Just In
- 37 min ago
వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం
- 2 hrs ago
జాగ్వార్ ఐ-పేస్ బ్లాక్ ఎడిషన్; డిజైన్, ఫీచర్స్ & వివరాలు
- 3 hrs ago
డుకాటీ పానిగలే సూపర్ బైక్ డిజైన్‌ను కాపీ కొట్టిన చైనా కంపెనీ.. పూర్తి వివరాలు
- 17 hrs ago
వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]
Don't Miss
- News
18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్... మరో 48గంటల్లో రిజిస్ట్రేషన్ షురూ... ఇలా రిజిస్టర్ చేసుకోండి...
- Finance
బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి: ఐనా రూ.48,000 వద్ద పసిడి
- Movies
కరోనా టైంలో మూడో పెళ్లి... అందుకే ఆ నిర్ణయం.. స్టార్ హీరోయిన్ వివరణ
- Sports
మొన్న ధోనీ.. నిన్న రోహిత్.. నేడు మోర్గాన్.. అదే జరిగితే నిషేధం వేటు!
- Lifestyle
హెచ్చరిక! మీకు అకస్మాత్తుగా మీ నోటిలో ఇలాంటి సమస్య ఉందా? అప్పుడు అది కరోనా కావచ్చు ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?
భారతదేశంలో ఎక్కువమంది వాహనప్రియుల మనసు దోచిన ద్విచక్రవాహనం రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే అతిశయోక్తి కాదు. కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్‌లకు మంచి ఆదరణ ఉంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇతర బైకులకంటే కొంత ప్రత్యేకంగా ఉండటంతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది.

ఈ కారణంగానే ఎక్కువమంది ఈ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఆరు దశాబ్దాలుగా అదే క్రేజ్ తో ముందుకు వెళ్తోంది. అయితే ఇటీవల, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కొత్త మిటియోర్ 350 బైక్ విడుదల చేశారు.

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350 బైక్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి, డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బలే వైరల్ అవుతోంది. ఒక భర్త తన భార్యకు ఎంతగానో ఇష్టమైన ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 క్రూయిజర్ బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు.
MOST READ:ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే; 2 గంటల ప్రయాణం 45 నిముషాల్లో పూర్తి

భర్తలకు భార్యలు మరియు భార్యలు భర్తలకు గిఫ్ట్ లు ఇవ్వడం ఇదే మొదటసారి కాదు. ఇలాంటి సంఘటనలు మనం ఇదివరకు చాలానే చూసాం.. అయితే ఇప్పుడు ఈ వీడియోలో గమనించినట్లయితే ఆమె భర్త క్రాలిఫ్ రోహిత్ సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

వీడియో ప్రారంభంలో, భార్యతో సంభాషణ యొక్క కొన్ని దృశ్యాలు చూపించబడ్డాయి. తరువాత అతను తన భార్యకు బైక్ చూపిస్తూ కలర్ నచ్చిందా అని అడుగుతాడు. ఆ సమయంలో భర్త ఆమెకు బైక్ కీని చూపిస్తాడు, అంతే కాకుండా ఆ బైక్ నీదే అని చెబుతాడు. అది విన్న భార్య ఆశ్చర్యానికి లోనవ్వడమే కాకుండా ఆనందంతో కంటతడి పెట్టుకుంటుంది. ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు.
MOST READ:2021 డాకర్ ర్యాలీలో గాయపడిన సిఎస్ సంతోష్ కోలుకున్నాడు.. కానీ..!!

అప్పుడు భార్య కీ తీసుకొని బైక్ స్టార్ట్ చేస్తుంది. భర్త తన భార్య కోసం సీట్ ఎత్తు కొంత కస్టమైజ్ చేసాడు. ఆ తర్వాత ఆమెకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను రైడ్ చేస్తుంది. ఈ వీడియోలోని కనిపించే ఈ బైక్ లేత గోధుమరంగులో ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మేటోర్ 350 బైక్ మోడల్ ఇప్పుడు ఫైర్బాల్, స్టెల్లార్ మరియు సూపర్నోవా అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

డబుల్ డౌన్‌ట్యూబ్ క్రేడల్ ఫ్రేమ్ అభివృద్ధి చేయబడిన ఈ కొత్త బైక్ థండర్బర్డ్ కంటే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. బైక్ యొక్క సస్పెన్షన్ ముందు భాగంలో 41-మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉంటుంది.
MOST READ:నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350 బైక్ లో 349 సిసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మిటియోర్ 350 బైక్‌లో టర్న్-బై-టర్న్ గూగుల్ నావిగేషన్ ఉంది, ఇందులో టిప్పర్ పాడ్ ఉంది మరియు బ్లూటూత్ ద్వారా డిజిటల్ ఇన్‌స్టాలర్స్ క్లస్టర్‌కు కలుపుతుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతే కాదు ఇది చాలా స్టైలిష్, మంచి డిజైన్ మరియు అట్రాక్టివ్ బైక్.
Image Courtesy: CrayLyf Rohit