శబ్దానికన్నా ఆరు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్
ఒకానొక కాలంలో ప్రయాణించడానికి ప్రయాణ సాధనాలు ఉంటే చాలు. కాని నేటి ఆధునిక కాలంలో సమయం ఎంతో విలువైనది. అందుకే అత్యంత వేగవంతమైన ప్రయాణ సాధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎక్కువగా విమానాలు మరియు ఎయిర్ క్రాఫ్ట్‌లకు ఎక్కువ ప్రాధాన్యం.
లాక్‌హీడ్ అనే సంస్థ ఎంతో కాలం నుండి హైపర్‌సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను తయారు చేస్తోంది. దీని వేగం ఎంతో తెలుసా శబ్దం యొక్క వేగానికన్నా ఆరు రెట్లు ఎక్కువ. చాలా నిరీక్షణ తరువాత ఇది ఇప్పుడు ఎగరడానికి సిద్దమైంది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో

ఈ హైపర్ సోనిక్ ప్లేన్ వేగం కన్నా ఆరు రెట్లు ఎక్కువ వేగంతో పరుగులు పెడుతుంది. ఇది కంకోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది.

అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తమ ఎస్-72 అనే ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంత వేగంతో పరుగులు పెడుతుంది అని తెలిపారు. మ్యాక్ 6 వేగంతో ఇది పరుగులు పెడుతుంది కాబట్టి దీనిని హైపర్‌సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటారు.

మ్యాక్ 5 నుండి 10 మధ్య వేగంతో ప్రయాణించే విమాన సాధాలను హైపర్‌సోనిక్ ప్లేన్లు అంటారు. కిలోమీటర్లలో అయితే ఇవి 6,150 నుండి 12,300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

దీనిని రక్షణ రంగంలో వినియోగించేందుకు వీలుగా ఉండేలా ఇందులో అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాలను దీని ద్వారా ఆపరేట్ చేసేలే రూపొందించే పనిలో ఉన్నారు. దీనిని అభివృద్ది చేయడానికి మరో ఏడాది సమయం తీసుకోకున్నట్లు తెలిపారు.

ఇంత వేగానికి కారణం స్క్రామ్‌జెట్ ఇంజన్. దీని ఇంజన్‌లో ఎక్కువ పీడనం వద్ద ఉన్న గాలిలోకి ఇంధనాన్ని పంపుతారు. వేడిగా ఆవిరి రూపంలో ఉన్న గాలి ఇంధనంతో కలిసి మండి విమానం ప్రయాణించే దిశ మీద ఒత్తిడిని కలిగించి పూర్తిగా మండిన వాయువులు ఎగ్జాస్ట్ ద్వారా వెనక నుండి బయటకు వచ్చేస్తాయి.

అయితే సాధారణ జెట్ ఇంజన్‌లలో ఒత్తిడితో నిండిన గాలి ఇంజన్‌లోనికి ఫ్యాన్ బ్లేడ్స్ ద్వారా చేరుతుంది.

ఎస్‌ఆర్-72 హైపర్‌సోనిక్ ప్లేన్ ధర సుమారుగా 66189950000 రుపాయలు. అమెరికన్ డాలర్లలో అయితే 100 కోట్ల అమెరికన్ డాలర్లు లేదా 1 బిలియన్ డాలర్లు అని చెప్పవచ్చు.

ఈ ఇందులో వినియోగించే ఇంజన్‌ను లాక్‌హాడ్ వారి ఎఫ్ 22 ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో వినియోగించుకోవచ్చు. ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లలో ఈ ఎఫ్ 22 అత్యంత అధునాతనమైనది.

కొన్ని సంతవర్సాల క్రితం అమెరికా మెలిటరీ విభాగం అరోరా అనే కోడ్ పేరుతో రహస్యంగా హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ది చేసుకున్నట్లు కొన్ని మిర్శలు వచ్చాయి.

అయితే అరోరా ఎయిర్‌క్రాఫ్ట్‌ను 1989 నుండి అభివృద్ది చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఇది మ్యాక్ 11.8 వేగాన్ని చేరుకోగలదు.

- ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా
- ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్ విమానాలు: మరింత చదవండి


Click it and Unblock the Notifications








