దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌ది నాల్గవ స్థానం

Accidents
హైదరాబాద్.. ఈ పేరు వినగానే మనకు చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రాత్మక కట్టడాల నుండి హైటెక్ సిటీ వంటి అత్యాధునిక కట్టడాల వరకూ గుర్తుకువస్తాయి. శతాబ్ధాల కాలం నుండి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో నాల్గవ స్థానంలో ఉంది. ఎందులో అనుకుంటున్నారా.. "రోడ్డు ప్రమాదల సంఖ్య"లో. అవును ఇది నిజం, రాష్ట్ర రాజధాని రోడ్లు ప్రతినిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం, వాహన ప్రమాదాల్లో రోజుకు 50 మంది మృతి చెందుతుండగా, ఏటా సుమారు 60,000 నుంచి 70,000 మంది క్షతగాత్రులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను బట్టి పరిశీలిస్తే మన రాష్ట్రానిది నాల్గవ స్థానం. ఈ జాబితాలో హారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ రెండవ స్థానంలోనూ‌, తమిళనాడు మూడవ స్థానంలో ఉంది.

అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, సరైన పర్యవేక్షణ లేకపోవడం, మానవ తప్పిదాలు తదితర అంశాల కారణంగా ప్రమాదాలు సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డే. దీనిని ఔటర్ రింగ్ రోడ్డు అనేదాని కన్నా డెత్ రోడ్ అని అనొచ్చేమో. ఈ రోడ్డుపై వెళ్లే యువత వాయు వేగంతో వాహనాలను నడుపుతూ తమ ప్రాణాలతో పాటు, ఇతర ప్రయాణికుల ప్రాణాలను ఇరకాటంలో పడేస్తున్నారు.

కేవలం హైదరాబాద్‌ నగరంలోనే సంవత్సరానికి సుమారు 5,000 మంది మరణిస్తుండగా. 2,000 మందికి పైగా గాయాల పాలవుతున్నారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన లెక్కలు, ఇలా నమోదు అనధికారిక ప్రమాదాలు ఎన్ని ఉన్నాయో. ఈజీ మనీ కోసం రేసులు జరిపేవారు, ఫుల్లుగా పీకల దాకా త్రాగి డ్రైవ్ చేసే యువకులు, లారీ డ్రైవర్లు, సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించే ఆటో రిక్షాలు ఇలాంటి ఎన్నో..! తెలుసుకోండి.. ఇకనైనా మేలుకోండి.. జీవితం ఎంతో విలువైనది.. క్షేమంగా ప్రయాణించండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 29, 2011, 12:05 [IST]
English summary
Andhra Pradesh capital Hyderabad is in the fourth place in India in accidents.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+