Breaks ఈ టెక్నిక్ తెలిస్తే బైక్ బ్రేక్స్ ని ఓ ఆట ఆడుకుంటారు.. బ్రేక్స్, క్లచ్ ఎలా వాడాలో తెలుసా..?
డ్రైవింగ్ అనేది ఓ నైపుణ్యంగా చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక రూపంలో కొత్త కొత్త విషయాలను రోడ్లపై మనం గమనించవచ్చు. డ్రైవ్ చేయడం ఎంత ముఖ్యమే దానిని కంట్రోల్ చేయడం అంతే కీలకంగా డ్రైవర్లు భావించాలి. చాలా సందర్భాల్లో బ్రేకులు వేసేటప్పుడు జనాలు భయాందోళనకు లోనవుతారు. తద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు.
ఏదైనా ఊహించని సందర్భం వచ్చినప్పుడు బ్రేక్స్ విషయంలో చాలామంది ఆందోళన చెందుతారు. దీంతో బ్రేక్స్ ని ఉపయోగించాలో తెలియక తికమకపడతారు. మరీ ముఖ్యంగా బైక్ రైడర్స్ డిస్క్ బ్రేక్స్ విషయంలో స్కిడ్ అయిన సందర్భాలు చాలానే మన కళ్లముందు చూసి ఉంటాము. వీటిపై బైక్ రైడర్లకు సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది.

ఏదైనా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు మొదట ఏది నొక్కాలి బ్రేక్ హా లేదా క్లచ్ అని సతమతమవుతారు. బ్రేక్ అప్లికేషన్ ముఖ్యంగా బైక్ వేగం, గేర్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. బైక్ గరిష్ట వేగంలో పరుగెడుతున్నప్పుడు దీనిని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇలాంటి సందర్భాల్లో మీ బైక్ ని ఎలా కంట్రోల్ చేయాలో కొన్ని టిప్స్ మీకోసం అందిస్తున్నాం.
మీరు ట్రాఫిక్ లో లేదా ఆకస్మాత్తుగా ఎవరైన అడ్డం వచ్చినప్పుడు బైక్ ని పూర్తిగా ఆపివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో, మొదట క్లచ్ నొక్కడం తరువాత బ్రేక్ నొక్కడం చాలా ముఖ్యం. ఇంజన్ ని సడెన్ గా స్తంభించకుండా బైక్ ను సాఫీగా ఆపడానికి ఈ టెక్నిక్ సహాయపడుతుంది. మీరు క్లచ్ ని ఎంగేజ్ చేయకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే, బైక్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతో మీరు కిందపడిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ముందుగా క్లచ్ ప్రెస్ చేసి బైక్ ని ఆపివేయడం ఉత్తమం.
రెండో సందర్భంలో మీరు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బైక్ ను ఆపకుండా స్లో చేయడానికి ఓ టెక్నిక్ ఉంది. ఈ సందర్భంలో స్పీడ్ తగ్గించుకోవడానికి కేవలం బ్రేక్ మాత్రమే వాడటం మంచిది. నెమ్మదించిన తరువాత, క్లచ్ ఉపయోగించడం ద్వారా మీరు తక్కువ గేర్ కు డౌన్ షిఫ్ట్ చేయవచ్చు. ఇది బైక్ ని అధిక వేగంతో ఉన్నప్పడు కంట్రోల్ చేయడానికి ఉపకరిస్తుంది.
ఇక మీరు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, మీరు మీ వేగాన్ని గంటకు 10 నుండి 15 కిలోమీటర్లు మాత్రమే తగ్గించే సందర్భంలో ఓ టెక్నిక్ ఉపయోగపడనుంది. స్పీడ్ లో ఉన్నప్పుడు వేగాన్ని తగ్గించేందుకు క్లచ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీరు మీ బైక్ నెమ్మదిగా స్లో చేయడానికి బ్రేకులను తేలికగా ఉపయోగించుకోవచ్చు. బైక్ స్లో అవ్వగానే రేస్ చేస్తూ మునపటి స్పీడ్ తో ప్రయాణించవచ్చు.
మీరు హైవేపై, ట్రాఫిక్ ప్రాంతంలో లేదా అధిక లేదా తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా మీ బైక్ ని ఆకస్మాత్తుగా ఆపాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడితే అటువంటి పరిస్థితులలో, మీరు క్లచ్, బ్రేక్ రెండింటినీ ఒకేసారి ఉపయోగించి మీ బైక్ ని నిలిపివేయవచ్చు. ఇది టెక్నిక్ ని ఉపయోగించి త్వరగా ఆపడానికి ప్రయత్నించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో ఉపయోగపడే టెక్నిక్ గా ఉండనుంది.
ఏదీ ఏమైన భద్రత విషయంలో మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారనేది కీలకం. కేవలం అవగాహన కోసమే మేము ఈ అంశాన్ని ఎంచుకున్నాము. బ్రేకింగ్ వల్ల ఇంధన సామర్థ్యం లేదా మైలేజ్ గురించి ఆందోళన చెందవద్దు. బైక్ నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ఉపయోగపడనుంది. కేర్ ఫుల్ గాడ్రైవ్ చేస్తూ క్షేమంగా గమ్యాన్ని చేరండి.


Click it and Unblock the Notifications








