ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

భారత దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి, సామాన్య ప్రజలకు దీనిపై ఉన్న ఆందోళన అంతా ఇంతా కాదు. మన తెలుగు రాష్ట్రాలలో అయితే చెప్పనవసరం లేదు. అయితే హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ తక్కువ ధరకే దొరుకుతోందని తెలుసా.. తెలియకపోతే వివరాలలోకి వెళదాం రండి..

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

సాధారణంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొన్ని సంస్థలు ఎక్కడెక్కడి నుంచో తయారుచేసి తీసుకొస్తారు. దీని వలన వీటిపై టాక్సలు, జిఎస్టి అని ఏవేవో ధరల్ని కలిపి ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా ఎక్కువ ధరతో విక్రయిస్తోంది. అలాగే మనం దేశంలో వాహన ఉపయోగం తక్కువేమి కాదు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

దీని వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతూ పోతోంది. ఈ కాలుష్యంకి ముఖ్యకారణంలో ప్లాస్టిక్ కూడా చెప్పవచ్చు. ఈ పెట్రోల్, ప్లాస్టిక్ గురించి సంబంధం లేకుండా చెప్తున్నాని అనుకొంటున్నారా. అయితే వివరంగా తెలుసుకొందాం రండి...

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

హైదరాబాద్ కు చెందిన 45 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ వాడిన ప్లాస్టిక్ ను పెట్రోల్ తీయచ్చు అనే వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చాడు. అయన పేరు సతీష్ కుమార్, ఈయన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖతో రిజిస్టర్ చేసుకున్న ఒక కంపెనీని స్థాపించాడు,

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

అంతకు మునుపు ప్రొఫెసర్ గా కూడా పని చేసాడు. అయితే దీని గురించి ప్రొఫెసర్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను ఇంధనంగా మార్చే విధానాన్ని వివరించాడు, దీనిని మూడంచెలుగా తాయారు చేయవచ్చు అని ఈ విధానాన్ని ప్లాస్టిక్ పైరోలిసిస్ అంటారు అని అయన చెప్పాడు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

ఈ ప్రక్రియ ప్లాస్టిక్ ను డీజల్, ఏవియేషన్ ఫ్యూయల్ మరియు పెట్రోల్ లోకి రీసైకిల్ చేయడానికి సహాయపడుతుంది. సుమారు 500-కిలోలకు పైగా నాన్ రీసైకిల్ చేయగల ప్లాస్టిక్ ద్వారా 400 లీటర్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

ఇది ఒక సరళమైన ప్రక్రియ, దీనికి నీరు అవసరం లేదు మరియు ఇది తయారు చేసినప్పుడువ్యర్థజలాలను విడుదల చేయదు. శూన్యంలో ఈ ప్రక్రియ జరిగే కొద్దీ గాలిని కలుషితం చేయదు అని కుమార్ చెప్పాడు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

2016 నుండి, ప్రొఫెసర్ 50 టన్నులు ' ఎండ్-లైఫ్ ' ప్లాస్టిక్ (రీసైకిల్ చేయలేని) ను ఇంధనంగా మార్చారు. ప్రస్తుతం ఆయన కంపెనీలో 200 లీటర్ల పెట్రోల్ ను రోజువారీగా 200 కిలోలకు పైగా ప్లాస్టిక్ను ఉపయోగించి ఉత్పత్తి చేసిన దానిని స్థానిక పరిశ్రమల వద్ద లీటర్ కు రూ 40/50 చొప్పున విక్రయిస్తున్నారు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

అయితే వాహనాలకు ఈ ఇంధనం యొక్క వినియోగం ఎలా ఉంటుందో పరీక్షించనున్నారు. PVC (పాలీవినైల్ క్లోరైడ్) మరియు పాలిథిలిన్ టెరిఫథాలేట్ మినహా అన్ని రకాల ప్లాస్టిక్ లు, సెగ్రిగేషన్ అవసరం లేకుండా ఉపయోగించవచ్చు.

ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన హైదరాబాద్ ఇంజనీర్..!

ఈ విధానాన్ని ప్రారంభించడం వెనుక మా ప్రధాన ఉద్దేశం పర్యావరణానికి రక్షించడానికి తోడ్పడడమే.వాణిజ్య ప్రయోజనాలను ఆశించి కాదు. భవిష్యత్తు తరాలకు కలుషితం లేని జీవనాన్ని అందించడం కోసం ప్రయత్నిస్తున్నాం. ఏదైనా ఆసక్తిగల పారిశ్రామికవేత్తతో మా టెక్నాలజీని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ' అని ప్రొఫెసర్ సతీశ్ కుమార్ అన్నారు.

Most Read Articles

English summary
A 45-year-old mechanical engineer from Hyderabad has come up with a novel idea of making petrol out of used plastic.Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X