ఓనర్ అంటే ఇలా ఉండాలి.. పనిమనిషికి మరిచిపోలేని గిఫ్ట్.. అభినందిస్తున్న నెటిజన్లు
తమ ఇంట్లో పనిచేసే పనిమనిషి కోసం ఆ ఇంటి యజమాని చేసిన సహాయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయన చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఎవరూ కూడా ఇబ్బందులు(Hyderabad Man Helps Maid) పడరని అంటున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాలను తీర్చుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సిందే. ఇక ఉద్యోగరీత్యా నగరాల్లో నివసించినట్లయితే.. ఇద్దరి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే సంసార జీవితం నెట్టుకురావడం కష్టమవుతుంది. ఈ క్రమంలో ఆర్థికంగా ఎంత సపోర్టింగ్ ఉన్నప్పటికీ.. ఇంటి పనులను హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది.

భార్యకు భర్త.. ఇంటి పనుల్లో సహాయంగా ఉంటున్నప్పటికీ(Hyderabad Man Helps Maid to Buy Cycle) అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. అందుకే ఇంటి పనుల కోసం పనిమనిషిని పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు పనిమనుషులు చాలా దూరం నుంచి వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. ఇల్లు గడవడం కోసం వారికిది తప్పడం లేదు.
ఈ క్రమంలో హైదరాబాద్లో నివసించే నరేష్ అనే వ్యక్తి ఫ్యామిలీ ఇంటి పనుల కోసం ఓ పనిమనిషిని పెట్టుకున్నారు. అయితే ఆ ఇంటి నుంచి ఆ పనిమనిషి ఉండే ఇల్లు చాలా దూరం ఉంటుంది. ఇందుకోసం ఆమె దాదాపు 25 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. ఆ ఇంటితో పాటు ఆమె మరో ఇంట్లో కూడా పనిచేస్తోంది.

దీంతో ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆ ఇంటి యజమాని.. పనిమనిషి సైకిల్ కొనేందుకు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ మోటివేషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ దీనికి 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 4 వేల మందికి పైగా లైక్ చేశారు.
పనిమనిషి ఇళ్లలో పనిచేసేందుకు.. సైకిల్‌పై వచ్చి వెళ్తున్న వీడియోను కూడా తన 'X' ఖాతాలో నరేష్ షేర్ చేశారు. 'మా ఇంట్లో వంటమనిషిగా పనిచేసే నీరజ రోజూ 25 నిమిషాలు నడుస్తుంది. ఆమె 2 ఇళ్లలో పని చేస్తుంది. రోజుకి ఆమె దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు నడుస్తుంది' అని నరేష్ చెప్పారు.

కొనసాగిస్తూ, 'హైదరాబాద్‌లో సైకిల్ మేయర్‌గా పేరున్న సంతాన సెల్వన్ స్ఫూర్తితో సైకిల్ కొనమని చెప్పాను. అయితే, ఇరుగుపొరుగు వారు నవ్వుతారని, జోకులు వేస్తారని ఆమె మొదట్లో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నీరజ అంగీకరించి సైకిల్ కొనుక్కునేందుకు సగం డబ్బు ఇచ్చాను. మిగిలిన డబ్బు పెట్టింది.'
అంతేకాకుండా నరేష్ తన 'ఎక్స్' ఖాతాలో 'ఈ రోజు, నీరజ సైకిల్‌పై పనికి వస్తోందని, దీని ద్వారా ప్రయాణ సమయం 5 నుంచి 7 నిమిషాలు తగ్గింది'. అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మీరు ఆమెకు సైకిల్ హెల్మెట్ బహుమతిగా ఇవ్వండి అని ఓ సోషల్ మీడియా వినియోగదారు వ్యాఖ్యానించారు. నరేష్ కూడా ఇస్తానని బదులిచ్చాడు.
'ఇంట్లో పనిచేసే మగవాళ్ళు, ఆడవాళ్ళు సైకిల్ తొక్కడం బెంగళూరులో చూశానని మరో నెటిజన్ అన్నారు. సైకిల్ తొక్కడంలో తప్పు లేదని.. దీంతో వారికి ప్రయాణ సమయం ఆదా అవుతుందని చెప్పారు. పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని.. సైకిల్ కొనాలంటే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పెట్రోలుతో సహా మెయింటెనెన్స్‌కి డబ్బు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








