అచ్చం కారు మాదిరిగానే సౌండ్ చేసే డానియేల్ : వీడియో
చిన్నతనంలో మనమందరం ఏదో ఒక సందర్భంలో కార్లు, బైక్‌లు, ఆటోలు, రైలు, విమానం వంటి వాహనాలను చేసే శబ్ధాలను అనుకరించే ఉంటాం. కొందరైతే ఇప్పటికీ, తమ పిల్లను ఆడించేందుకు అలాంటి శబ్ధాలను చేస్తూ ఉంటారు. కానీ, ఇలా వాహనాలను చేసే శబ్ధాలనే అనుకరించడాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు ఈ ఆస్ట్రేలియన్ వ్యక్తి డానియేల్ జోవనోవ్.
ఫార్ములా వన్, మోటార్‌స్పోర్ట్, ఆఫ్ రోడర్స్, సూపర్ కార్స్ వంటి అనేక రకాల కార్ల యొక్క ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ సౌండ్)ను డానియేల్ అనుకరించగలడు. డానియేల్ తన నోటితో చేసే ఈ శబ్ధం విన్నవారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆస్ట్రోలియాస్ గాట్ టాలెంట్ అనే రియాల్టీ షోలో కూడా పాల్గొని తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించాడు.
ఈనాటి మన వీడియోలో డానియేల్ జోవనోవ్ చేసిన కొన్ని కారు ధ్వని అనుకరణలను చూద్దాం రండి. ఇటీవల జరిగిన ర్యాలీ ఆస్ట్రేలియా అనే మోటార్‌స్పోర్ట్ కార్యక్రమంలో అతని పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో జోవనోవ్ కొన్ని రకాల కార్లు శబ్ధాలను చేసి, అక్కడున్న ర్యాలీ డ్రైవర్లను ఆ కారేంటే గుర్తించమని అడగటం, వారు దానిని ఖచ్ఛితంగా గుర్తించడం జరిగింది.
ఈ వీడియోలో జోవనోవ్ లాంబోర్గినీ గల్లార్డో సూపర్‌కార్, రెడ్ బుల్ ఎఫ్1 రేస్ కార్ (వి6 టర్బో), సుబారు డబ్ల్యూఆర్ఎక్స్ ఎస్‌టిఐ ర్యాలీ కార్ మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో ఆర్ డబ్ల్యూఆర్‌సి ర్యాలీ కార్ సౌండ్లను అనుకరించి చూపాడు. మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/e9c82EXcuFA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








