కారు వినియోగిస్తున్నారా.. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసా..?

కారు సాధారణ సమస్యలను పరిష్కరించడం ప్రతి యజమానికి ఎంతో అవసరం. ఈ సమస్యలకు గల కారణాలను తెలుసుకోవడం ద్వారా మీరే పరిష్కారం చేసుకోవచ్చు. ఫలితంగా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చు. కారు వినియోగిస్తున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్యాటరీ సమస్యలు : మీ కారులో బ్యాటరీ డెడ్‌ లేదా బలహీనంగా ఉందని అనిపించినట్లయితే, ఇటువంటి సమస్యలను మీరే పరిష్కరించుకోవచ్చు. ముందుగా బ్యాటరీ అన్ని కనెక్షన్లు సరిగా ఉన్నయో లేదో తనిఖీ చేయవచ్చు. తర్వాత బ్యాటరీ టెర్మినల్స్‌ పైన తుప్పు ఉందా లేదో తనిఖీ చేయండి. ఇది విద్యుత్‌ ప్రసారానికి కొంత ఆటంకం కలిగించవచ్చు. అనంతరం బ్యాటరీ వోల్టేజ్‌ను తనిఖీ చేసేందుకు మల్టీమీటర్‌ను వినియోగించండి.

common car problems

ఇంజిన్‌ : ఇంజిన్‌ మిస్‌ఫైర్స్‌ కారణంగా పనితీరుపై ప్రభావం పడుతుంది. మైలేజ్‌ కూడా తక్కువగా వస్తుంది. ఇంజిన్‌ మిస్‌ఫైర్స్‌కు అనేక కారణాలున్నాయి. స్మార్క్‌ ప్లగ్‌, ఇగ్నిషన్‌ కాయిల్స్‌ సరిగా పనిచేయకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అయితే కచ్చితమైన కారణం తెలుసుకొనేందుకు OBD-II స్కానర్‌ను ఉపయోగించాలి. ఎక్కడ సమస్య ఉందనేది ఈ స్కానింగ్‌తో గుర్తించవచ్చు.

ఓవర్‌ హీటింగ్‌ : ఓవర్‌ హీటింగ్‌ సమస్యకు అనేక కారణాలున్నాయి. వాటర్‌ పంప్‌, రేడియేటర్‌ లేదా కూలింగ్‌ సిస్టమ్‌ సరిగా పనిచేయని కారణంగా ఓవర్‌ హీటింగ్ సమస్య తలెత్తవచ్చు. వాహన రిజర్వాయర్‌లోని కూలెంట్‌ లెవల్‌ను తనిఖీ చేయాలి. కూలెంట్‌ లెవల్‌ సరైన స్థాయిలో లేకున్నా ఈ ఓవర్‌ హీటింగ్‌ సమస్య తలెత్తవచ్చు. కూలింగ్‌ సిస్టమ్‌ లీకేజీ, ఇతర డ్యామేజీలను తనిఖీ చేయాలి. ఏదైనా సమస్య గుర్తిస్తే డ్యామేజీ అయిన విడిభాగాలను మార్చుకోవాలి.

బ్రేకింగ్‌ సమస్య : సురక్షితమైన డ్రైవింగ్‌ కోసం బ్రేక్‌లను నిరంతరం తనిఖీ చేయాలి. అవసరం అనుకుంటే వెంటనే కొత్త బ్రేక్‌లను అమర్చుకోవాలి. బ్రేక్‌లు వినియోగించినప్పుడు సౌండ్‌ రావడం, బ్రేకింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటే.. బ్రేక్‌ ప్యాడ్‌ లేదా రోటర్‌ల అరుగుదలను సూచిస్తుంది. మెరుగైన డ్రైవింగ్‌ కోసం బ్రేక్‌లను నిరంతరం తనిఖీ చేయడం మరియు సకాలంలో బ్రేక్ ప్యాడ్‌లను మార్చుకోవడం ద్వారా సురక్షితమైన డ్రైవింగ్‌ అనుభూతిని పొందుతారు.

విద్యుత్‌ సమస్యలు: కారులో అకస్మాత్తుగా విద్యుత్‌ సమస్యలు తలెత్తుతాయి. వాటి కారణంగా లైట్లు సరిగా పనిచేయకపోవడం, అకస్మాత్తుగా డిమ్‌గా మారిపోవడం, పవర్‌ విండోస్‌ వ్యవస్థ, సెంట్రల్‌ లాకింగ్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్యూజ్‌, వైరింగ్‌ కనెక్షలను తనిఖీ చేయాలి. ఏదైనా సమస్యలను గుర్తిస్తే నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

common car problems

ట్రాన్స్‌మిషన్‌ సమస్యలు: కారులో గేర్లు మారుస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తడం అంటే గేర్లు మార్చేందుకు సమయం తీసుకోవడం, ఒకే గేర్‌లో నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇటువంటి సమస్యలు రాకుండా గేర్‌బాక్స్‌ ప్లూయిడ్‌ స్థాయిలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలి. మరియు లీకేజీ వంటి సమస్యలను కూడా తనిఖీ చేయాలి. అయితే సమస్య పరిష్కారం కాకుంటే నిపుణుడిని సంప్రదించాలి.

వాహనంలో ఎదురయ్యే ప్రాథమిక సమస్యల పరిష్కారం గురించి నేర్చుకోవడం యజమానులకు చాలా ముఖ్యం. ప్రతిసారి మెకానిక్‌ వద్దకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేయనవసరం లేదు. సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. సమస్యను పరిష్కరించేందుకు నిపుణుడు అవసరం అనిపిస్తే మాత్రం మెకానిక్‌ను సంప్రదించాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 12, 2023, 15:18 [IST]
English summary
How to troubleshoot common car problems here are the solution
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+