బ్రేక్స్ విషయంలో ఇవి పాటించకుంటే ఇబ్బందులే..!

వాహనం నడిపే ప్రతీ వ్యక్తి ఏదైనా ప్రమాదం సంభవించే సమయంలో మొదటగా హార్న్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే కాలు బ్రేక్ పైకి వెళ్తుంది. రోడ్డుపైకి రాగానే సిగ్నల్స్, గుంతలు, గుర్తు తెలియని స్పీడ్ బ్రేకర్లు ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటి అన్నింటిని చేధించుకుంటూ గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. ఇవన్ని ఒడుదొడుకులు దాటాలంటే బ్రేక్ అనే ప్రధాన ఆయుధం చాలా ముఖ్యం.

ఎంత పెద్ద వెహికిల్ కైనా బ్రేక్ అనేది అవసరం. అది లేకుంటే దానిని నియంత్రించడం మన వల్ల కాదు. బ్రేక్ పెడల్‌ పై అడుగు పెట్టగానే బ్రేక్ ప్యాడ్ రబ్బరు అధిక స్థాయి రాపిడిని ఎదుర్కొని క్రమంగా అరిగిపోతుంది. వాహనానికి ఆయువు పట్టు లాంటి బ్రేక్స్ ను ఎలా మెయింటైన్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుని ప్రమాదాలను దరిచేరకుండా జాగ్రత్త పడదాం.

బ్రేక్ ప్యాడ్

వాహన యజమానులు బ్రేక్‌ లపై తగినంత శ్రద్ధ చూపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాహనం మొత్తం పనితీరులో అత్యంత కీలక పాత్రను బ్రేక్స్ పోషిస్థాయి. అయితే బ్రేక్ తొక్కుతున్న ప్రతీసారీ బ్రేక్ ప్యాడ్ అరిగిపోయి పూర్తి స్థాయిలో బ్రేక్స్ పడకపోవచ్చు. ఇది క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు.

ఓవర్ స్పీడ్

ఓవర్ స్పీడ్ థ్రిల్స్‌ ను ఇస్తుంది. కానీ అది కొన్ని సందర్భాల్లో అనర్ధాలకు దారితీస్తుంది. డ్రైవర్‌ ఫుల్ స్పీడ్ లో ఉంటే బ్రేక్ ప్యాడ్‌ లు అధిక స్థాయి ఘర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు బ్రేక్ ప్యాడ్స్ పూర్తిగా అరిగిపోతాయి. కాబట్టి అవసరమైన సందర్భాల్లో హై స్పీడ్ డ్రైవింగ్ ను అవాయిడ్ చేస్తే బ్రేక్ ప్యాడ్స్ పై ఒత్తిడి తగ్గుతుంది.

బ్రేక్ ప్యాడ్

యాక్సిలరేట్ చేయవద్దు...

బ్రేకింగ్ చేసేటప్పుడు యాక్సిలరేట్ ఎక్కువ చేయవద్దు. అలా చేయడం వల్ల ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని తీసుకునేలా చేస్తుంది. యాక్సిలరేట్ బ్రేక్ ప్యాడ్‌ లకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఇది సాధారణ బ్రేకింగ్ కంటే త్వరగా అరిగిపోయేలా చేస్తుంది.

గేర్లు ప్రధానం..

ప్రత్యేకించి రద్దీగా ఉండే నగరంలో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. ట్రాఫిక్ లో క్లచ్, యాక్సిలరేటర్ పెడల్‌ లపై గేర్‌ పై ఆధారపడి ఉంటుంది. వేగం తగ్గినప్పుడు తక్కువ గేర్ లో ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే, మీ ముందు ఉన్న వాహనం లేదా వస్తువు మధ్య తగినంత దూరం ఉందని నిర్ధారించుకోవాలి. ఈ పద్ధతిని వర్తింపజేయడం వల్ల బ్రేక్ ప్యాడ్‌ లకు ఎక్కువ రోజులు అవసరానికి వస్తాయి.

బ్రేక్ ప్యాడ్ వినియోగం

ఓవర్ లోడింగ్ వద్దు..

తీవ్రమైన ఓవర్‌ లోడింగ్ వాహనాన్ని మైలేజీని ప్రభావితం చేయడమే కాకుండా బ్రేక్‌ లపై తీవ్ర5 ఒత్తిడిని పెంచుతుంది. మీ వాహనం ఎంత బరువుగా ఉంటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది మరింత ఊపందుకుంటుంది అప్పుడు దానిని ఆపడానికి అవసరమైన బ్రేకింగ్ శక్తి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, అనవసరమైన లోడ్ తో మాత్రమే మీ కారును తీసుకెళ్లండి.

వాహనం నడిపేటప్పుడు బ్రేక్ ప్యాడ్ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి అవసరమైన సందర్భాల్లో మాత్రమే బ్రేక్స్ ను ఉపయోగిస్తూ దాని పనితీరును మెరుగు పరిచేందుకు ప్రయత్నించాలి. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడం వల్ల బ్రేక్ ఫోర్స్ తగ్గి కారు లేదా బైకులు సడెన్ గా ఆగిపోవడానికి సమయం పడుతుంది. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ దీనిని సులభంగా గుర్తించవచ్చు. బ్రేక్ ప్యాడ్స్ బాగున్నప్పుడు బ్రేకులను కొద్దిగా అప్లే చేసినా చాలు వెహికల్ వేగం కంట్రోల్ తప్పదు. బ్రేకులు అరుగుదలతో బ్రేకింగ్ ఫోర్స్ చక్రాలను చేరడానికి గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది.


More from DriveSpark

Article Published On: Sunday, February 26, 2023, 14:42 [IST]
English summary
How to save brake pads life span while driving here the key tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+