హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

హృతిక్ రోషన్ గురించి దాదాపు చాలామందికి తెలుసు, అయితే హృతిక్ రోషన్ వంటి సెలబ్రెటీ ఎలాంటి కార్లను వినియోగిస్తారు అనేది కొంతమందికి తెల్సి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే మనం ఈ కథనంలో హృతిక్ రోషన్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II:

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను తాయారు చేసే కంపెనీ యొక్క 'రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II' హృతిక్ రోషన్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని అతని 42 వ పుట్టిన రోజున కొనుగోలు చేశారు. ఇది 6.2-లీటర్ ట్విన్-టర్బో వి 12 ఇంజిన్‌ కలిగి 563 బిహెచ్‌పి పవర్ మరియు 780 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 250 కి.మీ వేగంతో ఉంటుంది మరియు 4.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వరకు వేగవంతం చేస్తుంది.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా ఉన్న ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II ప్రారంభ ధరలు రూ. 7 కోట్లు. భారతదేశంలో హృతిక్ రోషన్ మాత్రమే కాకుండా ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలు కూడా ఈ ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

మెర్సిడెస్ మేబాచ్ S600:

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల్ తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క 'మేబాచ్ S600' లగ్జరీ కారు కూడా హృతిక్ రోషన్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని ఇతడు 2016 లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు ట్విన్-టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ మేబాచ్ S600 లగ్జరీ కారు 5300 ఆర్‌పిఎమ్ వద్ద 530 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 830 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. కావున ఇందులో హీటెడ్ మరియు కోల్డ్ మసాజ్ సీట్లు, ఫోటో క్రోమాటిక్ రూప్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్:

హృతిక్ రోషన్ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కార్లు ఇతర మోడల్స్ కంటే ఎక్కువ వున్నాయి. కావున ఇతని వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కూడా ఉంది. ఈ కారులో హృతిక్ మరియు వారి తండ్రి రాకేష్ రోషన్ ప్రయాణించేటప్పుడు ప్రమాదానికి గురయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. ఇందులో అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల వారికి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఇటువంటి కార్లను ఎక్కువమంది సెలబ్రిటీలు వినియోగించడానికి ఆసక్తి చూపుతారు.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

పోర్షే కేయెన్ టర్బో:

2002 లో ప్రారంభించబడిన పోర్షే కేయెన్ టర్బో అనేది కంపెనీ యొక్క అతి పెద్ద SUV గా పరిగణించబడుతోంది. హృతిక్ రోషన్ ఈ కారుని 2006 లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు వి8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 450 బిహెచ్‌పి పవర్ మరియు 623 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కారు హృతిక్ రోషన్ గ్యారేజిలో ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలియదు.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

మినీ కూపర్ కన్వర్టిబుల్:

హృతిక్ రోషన్ రోజువారీ ప్రయాణానికి ఉపయోగించే కార్లలో మినీ కూపర్ కన్వర్టిబుల్ ఒకటి. ఈ కారులో చాలా తన కుమారులతో కలిసి ముంబైలో ప్రయాణించేటప్పుడు కనిపించాడు. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ మంచి పర్ఫామెన్స్ అందించే కారు. ఇది నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మినీ కూపర్ కన్వర్టిబుల్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 192 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్:

రోజువారీ ప్రయాణానికి చిన్న కార్లు మాత్రమే కాకుండా ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వంటి పెద్ద కార్లను కూడా హృతిక్ రోషన్ కలిగి ఉన్నారు. నిజానికి ఈ కారుని చాలామంది సెలబ్రెటీలు కలిగి ఉన్నారు. ఇది అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారుగా పరిగణించబడుతుంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

ఫెరారీ 360 మోడెనా:

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీల జాబితాలో ఒకటి ఫెరారీ. ఈ ఫెరారీ కంపెనీ యొక్క 360 మోడెనా కారు కూడా హృతిక్ రోషన్ గ్యారేజిలో ఉంది. ఫెరారీ 360 మోడెనా కారుని కొనుగోలు చేసిన రెండవ వ్యక్తి హృతిక్ రోషన్ కావడం గమనార్హం. అయితే ఇందులో మొదటి కారుని సచిన్ టెండూల్కర్ కొనుగోలు చేశారు.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

ఫెరారీ 360 మోడెనా 3.6-లీటర్ వి8 కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 400 బిహెచ్‌పి పవర్ మరియు 372 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎఫ్ 1 ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం క్లాసిక్ వింటేజ్ కారుగా మారిపోయింది. కావున దీని ప్రారంభ ధర రూ. 82 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్:

ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ అద్భుతమైన గ్రాండ్ టూరర్. ఇది నాలుగు డోర్స్ కలిగిన సూపర్ సెడాన్, ఇది 6.0 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 6650 ఆర్‌పిఎమ్ వద్ద 552 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది కూడా హృతిక్ రోషన్ గ్యారేజిలో ఉంది. దీనిని ఇతడు ఇటీవలే కొనుగోలు చేసినట్లు సమాచారం.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

ఫోర్డ్ ముస్టాంగ్:

హృతిక్ రోషన్ కార్ గ్యారేజిలో చెప్పుకోదగ్గ కారు ఈ ఫోర్డ్ ముస్టాంగ్. ఇది 1966 నాటి ఐకానిక్ కారు. అయితే హృతిక్ రోషన్ ఈ కారుని 2000 వ సంవత్సరంలో కొనుగోలు చేశారు. అప్పట్లోనే ఈ కారు ధర రూ. 2 కోట్లు. అయితే ఇందులో ఎక్కువ భాగం ఈ కారుని భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి ఖర్చు అయినట్లు తెలిసింది.

హృతిక్ రోషన్ కార్ల ప్రపంచం: రోల్స్ రాయిస్ నుంచి 1966 ఫోర్డ్ ముస్టాంగ్ వరకు..

సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు మొదలైనవారు అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉంటారని అందరికి తెలుసు. గతంలో కూడా మనం పొలిటికల్ లీడర్స్ కార్లను గురించి, బాలీవుడ్ సెలబ్రెటీల కార్లను గురించి, ఫెమస్ మహిళా సింగర్స్ కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hrithik roshan car collection ferrari 360 modena to rolls royce ghost details
Story first published: Tuesday, January 10, 2023, 19:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X