సంక్రాంతి కానుకగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని.. ఇలాంటి బాస్ మీకు ఉన్నారా..?

సాధారణంగా భారతదేశంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఏదో ఒక పండుగకు బోనస్ లు ఇవ్వడం ఆనవాయితీ, అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ కంపెనీలోని ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన బహుమతులు ఇచ్చి సంతోషపెడుతుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఇలాంటి సంఘటన మరో సారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సంక్రాంతి కానుకగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని.. ఇలాంటి బాస్ మీకు ఉన్నారా..?

నివేదికల ప్రకారం, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సంపంగి గ్రూప్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. కంపెనీలో ఎంపిక చేసిన పది మంది ఉద్యోగులకు కార్లను అందించి అమితానందానికి గురి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి కానుకగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని.. ఇలాంటి బాస్ మీకు ఉన్నారా..?

ఈ సందర్భంగా సంపంగి గ్రూప్ చైర్మన్ రమేశ్ సంపంగి మాట్లాడుతూ.. కంపెనీ యొక్క అభివృద్ధికి అందరూ ఎంతో శ్రమిస్తున్నారని, ఇందులో చాలా రోజుల నుంచి కంపెనీ వృద్ధికి దోహదపడిన 10 మందికి ఇప్పుడు ఖరీదైన కార్లను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కంపెనీ యొక్క ఎదుగుదలకు ఎల్లవేళలా కృషి చేసిన అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నదే తమ కోరిక అని రమేశ్ సంపంగి చెప్పుకొచ్చారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వెల్లడైంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇందులో ఎంజి మోటార్ కంపెనీలు చెందిన ఎంజి ఆస్టర్ కార్లు, కియా కంపెనీ కారు, హ్యుందాయ్ కంపెనీ క్రెటా వంటి వంటి వాటిని చూడవచ్చు. నిజంగా కంపెనీలు పనిచేసే వారికి ఇలాంటి ఖరీదైన గిఫ్ట్స్ అందించడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు.

సంక్రాంతి కానుకగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని.. ఇలాంటి బాస్ మీకు ఉన్నారా..?

గత సంవత్సరం దీపావళి సందర్భంగా, కేరళలో జోబిన్ మరియు జిజ్మీ అనే ఐటి కంపెనీ వారు తమ ఉద్యోగులకు (ఎంపిక చేసిన ఉద్యోగులకు) కార్లను గిఫ్ట్స్ గా అందించారు. కంపెనీ ప్రారంభమై ఇప్పటికి పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఖరీదైన గిఫ్ట్స్ అందించారు.

కంపెనీ తమ ఆరుగురు ఉద్యోగులకు కియా సెల్టోస్ SUV లను అందించారు. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ గిఫ్ట్స్ స్వయంగా కంపెనీ వ్యవస్థాపకులు అందించారు. దీని గురించి వారు మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభమైన ఈ కంపెనీ ఈ రోజు 200 మందికి చేరింది. కంపెనీ అభివృద్ధిలో దోహదపడిన ఉద్యోగుల గురించి ఎంత చెప్పినా తక్కువే, అయితే వారి కృషికి గాను ఈ చిన్న గిఫ్ట్స్ అందించడం జరిగిందని చెప్పారు.

మొత్తమ్ ఆరుమంది ఉద్యోగులకు కియా సెల్టోస్ కార్లను మరియు గత సంవత్సరం మంచి పనితీరుని కనపరచిన ఉద్యోగికి రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 గిఫ్ట్ గా అందించారు. ఉద్యోగులకు ఈ ఖరీదైన గిఫ్ట్స్ అందించడానికి మొత్తమ్ రూ. 1.20 కోట్లు ఖర్చయినట్లు తెలిసింది.

సంక్రాంతి కానుకగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని.. ఇలాంటి బాస్ మీకు ఉన్నారా..?

అంతే కాకుండా తమిళనాడు చెన్నైలో ఉండే చల్లని (CHALLANI) జ్యువెల్లరీ షాప్ యజమాని తమ షాపులో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి కార్లను మరియు బైకులని గిఫ్ట్స్ గా అందించడానికి పూనుకున్నాడు. ఇందులో దాదాపు 1.2 కోట్లు ఖర్చు చేసి 10 కార్లను కొనుగోలు చేసాడు. అంతే కాకుండా 20 వరకు బైకులను కూడా కొనుగోలు చేశారు.

చల్లని జ్యువెల్లరీ షాప్ యజమాని 'జయంతి లాల్‌ ఛయంతి' కొనుగోలు చేసిన 10 కార్లు మారుతి కంపెనీకి చెందినవి ఇక్కడ కనిపించే ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఇక బైకులు మరియు స్కూటర్ విషయానికి వస్తే ఇవన్నీ హోండా మోటార్ సైకిల్ కంపెనీకి చెందినవని తెలుస్తోంది. గత నెల 24 న దీపావళి జరగనుంది. ఈ పండుగకు తన ఉద్యోగులకు గిఫ్ట్స్ గా ఈ కార్లను మరియు బైకులను అందించారు.

Most Read Articles

English summary
Hyderabad sampangi company gifted cars to employees for sankranti festival details
Story first published: Tuesday, January 17, 2023, 6:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X