ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిలో 40 శాతం మంది అమ్మాయిలే!
హైదరాబాద్: నగరంలోని మోటారిస్టుల్లో మహిళలలు సుమారు 20 శాతం మంది మాత్రమే. అయితే, ట్రాఫిక్ పోలీసుల అంచనా ప్రకారం దాదాపు 40 శాతం మంది మహిళలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం, మహిళా కానిస్టేబుళ్లు, సబ్-ఇన్స్‌పెక్టర్లు తక్కువగా ఉండటమేనని, దీని వలన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే అనేక మంది మహిళా డ్రైవర్లపై కేసులు బుక్ కావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
ట్రాఫిక్ పోలీసుల్లో మహిళా విభాగం కొరత కారణంగా ఇటీవల డ్రంకెన్ డ్రైవింగ్‌పై ట్తాము నిర్వహించిన ఓ స్పెషల్ డ్రైవ్‌లో చాలా మంది మహిళలు తప్పించుకున్నారని, ఇటీవలి కాలంలో పెరుగుతున్న యువ మహిళా డ్రైవర్లు ఎక్కువగా ఓవర్‌స్పీడ్ కేసుల్లో బుక్ అయ్యారని పోలీసులు పేర్కొన్నారు. నగరంలో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే మహిళల్లో సుమారు కేవలం 6 శాతం మంది మాత్రమే కేసులు బుక్ అవుతున్నాయని వారు తెలిపారు.

సాధారణంగా మహళలు అన్న ఒకే ఒక్క కారణంగా, ప్రధమ తప్పుగా వారిని హెచ్చరించి వదిలేయటం జరుగుతుంది కాబట్టే, ఈ కేసుల సంఖ్య తక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం, ఈ విభాగంలో కేవలం నలుగురు మహిళా కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా హోం గార్డులు మాత్రమే ఉన్నారు. ఒక్క మహిళా ఎస్ఐ కూడా లేరు. డ్రైవర్లపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకూ కేవలం 12 మంది మహిళా డ్రైవర్లు మాత్రమే పట్టుబడ్డారు.
ఈ విషయం గురించి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సి.వి. ఆనంద్ ప్రస్థావిస్తూ.. ట్రాఫిక్ పోలీసుల్లో మహిళా విభాగం యొక్క ఆవశ్యకత ఎంతో అవసరమని, స్పెషల్ డ్రైవ్ సందర్భాల్లో మహిళా పోలీసుల కొరత కారణంగా మద్యం సేవించి వాహనాలను నడిపే మహిళలను పట్టుకోవటం కష్టమవుతోందని చెప్పారు. యువతలు, యువ మహిళా డ్రైవర్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు అధికమవుతున్నాయని, ట్రాఫిక్ పోలీసుల విభాగంలోకి మరింత మంది మహిళా కానిస్టేబుళ్లను పంపించాల్సిందిగా తాము చట్టాన్ని కోరామని ఆయన తెలిపారు.
Source: DC


Click it and Unblock the Notifications








