130 కి.మీ వేగంతో డివైడర్, చెట్లను ఢీకొట్టిన కారు.. ప్రాణాలతో బయటపడ్డాక జోకులేసుకున్న యువకులు..!!

లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టంగా కొనుగోలు చేసిన కారును.. సంబంధిత యజమానులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. దాని మీద చిన్న మరక లేదా గీతలు పడినా తట్టుకోలేరు. ఇక ప్రమాదం జరిగితే వారి కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లుగా భావిస్తారు. కానీ ఇక్కడ వీరి ప్రవర్తన చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది.

ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అయినా అదేమీ పట్టించుకోకుండా అందులో ప్రయాణించిన ఇద్దరు యువకులు ఘటనపై జోకులు వేసుకుంటూ డ్యామేజ్ అయిన కారును ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Hyundai-Creta-Crash

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి హ్యుందాయ్ క్రెటా( Hyundai Creta) ఎస్‌యూవీని నడుపుతున్నాడు. ఆ కారు దాదాపు గంటకు 130 వేగంతో ప్రయాణిస్తోంది. ఈ వేగంతో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ వంకలు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో అతివేగంతో అకస్మాత్తుగా కారు అదుపుతప్పి మొదట ఫ్లై ఓవర్ రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండటంతో అక్కడితో ఆగకుండా అనంతరం రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. దీంతో కారు ముందు, పక్క భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Hyundai-Creta-Crash

ఇంత ఘోర ప్రమాదం జరిగినా కూడా కారులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యంగా వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తూ చిన్న గాయాలు కూడా లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇక్కడే వారు బతుకు జీవుడా అంటూ సంతోషపడకుండా జరిగిన ప్రమాదంపై జోకులు వేసుకున్నారు.

ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బ తినడంతో అందులోని ఇద్దరు యువకులు రోడ్డుపక్కన దిగాలుగా కూర్చొని ఉండగా, మరో ఇద్దరు యువకులు కారును టీజ్ చేస్తూ ఎగతాళి చేస్తూ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికే కారు ఇలాంటి ప్రమాదానికి గురైందని, ఇది రెండో ప్రమాదమని వారు తెలిపారు.

Hyundai-Creta-Crash

దీని ద్వారా యువకులు తరచుగా అతి వేగంతో కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కారు లోపల ఒక పోలీసు క్యాప్ ఉండటాన్ని చూడవచ్చు. దీన్ని బట్టి ఈ కారు డ్రైవర్ తప్పనిసరిగా పోలీసు అయి ఉండాలి. లేదా కారులో ఉన్న వారిలో ఒకరిది పోలీసు నేపథ్యమైనా అయి ఉండాలి.

రాత్రి సమయంలో పబ్లిక్ రోడ్డుపై హ్యుందాయ్ క్రెటా కారును గంటకు 130 కి.మీ.ల వేగంతో నడపడంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. అంతేకాకుండా కారులో పిచ్చాపాటి మాట్లాడుకోవడం కూడా చూస్తుంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 'స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్' అని హెచ్చరిస్తున్నారు.

ఇక ప్రమాదానికి గురైన హ్యుందాయ్ క్రెటా కారు విషయానికొస్తే ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కారు. ఆసియా NCAP క్రాష్ టెస్ట్‌లోనే క్రెటా ఈ సూపర్ రేటింగ్‌ను పొందడం గమనార్హం. దాని రేటింగ్ కారణంగానే అత్యంత ఘోరమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా, యువకులు సురక్షితంగా బయటపడ్డారు.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. ఈ రకమైన కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అవి డిజైన్‌లో అస్థిరంగా ఉన్నాయి. దీని అర్థం SUVలు విపరీతమైన వేగాన్ని నిర్వహించగల సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి కారణంగా ఎక్కువగా ఈ కారు ప్రమాదాలకు గురవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 22, 2023, 15:52 [IST]
English summary
Hyundai creta crash at high speed of 130 kmph youth cracking jokes after the crash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+