వోక్స్‌వ్యాగన్‌ను ఢీకొట్టిన హ్యుందాయ్ క్రెటా... అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు?
భారత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అనేక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆయా ప్రదేశాల్లోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నిర్వహించే నిర్దిష్ట పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండానే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి వారు రవాణా శాఖ అధికారులు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం లేదు.
దీంతో అలాంటి వ్యక్తులు దళారులను ఆశ్రయిస్తున్నారు. లైసెన్స్ కావాల్సిన వ్యక్తుల దగ్గర నుంచి నగదు తీసుకుంటున్న దళారులు.. లైసెన్స్ పొందేందుకు సరైన అర్హత లేకున్నా.. లైసెన్స్ మంజూరు అయ్యేలా చేస్తున్నారు. దళారుల సాయంతో లైసెన్స్ పొందిన వ్యక్తులు కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు.

డ్రైవింగ్‌పై పూర్తిగా అవగాహన లేకపోవడంతో : తాజాగా సుమారుగా అటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. లైసెన్స్ కలిగి ఉన్న ఓ మహిళ డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక రోడ్డు ప్రమాదానికి కారణం అయింది. హ్యుందాయ్ క్రెటా వాహనాన్ని నడుపుతున్న మహిళా డ్రైవర్.. వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్‌ను ఢీకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖిల్ రానా తన యూట్యూబ్‌లో షేర్ చేశారు.
నిఖిల్ రానాను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వోక్స్‌వ్యాగన్ వర్టస్ యజమాని.. నిఖిల్ రానాకు ఈ-మెయిల్ చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటాను డ్రైవింగ్ చేస్తున్న మహిళ.. ఎదురుగా ఉన్న వర్టస్ సెడాన్‌ను ఢీకొట్టింది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ సెడాన్ డ్యామేజీ అయింది. ఈ కారును నెల రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

విండ్‌స్క్రీన్‌పై L బ్యాడ్జ్ : అయితే ప్రమాదం అనంతరం కారును రివర్స్ చేసేందుకు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహిళ విఫలయత్నం చేశారు. చివరికి పక్క సీట్లో కూర్చొన్న మరో వ్యక్తి... డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును వెనక్కి తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రెటా వాహనం విండ్‌స్క్రీన్‌పై L బ్యాడ్జ్‌ని గుర్తించవచ్చు.
పోలీస్ అధికారా..? : అయితే ఈ మహిళ 2014లోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. అయితే గేర్లు మార్చడం కూడా తెలియని వ్యక్తులకు డ్రైవింగ్ లైసైన్స్ ఎలా జారీచేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వోక్స్‌వ్యాగన్ వర్టస్ యజమాని.. నిఖిల్ రానాకు పంపిన మెయిల్‌లో కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ తాను ఓ పోలీస్ అధికారి అని చెప్పినట్లు తెలిసింది.

డ్రైవింగ్‌పైన సరైన అవగాహన లేకుండా రోడ్లపైన వాహనాలను డ్రైవింగ్ చేయడం సురక్షితంగా కాదు. మైదానాలు సహా వినియోగంలో లేని రోడ్లపై పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకోవాలి. పూర్తిగా డ్రైవింగ్ రాకుండా రోడ్డుపైన వాహనాలను డ్రైవింగ్ చేయడం సురక్షితంగా కాదు. ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








