కొత్తగా రీప్లేస్ చేసిన బల్బ్ కూడా సరిగ్గా పని చేయకపోయినట్లయితే, బల్బ్ యొక్క వైరింగ్ లేదా ఫిలమెంట్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది, ఇందుకు మీకు నిపుణుల సహాయం అవసరం కావచ్చు.

Most Read Articles

English summary
How to replace car headlight bulbs step by step guide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X