రూ.25.5 లక్షల ఖరీదైన నెంబర్ ప్లేట్.. ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కార్లకు, స్పోర్ట్స్ కార్లకు మాత్రమే కాకుండా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్‌లకు కూడా డిమాండ్ విపరీతంగా ఉంది. కొంతమంది లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి పోటీపడి నెంబర్ ప్లేట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బిడ్డింగ్‌లో ఒక కారు యజమాని తన వాహనం కోసం 9999 నెంబర్ సెలక్ట్ చేసుకున్నారు. ఈ నెంబర్ కోసం ఆ వ్యక్తి ఏకంగా రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు తెలిపారు. ఒక నెంబర్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సంబంధించిన ఘటన ఇదే మొదటి సారి కాదు.

Man Spends Rs 25 5 Lakh For Number Plate

ఈ విషయాన్నీ గురించి హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి రమేష్ మాట్లాడుతూ.. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం ఆన్‌లైన్ వేలంలో '9999' అత్యధిక బిడ్ మొత్తానికి అందుకుంది. ఈ నెంబర్ కొనుగోలు చేసిన కారు యజమాని తన హై ఎండ్ నంబర్ ప్లేట్ 'TG-09 9999' కోసం రూ. 2550002 చెల్లించారని పేర్కొన్నారు. అయితే ఈ నెంబర్ కొన్న వ్యక్తికి సంబంధించిన విషయాలు వెల్లడించలేదు.

9999 ఫ్యాన్సీ నెంబర్ కోసం సోమవారం జరిగిన వేలంలో 11 మంది పాల్గొన్నారు. ఇందులో ఒక వ్యక్తి అత్యధికంగా రూ. 25.5 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలంగాణలో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత ఖర్చు చేసిన వారు ఎవరూ లేరని చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టులో 9999 అనే నెంబర్ రూ.21.6 లక్షలు. ఫ్యాన్సీ నెంబర్ కొనాలనుకునే వ్యక్తి రూ. 50000 చెల్లించి ముందుగా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు.

Toyota Land Cruiser

ఖైరతాబాద్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయం సోమవారం ఇతర ఫ్యాన్సీ నంబర్‌ల వేలం పాటలో మొత్తం రూ 43 లక్షలకుపైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చింది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో వాహనాల నంబర్స్ అన్నీ కూడా టీజీగా మారే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేటుగా 'దుబాయ్ పీ 7' రికార్డ్ క్రియేట్ చేసింది. దీని ధర 15 మిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 122 కోట్లు కంటే ఎక్కువ. ఈ వేలాన్ని LLC జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో నిర్వహించింది. 4 మిలియన్ డాలర్ల నుంచి ప్రారంభమయ్యే ఈ పాట కొంత సమయానికే 15 మిలియన్ డాలర్లు చేరింది.

Toyota Land Cruiser Rear Profile

దుబాయ్ పీ 7 అనేది ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. ఇది ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకుంది. దుబాయ్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం 1 బిలియన్ మీల్స్ ఎండోమెంట్ క్యాంపెయిన్‌కు వెళ్లింది. ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ నాయకత్వం వహిస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 24, 2024, 9:08 [IST]
English summary
Hyderabad man spends rs 25 5 lakh for fancy registration number plate
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+