లగ్జరీ కార్లపై ర్యాష్ డ్రైవింగ్.. పోలీసులకు పట్టించిన వీడియోలు.. కోట్లు విలువ చేసే కారు సీజ్
హైదరాబాద్ రోడ్లపై సూపర్ లగ్జరీ కార్లతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఖరీదైన సూపర్ కార్ పోర్శే కయెన్ కారుని సీజ్ చేయగా.. లంబోర్ఘిని డ్రైవర్‌కి నోటీసులు ఇచ్చారుర. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి ఇకపై ఇదొక గుణపాఠం కానుంది.
హైదరాబాద్ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తాయి. అందులో ముఖ్యంగా ఖరీదైన కార్లతో పాటు రకరకాల మోడళ్లతో కూడిన కార్లు, ఇతర స్పోర్ట్స్ వాహనాలు దర్శనమిస్తాయి. అయితే ర్యాష్ డ్రైవింగ్ అనేది ముఖ్యంగా నగరవాసులను వేధిస్తోంది. దీనిపై సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా కొన్నిచోట్ల ఇంకా ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదవుతున్నాయి.

సిటీ రోడ్లపై ఈ రెండు కార్లు చక్కర్లు కొడుతున్న రెండు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మొదటి వీడియోలో పోర్శే కారు ఇతర వాహనాలకు అతి దగ్గరగా వెళ్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వీడియో రికార్డ్ అవ్వడంతో పోలీసులు స్పందించి వెంటనే కారుని సీజ్ చేశారు. ఇలాంటి చర్యలకు ఉపక్రమించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
మరో వీడియోలో లంబోర్ఘిని డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఇతను కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కేవలం నోటీసులను అందించారు. దీనిపై వివరణ ఇవ్వాలని సదరు డ్రైవర్‌ని పోలీసులు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఖరీదైన కార్లలో ఇలాంటి చర్యలు హేయమైనవిగా వారు నోటీసుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా ఈ కేసులను సీరియస్‌గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి వాహనాలు, యజమానుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఇందులోని వీడియో మూడు నెలల క్రితం వీడియో అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ దుబాయ్‌లో ఉండగా అతనికి నోటీసులు జారీ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు పోర్షే కయెన్ ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ అనేది ప్రస్తుతం ప్రతీ నగరంలో వేధిస్తున్న తీవ్రమైన సమస్యగా ఉంది. ఈ వాహనాల ఎగ్జాస్ట్‌లు, వెనుక నుండి పెద్ద శబ్దం వల్ల ఇతరులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఖరీదైన కార్ల డ్రైవర్లు నియంత్రణ కోల్పోతే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ డ్రైవర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. దీనిని నివారించేందుకు స్పీడ్ కంట్రోల్ డిస్ప్లేలు ఇంకా ఎన్నో నియంత్రణ చర్యలు తీసుకున్నా వీటిని పట్టించుకోవడం లేదు. కేవలం పెనాల్టీ నగదు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్‌లు పునరావృతం అవ్వకూడదు అంటే కఠిన చర్యలు ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








