టెకీలకు గుడ్‌ న్యూస్‌.. రోజు హైదరాబాద్‌ to బెంగళూరు వెళ్తున్నారా? ఇక మీ ప్రయాణానికి ఏ బెంగా ఉండదు!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో గల ముఖ్య నగరాలకు ధీటుగా భారతదేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్‌ ఉన్నాయి. ఈ ప్రధాన నగరాలు టెక్‌ విభాగంలో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సిటీల్లో అనేక ఐటీ కంపెనీలు ఉండడంతో నిత్యం వేలాది మంది ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రెండు ముఖ్య నగరాలకు ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ లింకప్స్‌ ఉన్నాయి. దీంతో నిత్యం హైదరాబాద్‌-బెంగళూరు హైవే ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం బెంగళూరు-హైదరాబాద్ హైవే (ఎన్హెచ్-44)ను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిశ్రమలు, విద్య, పర్యాటక రంగాలకు ఈ కొత్త రహదారి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న బెంగళూరు-హైదరాబాద్ హైవేను 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే (Express way)గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీంతో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. ఇది ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచనుంది. హైవేను ఆనుకుని ఉన్న భూముల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Hyderabad-Bangalore-12-Lane-Express-Way

బెంగళూరు- హైదరాబాద్ మధ్య ఉన్న జాతీయ రహదారి-44 పొడవు 576 కి.మీగా ఉంది. ఈ హైవే తెలంగాణలో 210 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్లు విస్తరించి ఉంది. హైదరబాద్‌ నుంచి బెంగళూరుకి చేరుకోవాలంటే సుమారు 9 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైవే విస్తరణ వల్ల ఈ ప్రయాణ వ్యవధి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అదే విధంగా బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రహదారి ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా పంచుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది సుమారు 258 కి.మీగా ఉంది. ఈ పొడవైన రహదారి 3 రాష్ట్రాల్లోని 7 జిల్లాల గుండా వెళుతుంది. ఇది కర్ణాటకలోని 3 జిల్లాలను (బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కోలార్), ఆంధ్రప్రదేశ్ లోని 1 (చిత్తూరు), తమిళనాడులోని 3 జిల్లాలను (వేలూరు, కాంచీపురం, తిరువళ్లూరు)లను కలుపుతుంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మిస్తోంది. 4 లేన్లలో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త రహదారిని వాహనాల రద్దీని బట్టి 8 లేన్లకు విస్తరించవచ్చు. ఈ పనులు పూర్తయిఅందుబాటులోకి వస్తే బెంగళూరు నుంచి రెండు గంటల్లో చెన్నై చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5-6 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తోంది.

బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే ను దేశంలోనే తొలి 'గ్రీన్ హైవే'గా నిలవనుంది. రోడ్డు నిర్మాణానికి కేవలం 33 కి.మీ అటవీ భూమిని మాత్రమే వినియోగిచారు. ఇందులో 41 వెహికల్ అండర్ పాస్‌లు, 17 ఫ్లైఓవర్లు ఉంటాయని తెలిపారు. ఈ ఎక్స్ ప్రెస్ వే బెంగళూరు సమీపంలోని హోసకోటే వద్ద ప్రారంభమై చెన్నై శివార్లలోని శ్రీపెరంబుదూర్ వద్ద ముగుస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2024, 18:40 [IST]
English summary
Hyderabad bangalore highway is going to expanse 12 lane express way
Read more on: #off beat #roads #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+