హైదరాబాద్‌లో కారు రూఫ్‌పై కూర్చొని ముద్దులతో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో వైరల్
సోషల్ మీడియా క్రేజీ సహా ఇతర కారణాలతో యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. నడిరోడ్డుపై బైక్, కార్లపై విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఆ క్షణం ఆనందంగా ఉన్నామనే భావనలో ఉంటున్నారు కానీ అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఊహించడం లేదు. ఫలితంగా కొన్నిసార్లు భారీ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో బైక్‌లు, కార్లు, మెట్రోలు, నడిరోడ్డులపైనా కూడా యువతీ యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురిలో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా అభ్యంతరంగా ప్రవర్తిస్తున్నారు. హగ్ చేసుకోవడం, నడిరోడ్డుపై ముద్దులు పెట్టుకుంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ధరణి అనే ట్విట్టర్ (X) హ్యాండిల్ నుంచి షేర్ అయింది. హైదరాబాద్ సిటీ పోలీస్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ జంట ప్రవర్తనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఇలాంటివి సాధారణం అయిపోయాయి అంటూ మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.
తాజాగా శంషాబాద్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే కియా కారు ప్రయాణం చేస్తోంది. ఆ కారు రూఫ్‌పై కూర్చున్న యువజంట హగ్ చేసుకొని, ముద్దులతో రెచ్చిపోయారు. ఈ ఘటన అక్టోబర్ 14న అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. నడిరోడ్డుపై ఉన్నామనే విషయం మరిచి అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నప్పుడు ఆ క్షణానికి చాలా సంతోషంగా అనిపించవచ్చు. కారు రూఫ్‌పై ఇలాంటి ఛేష్టలు ఎప్పుడూ ప్రమాదం. వీడియా ఆధారంగా కారు వేగంగా ప్రయాణిస్తోంది. మరియు మలుపులు తిరుగుతూ వెళ్తోంది. ఎక్కడైన అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే.. కారు రూఫ్‌పైన ఎటువంటి భద్రత లేకుండా కూర్చుని ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోతున్న జంట ముందుకు పడిపోయే ప్రమాదం ఉంది.
ఫలితంగా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రాణలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ రోడ్డు ఎక్కువగా రద్దీగా కనిపిస్తోంది. ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా.. భారీ ప్రమాదంగా మారే అవకాశం ఉంది.ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకం మరియు చట్టప్రకారం నేరం.

ఈ వీడియోను వెనుక కారులో ప్రయాణించినవారు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియలేదు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బైక్‌లు, మెట్రోలు, కార్లలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొంతమందిలో ఎటువంటి మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా పోలీసులు భారీ జరిమానా విధిస్తున్నారు. అయినా చాలా మంది ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








