పనిమనిషికి జావితాంతం గుర్తుండే గిఫ్ట్ ఇచ్చిన మనసున్న కుటుంభం.. వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా పనిమనిషి పనితనం నచ్చితే జీతం పెంచుతారు, అయితే ఒక కుటుంబం తమ పనిమనిషికి ఏకంగా ఒక కారునే గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
భారతదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు క్రిస్మస్ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగానే చాలామంది వ్యక్తులు కానుకలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఒక కుటుంభం తమ పని మనిషికి హ్యుందాయ్ కంపెనీ యొక్క ఎలాంట్రా కారుని గిఫ్ట్ గా అందిస్తుంది. నిజానికి ఇలాంటి గిఫ్ట్స్ పనిమనుషులు ఇవ్వడం చాలా అరుదు.

ఇలాంటి సంఘటనలు సంపన్న దేశాల్లో అక్కడక్కడా జరగవచ్చు, కానీ భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగటం చాలా అరుదు అనే చెప్పాలి. ఈ వీడియోలో మొదట ఆ కుటుంబంలోని స్త్రీ, ఆ తరువాత తమ పనిమనిషి వస్తారు. వారి వెంటే ఆ ఇంటి యజమాని రావడం చూడవచ్చు. ఆ సమయంలో ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి కార్ యొక్క కీ (తాళం) అందిస్తాడు. అది తనకేనా అనుకుంటూ ఆమె ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైపోయింది.
తనకే అని తెలుసుకున్న తరువాత ఆ ఇంటి యజమానిని కౌగిలించుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. ఆ తరువాత అందరూ కలిసి హ్యుందాయ్ ఎలాంట్రా కారు వద్దకు వెళతారు. అప్పుడు కారు కీ ఉపయోగించి ఆమె కారు డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంటుంది. ఇంతటితో మనకు వీడియో ముగుస్తుంది. ఈ వీడియోకి ఇప్పటికి 85 వేలకుపైగా లైక్స్, 3-వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
విదేశాల్లో ఉండే పనిమనుషులను హౌస్ కీపర్స్ అంటారు. అయితే మన దేశంలో హౌస్ కీపర్స్ అనే పదం ఉపయోగించడం చాలా అరుదు. హౌస్ కీపర్స్ జీతం ఎలా ఉంటుందో దాదాపు అందరికి తెలుసు. అయితే కొంతమంది కుటుంబీకులు మాత్రమే వారికి అప్పుడప్పుడు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి వారిని సంతోసింపజేస్తుంటారు. ఇటీవల విడుదలైన వీడియో @stephhollman ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియో చూసిన చాలామంది ఆ కుంటుంబాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ నా పిల్లలు వారు పొందగలిగే ఏదైనా బహుమతి కంటే ఇది మంచిదని హ్యాపీ హాలిడేస్ ఫ్రెండ్స్ అంటూ రాసుకొచ్చారు. నిజంగా కుటుంభం కోసం పనిచేసేవారికి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం చాలా అరుదు. ఆ కుటుంభం నిజంగానే గొప్ప మనసున్న కుటుంభం అనే చెప్పాలి. ఏదైనా గిఫ్ట్స్ అందిస్తూ పనివాళ్లను కూడా మనవాళ్ళ మాదిరిగా ఆదరించినప్పుడే వారు మనకోసం మరింత అంకిత భావంతో పనిచేస్తారు.
ఇక హ్యుందాయ్ ఎలంట్రా విషయానికి వస్తే, ఇది భారతదేశంలో ఎలంట్రా పేరుతో విక్రయించబడుతుంది. అయితే ఈ కారుకు అంతర్జాతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ అవంటే పేరుతో విక్రయిస్తున్నారు. ఇది 2018 నుండి 2020 మధ్య నిర్మించబడింది. ఇది మంచి డిజైన్ మరియు పరికరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంజిన్ ఉంటుంది. కావున మంచి పనితీరుని కూడా అందిస్తుంది.
హ్యుందాయ్ ఎలంట్రాలోని 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 124 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇది LED DRL మరియు హాలోజన్ ప్రొజెక్టర్ వంటి వాటితో ఆకర్షణీయంగా ఉంటుంది. అదే సమయంలో ఇది 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలిగి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








