ఎక్కువ ఛార్జ్ వసూలు చేయడంతో ఓలాకి చుక్కలు చూపించిన కస్టమర్.. ఏకంగా రూ. 95,000 ఫైన్

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక చోట మోసాలను తప్పకుండా ఎదుర్కుంటూ ఉంటారు. అది ఎక్కడైనా కావచ్చు. అయితే ఆన్లైన్ సర్వీసులైన ఓలా, ఉబర్ వంటి వాటిలో ఎక్కువగా మోసాలు జరిగే అవకాశం ఉండదని చాలామంది నమ్ముతారు. కానీ ఇప్పుడు ఇది నిజం కాదనే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

ఇంతకీ ఏమిటి ఆ మోసం, ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

నివేదిల ప్రకారం, ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగినట్లు తెలిసింది. 'జబేజ్ శామ్యూల్' అనే వ్యక్తి 2021 అక్టోబర్ 19 న తానూ తన భార్య నాలుగు గంటలపాటు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే క్యాబ్ నీట్ గా లేకపోవడమే కాకూండా ఏసీ ఆన్ చేయమంటే కూడా ఆ క్యాబ్ డ్రైవర్ వారితో కొంత దురుసుగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన నచ్చకుండా ఆ క్యాబ్ లో వారు సుమారు 4-5 గంటలు ప్రయాణించిన తరువాత దిగేసారు.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

వారు ప్రయాణించింది 4 కిమీ నుంచి 5 కిమీ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆ క్యాబ్ డ్రైవర్ వారికి రూ. 861 చెల్లించాలని చెప్పాడు. నిజానికి 4-5 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 200 కంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం లేదు. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి రూ. 861 వసూలు చేసాడు.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

అంతే కాకూండా.. ఓలా మనీ తీసుకునేందుకు కూడా ఆ క్యాబ్ డ్రైవర్ నిరాకరించాడు. దాంతో శామ్యూల్ ఆ క్యాబ్ డ్రైవర్‌ తో గొడవకు దిగాడు. ఓలా కస్టమర్ కేర్‌ కు కంప్లయింట్ చేశాడు. అయితే ఓలా కస్టమర్ కేర్ అతనికి న్యాయం చేయలేదు. దాంతో 'జబేజ్ శామ్యూల్' సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కోర్టును(కన్స్యూమర్ కోర్ట్) ఆశ్రయించాడు. ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేశాడని పైగా ఓలా ప్రతినిధులను సంప్రదించినా కూడా ప్రయోజనం లేకపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

కోర్టు హియరింగ్‌ కు ఓలా ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. దాంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపిన తర్వాత కోర్టు ఫీజుల కింది రూ. 7,000 రూపాయలు, నష్టపరిహారం కింద రూ. 88,000 చెల్లించాలని ఓలాను కోర్టు ఆదేశించింది. అది మాత్రమే కాకుండా వినియోదారుని నుంచి బలవంతంగా వసూలు చేసిన రూ. 861 కు 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించమే లక్ష్యం అంటూ చాలా సంస్థలు ఇలాంటి సర్వీలను ప్రారంభించాయి. అందులో కొంతమంది వ్యక్తుల వల్ల ఆ సంస్థలకే చెడ్డపేరు వస్తుంది. నిజానికి కస్టమర్లతో చాలా మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి. లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి నిదర్శనమే ఈ సంఘటన.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

ఇదిలా ఉండగా మన నిత్యజీవితంలో కూడా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పట్టు అక్కడి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు లేదా ఆటో సర్వీసులు వారు నిలువునా దోచేస్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగరూకుగా ఉండాలి. లేకుంటే కొత్త ప్రదేశాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి చాలామంది అనుభవంలో జరిగి ఉంటాయి. అయితే అందరూ కోర్టుకి వెల్లడం వంటివి చేయరు. ఇదే అదనుగా చూసుకుని కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు.

కస్టమర్‌కి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఓలాకి రూ. 95,000 ఫైన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కస్టమర్లు ఏం చేస్తారులే అనుకునే డ్రైవర్లకు ఇది ఒక గుణపాఠం అనే చెప్పాలి. కావున డ్రైవర్లు తమ కష్టమర్లతో తప్పకుండా మంచిగానే ప్రవర్తించాలి. లేకుంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు కూడా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగి ఉంటే మాతో పంచుకోండి, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 22, 2022, 12:23 [IST]
English summary
Hyderabad consumer court ordered to pay rs 95000 for overcharging to ola
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+