Pending Challans: వాహనదారులకు అదిరిపోయే ఆఫర్.. పెండింగ్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్స్
తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన చలాన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కొత్త సంవత్సరం సందర్భంగా వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్ల(Discount On Pending Challans)పై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తూ శుభవార్త అందించింది. ఇ-చలాన్లపై 50 నుంచి 90 శాతం వరకు రాయితీ ప్రకటించింది.
రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలానాలపై 50 నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తూ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఈ మేరకు పోలీస్ శాఖ అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ నిన్నటి నుంచి అంటే డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. కాగా గతేడాది కూడా పెండింగ్ చలానాల(Pending Challans Telangana)పై డిస్కౌంట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. ఈ ఏడాది కూడా వాహనదారులకు ఉపశమనం కలిగిస్తోంది.

గతేడాది కూడా రాష్ట్రంలో పెండింగ్ చలానాలపై పోలీస్ శాఖ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 300 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మరోసారి చలాన్లపై డిస్కౌండ్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ ముందుకొచ్చింది. అయితే ఈ డిస్కౌంట్లు గతంలో ఇచ్చిన రాయితీ కంటే ఎక్కువగా ఉండేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ రాయితీ ఆఫర్ ఈ నెల 26 నుంచి 22024, జనవరి 10 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పోలీస్ శాఖ తెలిపింది. ఈ మేరకు రాయితీల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government Go On Pending Challans) జీవో కూడా విడుదల చేసింది. మరి ఏయే వాహనాలపై ఎంత మేరకు డిస్కౌంట్ ప్రకటించారనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై ఉన్న పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం 90 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. కాగా ద్విచక్ర వాహనాలపై ఉన్న చలాన్ల విషయంలో 80 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ పొందవచ్చు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ చలాన్లపై 50 శాతం రాయితీని అందిస్తోంది.
వాహనదారులు ఈ పెండింగ్ చలానాలను ఆన్‌లైన్ లేదా సమీప మీసేవా సెంటర్లలో డిస్కౌంట్‌తో కట్టేయొచ్చు. 2022లో పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖ డిస్కౌంట్ ప్రకటించగా రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల పైన చలాన్ల ద్వారా రూ. 300 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే మళ్లీ ఆ తర్వాత వాహనదారులు తమ వాహనాలపై విధించబడిన చలానాలను కట్టలేదు.

కాగా గతేడాది ద్విచక్రవాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖ 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మిగిలిన వాటికి మాత్రం 50 శాతం రాయితీ ఇచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాహనదారులు మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. ఆ తర్వాత నమోదైన చలాన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.
దీంతో ప్రస్తుతం మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా ఇ- చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీటిని వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మాదిరిగానే రాయితీ ప్రకటించింది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గడువు తేదీ అనంతరం పెండింగ్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications








