వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. వాహనదారులు కూడా సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం వల్లనో లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసుల్లో భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కొన్ని సందర్భాల్లో ఒక వెహికల్ మీద లెక్కకుమించిన చలానాలు జరీ చేయబడి ఉంటాయి. వీటన్నింటిని ఒక్కసారికి క్లియర్ చేయడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

అయితే ప్రస్తుతం ఎలాంటి పెండింగ్ చలనాలను పూర్తిగా క్లియర్ చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక బంపర్ ఆఫర్ వాహనదారుల కోసం తీసుకువచ్చారు. పోలీసులు ప్రకటించినదాని ప్రకారం 2022 మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ రాచకొండ, సైబరాబాద్ పోలీస్ పరిధిలో సుమారు రూ. 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీస్ శాఖ గుర్తించింది. ఈ పెండింగ్ చలానాలు 2022 మార్చి 1 నుండి 31వ తేదీ లోపు చెల్లించిన వారికి డిస్కౌంట్ ప్రకటించింది.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

పోలీసులు ప్రజాటించినదాని ప్రకారం, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న చలనాలలో టూ వీలర్ వినియోగదారు 25 శాతం మాత్రం చెల్లింస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం పోలీస్ శాఖ మాఫీ చేసింది. అదే విధంగా కార్ వినియోగదారులు 50 శాతం, ఆర్టీసీ బస్సులు 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఈ చలానాలు చెల్లించేవారు ఇప్పుడు మీ సేవా, ఆన్లైన్ లో చెల్లించవచ్చని పోలీస్ శాఖ తెలిపింది.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు పెండింగ్ చలానాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు పోలీసులు ప్రకటించిన ఈ అఫర్ వాళ్ళ ఎంతవరకు వసూలవుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది. పెండింగ్ చలాన్ల చెల్లింపు కోసం వాహన దారులు ఈ స్పెషల్ డ్రైవన్ ఉపయోగించుకొంటారని పోలీస్ శాఖాధికారులు చెబుతున్నారు. ఇది వాహనదారులకు ఒక సువర్ణావకాశం.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

హైదరాబాద్ నగరంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. ఇందులో కూడా రాత్రి సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు అర్పిస్తున్నారు. దీనిని నివారించడానికి వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని దానికోసం సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇలాంటి వారు కూడా భారీ మొత్తంలో చలానాలు చెలించాల్సి ఉంది. ఈ స్పెషల్ డ్రైవ్ వీరికి చాలా ఉపయోగపడుతుంది.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

నగరంలో ఇప్పుడు చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నివారించడానికి మద్యం తాగి వాహనాలు నేడిపేవారిపైన పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసులు రాత్రిపూట కూడా గస్తీ కాస్తున్నారు. దీనికోసం సుమారుగా నగరంలో 2,500 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అయినప్పటికీ దీనిని పూర్తిగా తగ్గించలేకపోతున్నారు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. వాహనాలపైన చలాన్ ఉంటే అప్పుడు చెల్లించేయండి.. డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది

సాధారణంగా ఒక వాహనంపైన ఏదైనా చలాన్ పెండింగ్ లో ఉంటె, పోలీసులు ఆపినప్పుడు ఆ లిస్ట్ మొత్తం, అంటే ఆ వాహనంపైన ఇప్పటికి ఎన్ని చలానాలు ఉన్నాయి అనే విషయం తెలిసిపోతుంది. కావున ఆ సమయంలో వాహన వినియోగదారులు ఎక్కువ ఇబ్బందులకు గురవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వారు త్వరలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని వాహన దారులకు పోలీస్ శాఖ సూచిస్తోంది.

Note: Images are representative purpose only.

Article Published On: Wednesday, February 23, 2022, 19:21 [IST]
English summary
Hyderbad traffic police e challan discount announced details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+