సినిమా పూర్తి కాకముందే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చు.. అలాగే చెన్నై‌కు సైతం!

ఇండియాలో రైల్వే రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచదేశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి రాకెట్ వేగంతో దూసుకుపోయే హై స్పీడ్ రైళ్లను దేశంలో క్రమంగా తీసుకొస్తున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని హై-స్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేస్తుంది. వందే భారత్ వంటి రైళ్లు, సాధారణ రైళ్లు ప్రయాణించే రైలు పట్టాల మాదిరిగా కాకుండా హై-స్పీడ్ ప్రయాణించాలంటే ప్రత్యేకంగా కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం వీటి అభివృద్ధి కోసం భారీగా నిధులను సైతం కేటాయిస్తుంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు రాక ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇవి విమాన ప్రయాణంతో పోటీపడి మరి ప్రయాణిస్తాయి. హై-స్పీడ్ రైళ్లను దేశం అంతటా విస్తరించడానికి కేంద్రం కీలకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో కొత్త కారిడార్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది.

ఈ కొత్త ప్రతిపాదిత హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైలను కలిపే విధంగా ఉండబోతుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని రెండు ప్రధాన నగరాలకు రయ్ మంటూ దూసుకుపోయే రైళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మన దగ్గరి నుంచి తక్కువ సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. దేశంలో ఈ మూడు నగరాలు కూడా అత్యంత అభివృద్ధి చెందినవి.

High Speed Rail Corridor Plan

ఈ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వారు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ రెండు హై-స్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయిన తరువాత హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణించాలంటే 2 గంటల 20 నిమిషాలు, అదే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటలు పడుతుంది.

ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా నివేదించింది. ఇది దాదాపు విమాన ప్రయాణ సమయానికి దగ్గరగా ఉంది. మామూలుగా రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణించాలంటే 10 గంటల వరకు టైం పడుతుంది. అలాగే, హైదరాబాద్ నుంచి చెన్నైకి అయితే ఏకంగా 11 గంటల వరకు సమయం పడుతుంది. మాములుగా అయితే హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాలంటేనే 1 గంట నుంచి 2 గంటల వరకు పడుతుంది.

Hyderabad To Bengaluru High Speed Rail

హైదరాబాద్-బెంగళూరు కారిడార్ 626 కి.మీలు కాగా, హైదరాబాద్-చెన్నైకు 705 కి.మీలుగా కొత్త కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సర్వేకు, ఇతర వాటికి దాదాపు రూ.33 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం ప్రాజెక్ట్‌కు భారీగా ఖర్చవుతుంది. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ లిమిటెడ్ దాని DPR, అలైన్‌మెంట్ డిజైన్, ఇంజనీరింగ్ డాక్యుమెంటేషన్‌తో సహా సైట్ సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది.

ఈ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లయితే ట్రాక్‌పై హై-స్పీడ్ రైలును గంటకు 350 కి.మీ వేగంతో నడిపించవచ్చు. రానున్న కాలంలో మల్టీ-ట్రాకింగ్‌తో పాటు బ్రాడ్ గేజ్ రైల్వే కారిడార్‌లు, ఎలివేటెడ్ ట్రాక్‌లను కూడా నిర్మించనున్నారు. రెండు కారిడార్లలో వయాడక్ట్‌లు, ప్రధాన వంతెనలు, భౌగోళిక మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్, భూమి సేకరణలను నిర్వహించనున్నారు.

Hyderabad To Chennai High Speed Rail

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 14, 2025, 9:10 [IST]
English summary
Hyderabad to bangalore chennai high speed rail carridor plan details check here
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+