స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారతదేశంలో కెల్లా రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతున్న తెలిసినదే. గడచిన రెండు దశాబ్దాలుగా హ్యుందాయ్ భారత మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సమయంలో కంపెనీ చిన్న కార్ల నుండి లగ్జరీ కార్లకు వరకూ ప్రవేశపెట్టింది.

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్లు, ప్రీమియం సెడాన్లు, ఎస్‌యూవీలు మరియు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ అందిస్తున్న ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌కు భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ధరకు తగిన విలువ, విలువకు తగిన ఫీచర్లతో ఇది భారతదేశంలోనే బెస్ట్ ప్రీమియం సెడాన్‌గా ఉంది.

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

అలాంటి ఈ ప్రీమియం సెడాన్ ఎలాంట్రాను ఓ ఔత్సాహికుడు స్పోర్ట్స్ కార్ మాదిరిగా మోడిఫై చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. విశాల్ జాండర్ అనే యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేశారు.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

ఈ మోడిఫైడ్ హ్యుందాయ్ ఎలాంట్రా కారును స్టైలిష్ స్పోర్టీ యల్లో కలర్‌లో బాడీ ప్రీమియం పియాన్ బ్లాక్ డీటేలింగ్స్‌తో తయారు చేశారు. చూడటానికి ఇదొక స్పోర్ట్స్ కారులా, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో సదరు కార్ మోడిఫైయర్ పనితీరు, ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది.

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

ఇందులో ప్రంట్ అండ్ రియర్ బంపర్లను పూర్తిగా మోడిఫై చేశారు. వెనుక వైపు స్పాయిలర్‌ను జోడించారు. అంతేకాకుండా, అల్లాయ్ వీల్స్‌ని కూడా కస్టమైజ్ చేశారు, వాటిపై లో ప్రొఫైల్ స్పోర్టీ టైర్లను అమర్చారు. సైడ్ బాడీపై కొత్త స్పోర్టీ ప్యానెళ్లను కూడా ఇందులో అమర్చారు.

MOST READ:రోడ్లపై గుంతలు పూడ్చే ప్రత్యేక యంత్రం.. నిజంగా సూపర్ గురూ

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

స్టాండర్డ్ ఎలాంట్రా కారులో కనిపించే క్రోమ్ యాక్సెంట్స్‌ని పియానో ​​బ్లాక్ యాక్సెంట్స్‌తో రీప్లేస్ చేశారు. అల్లాయ్ వీల్స్ లోపల ఉన్న బ్రేక్ కాలిపర్లను కూడా యల్లో కలర్‌లోనే పెయింట్ చేశారు. ఇవి కారు స్పోర్టీ రూపాన్ని మరింత పెంచడంలో సహకరిస్తాయి.

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

ఈ మోడిఫైడ్ కారులోని హెడ్‌లైట్ యూనిట్‌ని కూడా మోడిఫై చేశారు. ఇప్పుడు, హెడ్‌ల్యాంప్‌లోనే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. టెయిల్ లైట్స్ కూడా ఎల్ఈడి రూపంలోనే మోడిఫై చేశారు. ఈ సెటప్ స్మోక్ ఫినిషింగ్‌లో ఉంటుంది.

MOST READ:టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

కారులోని ఇంటీరియర్స్‌ని కూడా పూర్తిగా మోడిఫై చేశారు. స్టాండర్డ్ ఎలాంట్రాతో పోల్చుకుంటే, ఇందులోని క్యాబిన్ లేఅవుట్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఎక్స్టీరియర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యేలా ఇంటీరియర్ అప్‌హోలెస్ట్రీని బ్లాక్ అండ్ యల్లో కలర్‌లో డిజైన్ చేశారు.

ఇంకా ఇందులో డ్యూయల్ టోన్ అల్కాంటారా ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, స్టార్ లైట్‌తో కూడిన బ్లాక్ రూఫ్ లైనర్ కూడా ఉంటుంది. అయితే, ఈ కారు ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మొత్తంగా చూసుకుంటే, ఈ మోడిఫైడ్ ఎలాంట్రా చాలా స్పోర్టీగా, ప్రతి ఒక్కరూ కావాలనుకునేలా ఉంటుంది.

MOST READ:కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?

Most Read Articles

English summary
Hyundai Elantra Modified As Sports Car In Lamborghini Style Yellow Paint Scheme. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X