శంషాబాద్‌ నుంచి రెండుగా విడిపోయి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు! రాష్ట్రాల ముఖచిత్రం మారబోతోంది!

దేశంలో రైల్వే రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇప్పటి వరకు మనం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మెట్రో రైళ్లు చూసి అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు ఆ దశను దాటుకుని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన బుల్లెట్‌ రైళ్లు మనకు మరింత దగ్గర కావడం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్లను నిర్మిస్తూ, ప్రధాన మెట్రో నగరాల మధ్య ఈ సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కూడా చారిత్రక ప్రాధాన్యత దక్కబోతోంది. ఇటీవల హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి ప్రాథమిక ఆమోదం లభించింది.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల రవాణా రంగంలోనే కాకుండా ఆర్థికాభివృద్ధిలో కూడా విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు వైపు బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లే రోజులు దూరంలో లేవన్న ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు కారిడార్లలో ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే, హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వరకు సుమారు 38.5 కిలోమీటర్ల మార్గం కామన్‌గా ఉంటుంది.

Hyderabad to Chennai and Bengaluru Bullet Train Connectivity Details

అంటే అక్కడి వరకూ ప్రయాణం ఒకే మార్గంలో సాగి, అక్కడి నుంచి రెండు దిశల్లో ఒకటి చెన్నై వైపు, మరొకటి బెంగళూరు వైపు ఎలివేటెడ్‌ కారిడార్లు విస్తరించనున్నాయి. ఇది సాంకేతికంగా కూడిన ప్రణాళికే కాకుండా, రెండు కారిడార్లకు సమాన అవకాశాలను కల్పించనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలు అయితే, హైదరాబాద్‌ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు చేరుకోవడానికి ప్రస్తుతం గంటల తరబడి పట్టే ప్రయాణం, కొన్ని గంటల్లో ముగిసిపోతుంది.

వ్యాపారం, ఉద్యోగాలు, విద్య, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లోనూ కొత్త ఉత్సాహం రాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోని అగ్రశ్రేణి రవాణా సదుపాయాన్ని అనుభవించబోతున్నందుకు ఇది గర్వకారణం. ఈ కారిడార్ల ఏర్పాటు కారణంగా నాలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున ప్రయోజనాలు ఉంటాయి. హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు ప్రతిపాదిత హైస్పీడ్‌ రైలు కారిడార్‌ తెలుగు రాష్ట్రాల గుండెను తాకేలా రూపుదిద్దుకుంటోంది.

Hyderabad to Chennai and Bengaluru Bullet Train Connectivity Details

ఈ కారిడార్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రెండు నగరాలను కలపడం మాత్రమే కాదు, మధ్యలో ఉన్న ముఖ్యమైన పట్టణాలకు, ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి కూడా కనెక్టివిటీని కల్పించబోతోంది. అంటే ఈ ప్రాజెక్టు కేవలం రవాణా మార్గం కాదు, అభివృద్ధి మార్గదర్శి అని చెప్పాలి. తెలంగాణలో ఈ కారిడార్‌ గుండా మొత్తం ఆరు స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మరింత విస్తృతంగా ఎనిమిది స్టేషన్లు ఉండే అవకాం ఉంది.

ఈ స్టేషన్లలో అమరావతి, గుంటూరు, కావలి,చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, తడ వంటి ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటికే రవాణా, వ్యాపారం, విద్య, పరిశ్రమల పరంగా ఉన్న ప్రాధాన్యతను మరింత పెంచుకుంటాయి. తమిళనాడులో ఒక ప్రధాన స్టేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఈ కారిడార్‌ దక్షిణ భారతదేశానికి కొత్త గమ్యం ఇవ్వనుంది. ఇధి పూర్తి స్థాయిలో ఆచరణలోకి వస్తే, హైదరాబాద్‌ నుంచి చెన్నైకి చేరుకోవడం కేవలం కొన్ని గంటల్లో అవుతుంది.

Hyderabad to Chennai and Bengaluru Bullet Train Connectivity Details

ఇక హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ కూడా అంతే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రతిపాదిత స్టేషన్లలో తెలంగాణలో నాలుగు స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు స్టేషన్లు, కర్ణాటకలో మూడు స్టేషన్లు ఉంటాయని తెలుస్తుంది. ఈ మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి నేరుగా దక్షిణ భారత ఐటి హబ్‌ అయిన బెంగళూరుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించనుంది. మొత్తం మీద, హైస్పీడ్‌ కారిడార్లు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రగతికి నాంది పలకబోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, August 30, 2025, 11:50 [IST]
English summary
Hyderabad to chennai and bengaluru bullet train connectivity details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+