హైదరాబాద్‌లో 'కదిలే అయోధ్య రామమందిరం'.. ఎన్నో ప్రత్యేకతలు.. నేటి నుంచి ప్రదర్శన..!
అయోధ్యలోని రామమందిరంలో ఈనెల 22న రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందు కోసం అయోధ్య సర్వహంగులు అద్దుకుంటోంది. మరో వైపు ఈ వేడుక కోసం భారత్ సహా యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. అయితే ప్రజలు వివిధ రూపాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్ ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. కారుపై అయోధ్య రామమందిర నిర్మాణాన్ని రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. హైదరాబాద్‌కు చెందిన సుధా కార్ మ్యూజియం.. (Hyderabad Sudha Car Museum) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శనకు ఉంచనున్నట్లు సుధా కార్ మ్యూజియం యాజమాని సుధాకర్ యాదవ్ తెలిపారు.

నిర్మాణానికి రెండు సంవత్సరాల సమయం : ఈ కారుపై అయోధ్య ఆలయం తరహా నిర్మాణం ఏర్పాటుచేసేందుకు (Ayodhya Ram mandir in hyderabad) గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణం కోసం మొత్తం 21 మంది నిపుణులు పనిచేసినట్లు తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్‌పై అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తిచేయడం సంతోషంగా ఉందన్నారు.
ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన.. అనంతరం : జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రదర్శనకు ఉంచుతున్నామని సుధాకర్ యాదవ్ వెల్లడించారు. అనంతరం గ్రామాల్లోకి ఈ వాహనాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. అయోధ్య రామమందిరాన్ని ప్రజల గుమ్మాల వద్దకు తీసుకెళ్తామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణం : ఈ కారు 60 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదని పేర్కొన్నారు. మరియు ఈ మొబైల్ అయోధ్య ఆలయంలో స్టీల్‌తో తయారుచేసిన 216 పిల్లర్లను అమర్చినట్లు తెలిపారు. మిగిలిన పనులను ఫైబర్ వినియోగించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు ఇన్‌బిల్డ్ లైటింగ్ సిస్టమ్ సహా అనేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఫ్రంట్, టెయిల్ లైట్లను అమర్చామన్నారు. మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు చేశారు. అయోధ్య వాసులు మినహా మిగిలిన ప్రజలు ఈ ఆలయాన్ని కేవలం ఫోటోల్లోనే చూశారని... కానీ ఇది కదిలే రామమందిరమని పేర్కొన్నారు. ఈ నిర్మాణం కోసం 21 మంది పనిచేయగా.. అందులో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులు సహా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ట్రస్టు పేర్కొంది.
ప్రజారవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు : అయితే ఇప్పటికే అయోధ్యలో విమానాశ్రయం ప్రారంభం అయింది. పలు సంస్థలు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతోపాటు రైల్వే శాఖ సైతం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈ నెలఖరు వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








