హృతిక్ రోషన్ బహుమతిగా పొందిన రోల్స్ రాయిస్ కారు: ఎవరా అజ్ఞాత వ్యక్తి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ జనవరి 10, 2016 రోజున 42 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. అయితే హృతిక్ రోషన్ కు ఒక కారు బహుమానంగా లభించింది. అది కూడా సాదా సీదా కారు కాదండోయ్ రోల్స్ రాయిస్ కారు.
హృతిక్ రోషన్ జన్మదిన వేడుకలు మరియు రోల్స్ రాయిస్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో

హృతిక్ రోషన్ జనవరి 10, 2016 నాటికి 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 వ జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు.

ముంబాయ్‌లోని రూఫ్ టాప్ హోటల్‌లో మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు విందు కూడా ఇచ్చారు.

తన పుట్టిన రోజున నాడు తనను ఎంతో మంది శుభాకాంక్షల మెసేజ్ లతో ట్విట్టర్ ఖాతాను ముంచెత్తారు అని తెలిపాడు.

ఎంత మంది శుభాకాంక్షలు చెప్పినా అది రెండవ విషయం. ఎందుకంటే హృతిక్ రోషన్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా పొందాడు కాబట్టి

హృతిక్ తనకు తానే రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చుకున్నాడు. ఇది మీరు నమ్మలేకపోయినా. ఇదే నిజం

లగ్జరీ కార్లను అత్యధికంగా ఇష్టపడే వారిలో హృతిక్ రోషన్ కూడా చేరిపోయాడు ఎందుకంటే స్వయంగా తానే బహుమతిగా రోల్స్ రాయిస్ కారును బహుమతిగా పొందాడు.

ఈ రోల్స్ రాయిస్ కారు ధర ఎంతో తెలుసా అక్షరాలా ఏడు కోట్ల రుపాయలుగా ఉంది.

ఇకపోతే ఈ బర్త్‌డే బాబు ప్రస్తుతం మొహెంజోదారో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఇది స్క్రీన మీదకు రానుంది..

- బాలీవుడ్ తారలు, వారి కార్ నెంబర్ల వెనకున్న రహస్యాలు.....! !
- త్రిషకు బాయ్‌ఫ్రెండ్ కాస్ట్లీ గిఫ్ట్: ఇక్కడ క్లిక్ చేయండి
- మైఖేల్ జాక్సన్ జ్ఞాపకాలు..


Click it and Unblock the Notifications








