ఇలా చేస్తే మీ కారు ఎప్పటికీ కొత్తదానిలా నిగనిగా మెరిసిపోతుంది..!
కొత్త కారును కొనగానే సరిపోదు, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే, చాలా ఏళ్ల తర్వాత కూడా మీ కారు కొత్త కారు మాదిరిగానే కనిపిస్తుంది. సాధారణంగా, కారు మెయింటినెన్స్ విషయంలో క్రమం తప్పకుండా సర్వీస్ చేయించడంతో పాటుగా కార్ వాష్ కూడా చేయించాలి. ఒకవేళ, ఖరీదైన కార్ వాష్‌లు వద్దనుకుంటే, మీరు ఇంటి వద్దనే మీ కారును శుభ్రం చేసుకోవచ్చు. అయితే, కొత్త కారుపై ఇలా స్వంత ప్రయోగాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మరి కారును సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కార్ వాష్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే కారు పెయింట్ దెబ్బతింటుంది. అంతేకాకుండా, కారుపై కంటికి కనిపించే గీతలు (స్క్రాచెస్) కూడా పడుతాయి. ఇంటి వద్ద కార్ వాష్ చేయడం కోసం మీకు ఈ వస్తువులు అవసం అవుతాయి. అవేంటంటే, రెండు బకెట్లు, వాష్ మిట్‌లు (చేతి తొడుగులు), టైర్ బ్రష్, కార్ వాష్ షాంపూ, రెండు లేదా మూడు మైక్రోఫైబర్ టవల్స్, కార్ వాక్స్, అప్లికేటర్ స్పాంజ్ మరియు పుష్కలంగా నీటి సరఫరా ఉన్న ట్యాప్ అవసరం.

కారును నీడలో పార్క్ చేసి కడగండి
కారుని కడగడానికి ముందు వీలైనంత వరకూ దానిని నీడలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కార్ వాష్ చేసే ప్రాంతంలో నీడ లేకపోయినట్లయితే, మీ కారును ఉదయాన్నే కానీ లేదా సాయంత్రం కానీ వాష్ చేయండి. ఎందుకంటే, మండుటెండలో కారును వాష్ చేయడం వలన కారు ఉపరితలంపై నిలిచే నీరు ఆవిరైపోతుంది. ఫలితంగా, కారు ఉపరితలంపై నీటి మరకు (స్ప్లాచ్‌లు) ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, వీలైనంత వరకూ కారుని కడగడానికి నీడ లేదా చల్లగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి.

వాష్ కోసం కారుని సిద్ధం చేసుకోండి
కారుని వాష్ చేయడానికి ముందు దానిని వాష్ కి రెడీ చేసుకోవడం చాలా అవసరం. కారుపై ఎక్కువగా దుమ్ము ఉన్నట్లయితే, డస్టర్ సాయంతో ముందుగా దుమ్ముని తొలగించండి. విండ్‌షీల్డ్ వైపర్‌లు క్లిక్ అని శబ్ధం చేసే చేసే వరకు విండ్‌షీల్డ్ నుండి దూరంగా లాగండి. మీ కారును వాష్ చేయడానికి ముందు అన్ని విండోలు, డోర్లు మరియు సన్‌రూఫ్‌లను మూసివేయండి. ఇప్పుడు, పైన తెలిపిన వస్తువులను మీకు సమీపంలో ఉంచుకొని, రెండు బకెట్లను శుభ్రమైన నీటితో నింపండి.

మొదటి దశ
ఉపరితలంపై పేరుకుపోయిన ధూళిని వదిలించడానికి ఓ చిన్నపాటి ట్యూబ్ ని కానీ లేదా పైప్ ని ఉపయోగించి, దాని సాయంతో గాలిని ఊదండి. ఒకవేళ మీ ఇంటిలో కార్ వాక్యూమ్ లేదా ప్రెజర్ వాష్ ఉంటే వీలైనంత వరకూ వాటిని ఇప్పుడే ఉపయోగించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే, కారు ఉండే ధూళిలో ఏవైనా ఘనమైన ధూళి కణాలు ఉంటే, అని కారు ఉపరితలంపై ఉండే క్లియర్ కోట్ పై గీతలు పడేలా చేయవచ్చు. ధూళిని ఎల్లప్పుడూ పై నుండి క్రిందకు విధిలించడానికి ప్రయత్నించండి. వీల్ ఆర్చ్‌ల క్రింద పేరుకున్న మట్టిని తొలగించడానికి మీరు ప్రెజర్ వాషర్‌ను ఉపయోగించవచ్చు.

రెండవ దశ
ముందుగా కారు చక్రాల నుండి కడగడం ప్రారంభించండి ఎందుకంటే ఇవి చాలా మురికిగా ఉండే అవకాశం ఉంటుంది. వీల్ క్లీనింగ్ బ్రష్‌పై కొంత కార్ షాంపూని అప్లయ్ చేసి చక్రంలోని ప్రతి మూలను బ్రష్ చేయండి. ఒకవేళ మీ వద్ద వీల్ బ్రష్ లేకుంటే మీరు వాష్ మిట్‌ను కూడా ఉపయోగించవచ్చు. వీల్స్ లో మురికి మందంగా ఉంటే, దానిని తొలగించడానికి టైర్ బ్రష్ చాలా అనుకూలంగా ఉంటుంది.

మూడవ దశ
కారు చక్రాలను కడిగిన తర్వాత, నీటితో నిండిన బకెట్లలో ఒకదానిలో సిఫార్సు చేయబడిన కార్ షాంపూని పోసి బాగా నురగ వచ్చే వరకూ కలియబెట్టండి.

నాల్గవ దశ
కారుని ఎల్లప్పుడూ పై నుండి క్రింది కడగడం ప్రారంభించండి. ఇది మీ పనిని మరింత సమర్థవంతంగా చేస్తుంది. అంతేకాదు, వాష్ మిట్‌లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి వాష్ మిట్‌ను తరచూ నీటితో బకెట్‌లో ముంచుతూ శుభ్రం చేసుకోండి. కారుపై షాంపూ వాటర్ అప్లయ్ చేసేటప్పుడు వాష్ మిట్‌ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం, ఎందుకంటే వాష్ మిట్‌లో పేరుకుపోయే మురికిలో చిన్నపాటి ఇసుకు రేణువులు ఉండవచ్చు. ఫలితంగా శుభ్రం చేసేటప్పుడు కారుపై గీతలు ఏర్పడవచ్చు. ఈ ప్రక్రియలో మీ బకెట్‌లోని నీరు మురికిగా మారినట్లయితే, వెంటనే నీటిని మార్చండి. అలాగే, కార్ వాష్ సమయంలో కారును పూర్తిగా మంచి నీటితో శుభ్రం చేసే వరకూ తడిగా ఉంచడం చాలా ముఖ్యం.

ఐదవ దశ
ఇలా కారుపై ఫోమ్ ని అప్లయ్ చేసిన తర్వాత, నీటిని ఉపయోగించి కారుపై ఉండే ఫోమ్ మొత్తం తొలగిపోయే వరకూ క్లీన్ చేయండి. ఈ విధంగా కారును కడిగిన తర్వాత, మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించి కారును పొడిగా అయ్యే వరకూ తుడవండి. కారుని తుడవడం కోసం 1000GSM కంటే ఎక్కువ ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించడం మంచిది, ఎందుకంటే ఓ చిన్న కారును తుడవడానికి కేవలం ఒక టవల్ సరిపోతుంది.

ఆరవ దశ
కారుపై తడి లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత, ఇప్పుడు కారు మొత్తానికి వ్యాక్స్‌ను సున్నితంగా అప్లై చేయడానికి అప్లికేటర్ స్పాంజ్‌ని ఉపయోగించండి. ఇవి రెండూ కార్ యాక్ససరీ షాపులలో లభిస్తాయి. కారు ఉపరితలంపై కార్ వ్యాక్స్‌ను అప్లై చేసేటప్పుడు గుండ్రంగా రుద్దాలి. కార్ వ్యాక్స్ ని కేవలం బాడీ ప్యానెస్ల్ పై మాత్రమే అప్లయ్ చేయాలి, గాజు ఉపరితలాలపై వ్యాక్స్ ని అప్లయ్ చేయకూడదని గుర్తుంచుకోండి.

ఏడవ దశ
ఇలా కార్ వ్యాక్స్ ని అప్లై చేసిన తర్వాత, కొన్ని నిమిషాల పాటు వేచి ఉండండి. ఆ తర్వాత శుభ్రమైన మరిు పొడిగా ఉండే మైక్రోఫైబర్ టవల్ ను ఉపయోగించి మరోసారి కారు మొత్తాన్ని శుభ్రంగా తుడవండి. ఇలా చేయడం కారు జీవితకాలం మన్నడంతో పాటుగా ఎప్పటికీ మీ కారు కొత్తదిలా కనిపిస్తుంది. ప్రతి కార్ వాష్ తర్వాత వ్యాక్స్ ని అప్లయ్ చేయడం వలన కారుకు కొత్త మెరుపును జోడించడమే కాకుండా, కారుపై ధూళి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ తదుపరిసారి కారును కడగడానికి కూడా సహాయపడుతుంది, ఎందుకంటే ఉపరితలం నుండి మురికిని తొలగించడం సులభం అవుతుంది.


Click it and Unblock the Notifications








