వాహనదారులకు హైదరాబాద్‌ పోలీసులు ఝలక్‌.. 1000 మోడిఫైడ్‌ బైక్‌ సైలెన్సర్లు ధ్వంసం

మోటారు వాహన చట్టం నిబంధనలను అతిక్రమించి(Police Destroyed Silencers) బైక్‌లకు అక్రమంగా సైలెన్సర్లను అమర్చిన ఘటనపై హైదరాబాద్‌ పోలీసులు స్ట్రాంగ్‌ యాక్షన్‌ తీసుకున్నారు. దాదాపు 1000 మోడిఫైడ్‌ సెలెన్సర్లను ధ్వంసం చేశారు. 1000 మోడిఫైడ్‌ సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.

హైదరాబాద్‌ నగరంలో బైక్‌ సైలెన్సర్లలో మార్పులు చేసి.. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించారు. దాదాపు 1000 మోడిఫైడ్‌ సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని.. రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. అంతేకాకుండా వాహనదారులకు జరిమానా విధించారు.

Modified-Bike-Silencers-Destroyed-Hyderabad

ఘటన అనంతరం వాహనదారులకు నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వీరితో పాటు బైక్‌ మెకానిక్‌లు, ఆటో మొబైల్‌ దుకాణాల యజమానులకు అధిక సౌండ్‌ సైలెన్సర్ల ద్వారా కలిగే సౌండ్‌ పొల్యూషన్‌, ఎయిర్‌ పొల్యూషన్‌పై అవగాహన కల్పించారు. ఎక్కువ శబ్దాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇలా సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడిన ఘటనలపై ఈ ఏడాది ఇప్పటి వరకు 12,938 కేసులు నమోదు చేసినట్లు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే జరిమానాలు కూడా విధిస్తామని పోలీసులు అన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.వెయ్యి జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

Modified-Bike-Silencers-Destroyed-Hyderabad

కానీ వాహనదారులు వరుసగా ఇలా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక సౌండ్‌ ఇచ్చే సైలెన్సర్లలో పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. కాగా వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ ఎలా ఉండాలనేది ఆటోమొబైల్‌ కంపెనీలు పరిశోధన చేస్తాయని సీపీ అన్నారు. ఆ తర్వాతే కంపెనీలు బైక్‌లను తయారు చేస్తాయని వివరించారు.

కాగా ఇటీవలి కాలంలో రోడ్డుపై ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటనలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీని ద్వారా ఇతర వాహనదారులు ఇబ్బందులు పడటమే కాకుండా.. రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇంకా సౌండ్‌ పొల్యూషన్‌తో ప్రజలు అనారోగ్యానికి గురవడంతో పాటు గుండెపోటుకు గురైన సందర్భాలు కూడా ఉంటున్నాయి.

Modified-Bike-Silencers-Destroyed-Hyderabad

ఈ క్రమంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ మహానగరంలో జనాభా పెరగడంతో వాహనాలు కూడా పెరుగుతున్నాయి. క్రమంగా రోడ్లపై కూడా విపరీతంగా ట్రాఫిక్‌ ఏర్పడుతోంది. దీనికి తోడు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా ఎక్కువ కావడంతో ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎప్పటికప్పుడు(Hyderabad Traffic Rules) చర్యలు తీసుకుంటున్నారు. మోటార్‌ వాహన చట్ట నిబంధనలను అతిక్రమించరాదని చెబుతున్నారు. ఇలా ఆఫ్టర్‌ మార్కెట్‌ ద్వారా అధిక సౌండ్‌(Silencers Aftermarket issue) ఇచ్చే సైలెన్సర్లు వినియోగించి పర్యావరణానికి హాని కలిగించవద్దని సూచిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 12, 2024, 18:48 [IST]
English summary
Hyderabad police destroyed 1000 modified bike silencers video here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+