భారతదేశంలో ఫస్ట్ Aprilia RS 457 బైక్ కొన్నది ఇతడే.. హైదరాబాదీ అట్లుంటది!
భారతీయ విఫణిలో సూపర్ బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో వాహన ప్రేమికులు కూడా అలాంటి బైకులనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఫస్ట్ ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ కొనుగోలు చేశారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'ఏప్రిలియా ఆర్ఎస్ 457' (Aprilia RS 457) బైక్ యొక్క డెలివెరీలు.. ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే మొట్ట మొదటి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ డెలివరీ మాత్రం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైకుకు సంబంధించిన చాలా వివరాలను తెలుసుకోవచ్చు.

భారతదేశపు మొట్ట మొదటి ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ డెలివరీకి సంబంధించిన వీడియోను ప్రకాష్ సూరజ్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు.. దేశంలోనే మొట్ట మొదటి ఆర్ఎస్ 457 బైక్ డెలివరీ చేసుకోవడంతో హైదరాబాద్ వ్యక్తి సరికొత్త సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ ఏప్రిలియా బైకుకు భారదేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కూడా ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఏప్రిలియా ఆర్ఎస్ 457 (Aprilia RS 457)
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఏప్రిలియా యొక్క ఆర్ఎస్ 457 ఆన్ రోడ్ ధర తెలంగాణలోని హైదరాబాద్‌లో రూ.4.95 లక్షలు. అయితే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.11 లక్షలు. ఈ బైక్ చూడటానికి అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ బైకులో రైడర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి కంపెనీ ఈ కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ కోసం గత డిసెంబర్ నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ బుకింగ్స్ కోసం రెండు ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. మొదటిది రూ.10000 చెల్లించి బుక్ చేసుకోవడం. రెండోది మొత్తం ఎక్స్ షోరూమ్ ధరను చెల్లించి (రూ.4.11 లక్షలు) బుక్ చేసుకోవడం. మొత్తానికి హైదరాబాద్ వ్యక్తి ఫస్ట్ ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ సొంతం చేసుకున్నాడు.
రూ.10000లతో బుక్ చేసుకున్నవారికంటే.. మొత్తం చెల్లించి బుక్ చేసుకున్నవారికి కంపెనీ ఫస్ట్ డెలివరీ చేయడానికి సంకల్పించింది. అయితే మొత్తం డబ్బు చెల్లించి బుక్ చేసుకున్న వారు కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అందులో కూడా హైదరాబాద్ వ్యక్తి ముందుగా బుక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ బైక్ డెలివరీ పొందాడు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ వ్యక్తికి ఈ బైక్ అంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థమైపోతుంది.
మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందిన ఈ కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 48 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 41 మిమీ USD ఫ్రంట్ పోర్క్.. వెనుక వైపు మోనోషాక్ సెటప్ పొందుతుంది.
బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైకు ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్.. వెనకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ మాత్రమే కాకూండా త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఆధునిక ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.


Click it and Unblock the Notifications








