డాక్టర్ భార్య కోసం ల్యాంబోర్ఘిని హురాకాన్ కారు కొన్న భర్త
మన జీవితంలో బాగా నచ్చిన వారికి ఆటోమొబైల్ (కారు లేదా బైక్) కంటే మించిన గిఫ్టు మరేదీ ఉండదు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉన్నట్లుండి ఏదైనా ఒక ఆటోమొబైల్ గిఫ్టు ఇస్తే వారిలో మొహంలో కనబడే చిరునవ్వు చిరకాలం పధిలంగా ఉంటుంది. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న తమ్ముడు ఇలా.. ఫ్యామిలీలో వారి పుట్టిన రోజుకో లేదంటే మరేదైనా ప్రత్యేకమైన రోజు నాడు వారికి నచ్చిన వాహనాన్ని బహుమానంగా ఇచ్చిన సంఘటనలు చాలా చూశాం... కానీ బెంగళూరుకు చెందిన ఈ జంట అందరి కంటే విభిన్నం.
అవును ఓ భర్త తన డాక్టరు పెళ్లానికి అత్యంత ఖరీదైన లాంబోర్ఘిని హురాకాన్ ఎల్‌పి610-4 కారును సడెన్‌గా గిఫ్టుగా ఇచ్చి సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు. తన లైఫ్‌లో కుదరదులే అనుకున్న కళ ఒక్కసారిగా నిజమైతే ఈ భార్య ఎలా ఫీల్ అవుతుందో తెలుసా...? వీడియో, ఫోటోలు మరియు కారు గురించి మరిన్ని వివరాలు....

భర్త తన భార్యను లాంబోర్ఘిని షోరూమ్‌కు తీసుకురావడం నుండి... సడెన్ సర్‌ప్రైజ్‌గా కారును గిఫ్టుగా ఇవ్వడం వరకు అన్ని అనుభూతులను ల్యాంబోర్ఘిని షోరూం నిర్వాహకులు వీడియో తీసి ఆటోమొబైల్ ఆర్డెంట్ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశారు. లా ఫెమ్మె (La Femme) సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న డాక్టర్ నిలూఫర్ షెరిఫ్‌కు ఆమె భర్త ఆకర్షణీయమైన గియాల్లో ఇంటి ఫినిషింగ్ (పసుపు రంగు) గల హురాకాన్ సూపర్ కారును బహూకరించాడు.

ఇండియాలో సూపర్ కార్లను, లగ్జరీ వాహనాలను బహుమానంగా ఇవ్వడం చాలా అరుదుగా జరుగుటుంది. ఇలాంటి సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. చివరగా దుబాయ్‌లో స్థరపడిన సోహన్ రాయ్ అనే ఎన్నారై తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ ఎస్‌యూవీని బహుతిగా ఇచ్చాడు. దీంతో ప్రపంచంలోనే రోల్స్ రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీ పొందిన మొట్టమొదటి మహిళగా నిలిచింది.
తాజాగా బెంగళూరులో డాక్టర్ భార్యకు అత్యంత ఖరీదైన ల్యాంబోర్ఘిని కారును బహుమానంగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఒక్కసారిగా భర్తను కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ సన్నివేశాన్ని వీడియోలో చూడవచ్చు.

పసుపు రంగులో మెరిసిపోతున్న ల్యాంబోర్ఘిని హురాకాన్ ఎల్‌పి 610-4 కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.7 కోట్లు. ట్యాక్స్‌తో కలుపుని దీని ఆన్-రోడ్ ధర అక్షరాలా నాలుగు కోట్ల ఎనభై లక్షల (4.7 కోట్లు) రూపాయలు. ల్యాంబోర్ఘిని హురాకాన్ బేస్ వేరియంట్ రూ. 3 కోట్ల ధరతో మొదలవుతుంది. ఈ జంట కొనుగోలు చేసిన మోడల్ అత్యంత ఖరీదైన AWD వేరియంట్.

సాంకేతికంగా ల్యాంబోర్ఘిని హురాకాన్ ఎల్ేజి 610-4 కారులో 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 602బీహెచ్పీ పవర్ మరియు 560ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు అందుతుంది.

హురాకాన్ సూపర్ కారులో మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ డ్రైవింగ్ మోడ్స్ సందర్భాన్ని బట్టి కావాల్సిన పవర్ అందివ్వడంలో సహాయపడతాయి. కేవలం 3 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇటాలియన్ సూపర్ కార్ల దిగ్గజ ల్యాంబోర్ఘినికి చెందిన హురాకాన్ మోడల్ ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ సూపర్ కారుగా నిలిచింది. ల్యాంబోర్ఘిని ఇటీవల సరికొత్త ఉరుస్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications








