Viral Video హ్యాండ్‌ బ్రేక్‌ వినియోగించే అలవాటు లేదా.. మీకు ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు..!

మనలో చాలా మంది కార్లను డ్రైవ్‌ చేస్తుంటాం. అయితే వాహనాన్ని ఎక్కడైనా నిలపాల్సి వచ్చినప్పుడు, హ్యాండ్‌ బ్రేక్‌ వినియోగించే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే అన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. ఫలితంగా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. చాలా సంవత్సరాల నుంచి వాహనం నడిపిన అనుభవం ఉన్న వాళ్లు కూడా హ్యాండ్‌ బ్రేక్‌ను సరిగా వినియోగించడం లేదు.

వాహనం తొలి గేర్‌లో ఉన్నా గానీ.. హ్యాండ్‌ బ్రేక్‌ వేస్తేనే కొ‌న్నిసార్లు ఆగుతుంది. హ్యాండ్‌ బ్రేక్‌ వేయని వాహనాలు ముందుకు లేదా వెనక్కి వెళ్లిపోవడం మనం సోషల్‌మీడియాలో చూసి ఉంటాం. అసలు హ్యాండ్‌ బ్రేక్‌ వేయకుండా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెబుతూ కేరళ ప్రభుత్వ MVD ఓ వీడియోను విడుదల చేసింది.

Importance of car handbrake video viral

వాహనం హ్యాండ్‌ బ్రేకుల నిర్వహణ సరిగా లేక అవసరమైన సమయంలో పనిచేసే అవకాశం ఉండదు. బ్రేక్‌ కేబుల్‌ తెగినా రిపేర్‌ చేయనివారు మనలో చాలా మంది ఉంటారు. కేరళ ప్రభుత్వ అధికారులు విడుదల చేసిన వీడియో వాహనం నిలిపిన సమయంలో హ్యాండ్‌ బ్రేక్‌ ఎంత అవసరమో తెలియజేస్తుంది.

ఎత్తైన ప్రాంతంలో పార్క్‌ చేసిన ఓ జీప్‌ వెనక్కి వెళ్లిపోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. దాన్ని గమనించిన కొంత మంది వాహనం నిలిపేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఫలితంగా జీప్‌ వేగంగా వెనక్కి వెళ్లిపోయి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో నిలుస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహనాలు లేకపోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదు. లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇదే వాహనానికి హ్యాండ్‌ బ్రేక్‌ వేసి ఉండే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. మోటార్‌ వెహికల్‌ చట్టంలోని సెక్షన్‌ 96 ప్రకారం.. మోటార్‌ సైకిళ్లు, దివ్యాంగుల వాహనాలు, మరియు రోడ్ రోలర్‌లు మినహా మిగిలిన వాహనాలకు సర్సీస్‌ బ్రేక్‌లకు అదనంగా పార్కింగ్‌ బ్రేక్‌లు లేదా హ్యాండ్‌ బ్రేక్‌లు ఉండాలని స్పష్టం చేసింది. కానీ మనలో చాలా మంది హ్యాండ్‌ బ్రేకులను సరిగా వినియోగించడం లేదు.

Importance of car handbrake video viral

నిలిపి ఉన్న వాహనానికి హ్యాండ్‌ బ్రేక్‌ వేయాలి. అనంతరం వాహనం ఉన్న ప్రాంతం వెనుకకు వాలుగా ఉంటే ఫస్ట్‌ గేర్‌ వేసి ఉంచాలి. అదే వాహనం మందువైపు వాలుగా ఉంటే రివర్స్‌ గేర్‌ వేసి పార్క్ చేయాలి. ఫలితంగా వాహనం ఎటువైపునకు కదలే అవకాశం ఉండదు. ఫలితంగా వాహనానికి గానీ ఇతరులకు గానీ ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు.

అలాగే కొందరు హ్యాండ్‌ బ్రేక్‌లు ఆన్‌లో ఉంచే వాహనం డ్రైవ్‌ చేస్తారు. ఫలితంగా వాహనం బ్రేకులు త్వరగా డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలానే ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేస్తే రోటర్లు మరియు బ్రేక్‌ ప్యాడ్‌ల మధ్య ఘర్షణ పెరుగుతుంది. దీంతో బ్రేక్‌ ప్యాడ్స్ కాలిపోయే అవకాశం ఉంటుంది.

Importance of car handbrake video viral

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 24, 2023, 13:26 [IST]
English summary
Importance of car handbrake video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+