వామ్మో ఇదేం ట్రాఫిక్ సామీ.. హైదరాబాద్ రోడ్లపైకి రావాలంటే భయపడుతున్న జనాలు..!!

హైదరాబాద్‌లో వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఈ సమయంలో రోడ్లపైకి రావాలంటే జనం జంకుతున్నారు. సోమవారం నుంచి కురుస్తున్న వానలతో భాగ్యనగరం రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి వెళ్లవలసిన వారు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌లో ఇరుక్కుని నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగానే ట్రాఫిక్‌గా ఉండే రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుని పోయాయి. కొన్ని చోట్ల ఈ ట్రాఫిక్‌ల నుంచి బయట పడేందుకు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.

Huge-Traffic-Jam-In-Hyderabad

కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, నిజాంపేట, మియాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, ప్రగతినగర్, రామంతాపూర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ట్రాఫిక్ జాం కొనసాగుతోంది. భారీ ట్రాఫిక్‌తో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పిలుపునిచ్చారు. దీంతో చాలా కంపెనీలు పరిస్థితికి తగినట్లుగా వర్క్‌ ఫ్రం హోమ్‌ సౌకర్యం కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా హైటెక్ సిటీ, ఇతర ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాల్లో ట్రాఫిక్ జాం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాధారణంగా ఈ ఐటీ ఉద్యోగులు సొంత వాహనాల్లో ఆఫీస్‌కి చేరుకుంటారు. మరికొందరు క్యాబ్‌ల్లో, మెట్రోల్లో ఆఫీస్‌కి చేరుకుంటారు. దీంతో జనాలు అందరు షిఫ్ట్‌కి తగినట్లుగా ఆఫీస్‌కి రావడంతో ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. వర్షాకాలంలో ఈ ప్రభావం చాలా ఎక్కవే ఉంది.

Huge-Traffic-Jam-In-Hyderabad

ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించింది. పెరిగిన జనాభా, వాహనాల సంఖ్య అధికమవ్వడంతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కసారిగా జనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్‌ పెరుగుతోంది. మహానగరంలో చాలా వరకు ఈ సమస్య నిత్యకృత్యం అయిపోయింది. దీనిని అధిగమించేందుకు ప్రజా రవాణాను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత యువత బిజీ లైఫ్‌లో భాగంగా సొంత వాహనాలపై ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు.

Huge-Traffic-Jam-In-Hyderabad

ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి తడిచిపోయింది. రోడ్లపై నీరు నిల్వడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు ఇంకా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజుల సెలవులను ప్రకటించింది.

ఉదయం నుంచి ఏకధాటిగా భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నాంపల్లి, బేగంపేట, అమీర్‌ పేట, సికింద్రాబాద్‌, జీడిమెట్ల, సూరారం, బాలానగర్‌, కూకట్‌ పల్లి, ఎల్బీనగర్‌, మలక్‌ పేటలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికి చాలా చోట్ల రెడ్‌ అలెర్ట్‌ని జారీ చేసింది.

వర్షంలో ట్రాన్స్​ఫార్మర్లకు దూరంగా ఉండాలని.. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే దగ్గర్లోని సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తెలిపేందుకు అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి సహాయం పొందవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 5, 2023, 19:44 [IST]
English summary
Huge traffic jam in hyderabad due to heavy rains videos gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+