2022లో హ్యూందాయ్ క్రెటా, బజాజ్ పల్సర్ లు టాప్..ఓ సర్వేలో వెల్లడి!!

దేశంలో ఇప్పటివరకూ చాలా వాహనాలు విడుదల అవుతున్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే క్లిక్ అవుతాయి. 2022లో హ్యుందాయ్​ కు చెందిన క్రెటా SUV, బజాజ్​ ఆటోకు చెందిన పల్సర్​ బైక్​ లు అత్యంత ప్రజాదరణ పొందిన కారు, బైక్ లుగా నిలిచాయి. ఇంతకీ వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏముందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

ప్రస్తుతం ఇండియాలో ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమోబైల్ మార్కెట్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఓ ఆటో ఈ-కామర్స్​ సంస్థ అధ్యయనం చేపట్టిన సర్వే ప్రకారం.. హ్యుందాయ్​ క్రెటా SUV, బజాజ్​ పల్సర్​ బైక్ ​లు తొలి స్థానంలో నిలిచాయి.

హ్యూండాయ్ కారు

డ్రూమ్స్ అనే సంస్థ యాన్యువల్​ 'ఇండియా ఆటోమొబైల్​ ఈకామర్స్​ రిపోర్ట్​' ను విడుదల చేసింది. దాని లెక్కల ప్రకారం​ 2022లో భారత్ లో కొరియన్​ సంస్థల హవా నడుస్తోందని అధ్యయనం పేర్కొంది. అత్యంత ప్రజాదారణ పొందిన కారుగా హ్యుందాయ్​ క్రెటా తొలి స్థానాన్ని సంపాదించింది. అలానే మరో కొరియన్​ సంస్థకు చెందిన కియా సెల్టోస్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో మారుతీ సుజుకీ విటారా బ్రెజా నిలిచింది.

మల్టి పర్పస్ వెహికిల్ విభాగంతో పాటు SUV జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్​లు నిలిచాయి. ఇక లగ్జరీ వాహనాల సెగ్మెంట్ ​లో అత్యంత ప్రజాదారణ పొందిన సంస్థగా మెర్సిడెస్​ బెంజ్​ గుర్తింపు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచే గతేడాది విడుదలైన ఈ- క్లాస్​ కు మంచి ఆధరణ వచ్చింది. జీప్​ కంపాస్​, మెర్సిడెస్​ బెంజ్​ సీ క్లాస్​, బీఎండబ్ల్యూ-5లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

హ్యూండాయ్ క్రెటా

2 వీలర్​ ల బజాజ్​ మేటి..!

టూ వీలర్​ విభాగంలో.. బజాజ్​ ఆటో బైక్స్ ఎక్కువగా ప్రజాదారణ పొందినట్లు సర్వే వెల్లడించింది. హీరో మోటోకార్ప్ కంటే భారతీయుల్లో బజాజ్​ పల్సర్ ​కు భారీగా ప్రజాదారణ లభించినట్లు అధ్యయనం పేర్కొంది. హీరో స్ప్లెండర్​ ప్లస్​, బజాజ్​ పల్సర్​ NS​, టీవీఎస్​ అపాచీ RTR​, హోండా సీబీ షైన్​ బైక్ లు తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి. ఇవి కాకుండా మిగతా బైక్ లు తక్కువ మొత్తంలో అమ్ముడయ్యాడని సర్వే పేర్కొంది.

ఇక లగ్జరీ బైక్స్​ విభాగంలో రాయల్​ ఎన్​ఫీల్డ్​​, హార్లీ డేవిడ్ ​సన్​ స్ట్రీట్​ 750, కవాసాకీ నింజా ZX​-10 R​ వంటి ప్రముఖ బైక్స్ మంచి ప్రజాదారణను పొందాయని సర్వే తెలిపింది. వీటితో పాటు ఎలక్ట్రిక్ బైక్స్ పెరుగనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే ప్రీమియం బైక్స్ వివిధ మోడళ్లలో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

బజాజ్ పల్సర్

తగ్గుతున్న డీజిల్ కార్ల వినియోగం..

ప్రస్తుతం పెరుగుతున్న కార్లలో ఆటోమెటిక్​ గేర్​ కార్లు అధికంగా ఉన్నాయి. 2015లో ఈ కేటగిరి​ వాహనాల వాటా 23శాతంగా ఉండగా.. 2022కు అది 33శాతానికి ఎగబాకింది. ఈజీ యాక్సెస్ తో పాటు మంచి ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ కల్పిస్తుండటంతో ఈ ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుంది.

దేశంలో ప్రస్తుతం డీజిల్ వాహనాలకు ప్రజాదారణ తగ్గిపోతోందని అధ్యయనం తెలిపింది. 2021లో డీజిల్​ వాహనాల వాటా 60శాతంగా ఉండేది. కానీ తాజాగా 2022లో వీటి వినియోగం 53శాతానికి పడిపోయింది. అదే సమయంలో మొత్తం వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ వాటా ఇంకా 1 శాతంగానే ఉందని పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ లో హ్యుందాయ్ క్రెటా ధర దాదాపు రూ.10 లక్షల నుంచి 19 లక్షల మధ్యం ఉంది. అలానే వివిధ వేరియంట్ల ఆధారంగా బజాజ్ పల్సర్ ధరలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 28, 2023, 17:05 [IST]
English summary
Hyundai creta and bajaj pulsar are most top car and bike in the country
Read more on: #సర్వే #survey
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+