అమరావతి-విజయవాడ మధ్య హైపర్‌లూప్: అధికారిక ఒప్పందం చేసుకున్న ఏపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి విజయవాడ మధ్య హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ఏపి ప్రభుత్వం హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్‌(HTT)తో అధికారికంగా భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది.

By Anil

భారతదేశపు తొలి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి విజయవాడ మధ్య హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ఏపి ప్రభుత్వం హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్‌(HTT)తో అధికారికంగా భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

ఇప్పటికీ నమ్మని వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే, ఇది అక్షరాలా నిజం. ప్రయివేట్ ఇన్వెస్టర్ల నుండి నిధులు సేకరించి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అమరావతి మరియు విజయవాడ నగరాలను కలిపే విధంగా హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వ మరియు HTT సంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

గంటకు 40 నుండి 80 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించే రాష్ట్రంలో కనీసం మెట్రో రైలు కూడా లేని చోటకు ఏకంగా హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గంట పాటు ఉన్న ప్రయాణం సమయం 5 నుండి 10 నిమిషాల్లోకే రానుంది.

Recommended Video

2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

HTT బృందం తొలి దశ పనుల్లో భాగంగా ఆరు నెలల పాటు అధ్యయనం చేయనుంది. రెండు నగరాలను పరిశీలించే అనుకూలమైన ప్రాంతాలు మరియు అవకాశాలను గురించి అధ్యయనం చేయనున్నారు. అక్టోబర్‌లో తొలి దశ అధ్యయనం ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

రెండవ దశ క్రింద, పూర్తి స్థాయి ప్రణాళికలతో ప్రయివేట్ పెట్టుబడిదారులతో ప్రభుత్వ మరియు ప్రయివేట్ భాగస్వామ్యంతో HTT సంస్థ హైపర్‌లూప్ పనులు ప్రారంభించనుంది. ఐదు కోట్ల మందితో జనాభా పరంగా ఇండియాలో ఏడవ అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు మొట్టమొదటి హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ పూర్తి స్థాయి కార్యరూపం దాల్చనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ప్రపంచానికి పరిచయం అవుతున్న హైపర్‌లూప్ రవణాను ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం చేయడం ద్వారా టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు సుస్థిరమైన ఆభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లీడర్‌గా రాణించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

హైపర్‌లూప్ నిర్మాణంలో ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ది మండలి (APEDB) కూడా HTT సంస్థకు తోడ్పాటునందించనుంది. అంతే కాకుండా HTT సంస్థ స్థానిక వాటాదారులను చేర్చుకుని వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసి, మరో ప్రాజెక్ట్ చేపట్టాలని భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

భారత్‌దేశంలోనే తొలి హైపర్‌లూప్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆనందంగా ఉందని హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్ ఛైర్మెన్ మరియు కో-ఫౌండర్ బిబోప్ గ్రెస్టా తెలిపాడు.

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ది మండలి ప్రధానాధికారి క్రిష్ణ కిశోర్ మాట్లాడుతూ, " ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు రద్దీ, వాహన కాలుష్య మరియు సౌలభ్యం వంటి అంశాల పరంగా సరైన రవాణా వ్యవస్థను నిర్మించుకోవడంలో విఫలమయ్యాయి, ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ రవాణా వ్యవస్థ ముఖ చిత్రాన్నే మార్చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. అందులో భాగంగానే అమరావతి మరియు విజయవాడ మధ్య హైపర్‌లూప్ రవాణా మార్గానికి ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చాడు."

ఆంధ్రప్రదేశ్‌లో హైపర్‌లూప్

కాలుష్య రహిత రవాణా, సులభమైన, సౌకర్యవంతమైన మరియు త్వరిత రవాణా, రవాణా కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో భారత్ ప్రపంచ పంటలో నిలవనుంది. హైపర్‌లూప్ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చితే రవాణాలో మరో కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Hyperloop Officially Coming to India! First Line to Connect Amravati and Vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X