హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ టైమ్ టేబుల్

By Ravi

రాష్ట్ర రాజధాని 'హైదరాబాద్'లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్డుపై రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను మొత్తం ఆరు దశల్లో (6 స్టేజ్స్) పూర్తి చేయనున్నారు. ఇందులో మొదటి దశ మార్చ్ 2015 నాటికి పూర్తి కానుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దశలు, రూట్లు క్రింది విధంగా ఉన్నాయి.

  • స్టేజ్ 1 - నాగోల్ నుంచి మెట్టుగూడ : మార్చ్ 21, 2015
  • స్టేజ్ 2 - మియాపూర్ నుంచి ఎస్.ఆర్. నగర్ : ఆగస్ట్ 15, 2015
  • స్టేజ్ 3 - మెట్టుగూడ నుంచి బేగంపేట్ : నవంబర్ 14, 2015
  • స్టేజ్ 4 - బేగంపేట్ నుంచి శిల్పారామం : ఆగస్ట్ 15, 2016
  • స్టేజ్ 5 - ఎస్.ఆర్. నగర్ నుంచి ఎల్.బి. నగర్ : ఆగస్ట్ 15, 2016
  • స్టేజ్ 6 - జేబిఎస్ నుంచి ఫలక్‌నుమా : జనవరి 1, 2017

పై టైమ్ టేబుల్‌ని బట్టి చూస్తే మరో నాలుగైదేళ్లలో మెట్రో రైల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను విమర్శించేవారు కూడా ఉన్నారు. హై-టెక్ సిటీ వద్ద గడచిన ఐదేళ్లుగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జే ఇంకా ప్రారంభం కాలేదని, అలాంటిది ఈ మెట్రో ప్రాజెక్ట్ ఐదేళ్లలో ఎలా పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఈ ప్రాజెక్టను ఎల్ అండ్ టి సంస్థ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది అనుకున్నసమయానికే ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. మరి మీరేమంటారు..?

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

హైదరాబాద్ మెట్రో రైల్

Most Read Articles

English summary
The much awaited Hyderabad Metro Rail project stage 1 will be be ready by March 21, 2015. Here is the metro construction time table.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X